న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఓటర్లపై ఉచితాల వల విసురుతున్నాయి. మళ్లీ అధికారం అప్పగిస్తే ఉచిత పథకాలు అమలు చేస్తామని, ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తామని హామీ ఇస్తున్నాయి.
ప్రజాధనాన్ని దురి్వనియోగం అవుతోందని, ఈ ఉచిత పథకాలను అడ్డుకోవాలని కోరుతూ భట్టూలాల్ జైన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment