పిటిషన్లను విచారిస్తామన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రాజకీయ పారీ్టలు ఎన్నికల వేళ ఇస్తున్న ఉచిత హామీలపై తప్పకుండా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు బుధవా రం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు ఉచితాలపై హామీలు గుప్పించడం.. అత్యంత ము ఖ్యమైన అంశమని, వాటిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జే.బి.పారి్థవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఉచితాలను సవాల్ చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ బుధవారం బిజినెస్ లిస్టులో ఈ పిటిషన్లు ఉన్నాయని, వాటిని విచారణకు స్వీకరించాలని కోరారు. తమ పిల్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం లేదని, దీన్ని మరో తేదీన విచారించడానికి వీలుగా జాబితాలో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ.. ఇది అత్యంత ముఖ్యమైన అంశం. దీన్ని కాజ్ లిస్టులో నుంచి తొలగించబోం’అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment