Ashwini Upadhyay
-
‘ఉచిత హామీ’లపై విచారణ జరుపుతాం
న్యూఢిల్లీ: రాజకీయ పారీ్టలు ఎన్నికల వేళ ఇస్తున్న ఉచిత హామీలపై తప్పకుండా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు బుధవా రం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు ఉచితాలపై హామీలు గుప్పించడం.. అత్యంత ము ఖ్యమైన అంశమని, వాటిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జే.బి.పారి్థవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఉచితాలను సవాల్ చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ బుధవారం బిజినెస్ లిస్టులో ఈ పిటిషన్లు ఉన్నాయని, వాటిని విచారణకు స్వీకరించాలని కోరారు. తమ పిల్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం లేదని, దీన్ని మరో తేదీన విచారించడానికి వీలుగా జాబితాలో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ.. ఇది అత్యంత ముఖ్యమైన అంశం. దీన్ని కాజ్ లిస్టులో నుంచి తొలగించబోం’అని చెప్పారు. -
Lok sabha elections 2024: ఉచిత వాగ్దానాలపై పిల్
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత వాగ్దానాలను తప్పుబడుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ‘ఓటర్ల నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు పార్టీలు చేస్తున్న ఈ ఉచిత తాయిలాల ప్రకటనలు, వాగ్దానాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. వీటిపై నిషేధం విధించేలా కేంద్ర ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి’ అంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పిల్‌ను దాఖలుచేశారు. ఈయన తరఫున సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా బుధవారం సుప్రీంకోర్టులో వాదించారు. ‘ ఉచిత వాగ్దానాలిచ్చే రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసి, ఆయా పార్టీల ఎన్నికల గుర్తులను స్తంభింపజేయాలి’ అని కోరారు. ‘ ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ పిటిషన్‌ను వీలైనంత త్వరగా విచారిస్తాం. ఏ తేదీన విచారించాలన్న దానిపై గురువారం బోర్డ్‌లో చర్చిస్తాం’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే ఉచితాలపై పిల్ దాఖలవడం గమనార్హం. ‘‘ప్రజాధనంతో నిర్హేతుకమైన ఉచిత పథకాలు ప్రకటించడంతో ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో ప్రభావితమయ్యే అవకాశం చాలా ఎక్కువ. పోటీ పార్టీల విజయావకాశాలనూ ఇవి దెబ్బతీస్తాయి. పారదర్శకమైన ఎన్నికల క్రతువుకు ఇది విఘతం. ఉచితాలు ప్రజాస్వామ్య విలువల మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య స్పూర్తికి గొడ్డలిపెట్టు’’ అని పిటిషనర్ పేర్కొన్నారు. ‘‘ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న ఈ ఉచితాలు ఒక రకంగా ఓటర్లకు లంచాలు ఇవ్వడం లాంటిదే. అధికార పార్టీ మళ్లీ అధికారంలో కొనసాగడానికి ఇది ఒక మార్గంలా పనికొస్తోంది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఇలాంటి ధోరణులకు చెక్ పెట్టాల్సిందే. ఇందులోభాగంగా ఎన్నికల గుర్తుల(రిజర్వేషన్, అలాట్మెంట్) ఉత్తర్వు, 1968లోని సంబంధిత పేరాలో అదనపు షరతులను ఈసీ జతచేయాలి. ఎన్నికలకు ముందు ప్రజాధనంతో నిర్హేతుక ఉచితాల వాగ్దానాలు చేయొద్దని పార్టీలకు షరతు విధించాలి’ అని పిటిషనర్ కోర్టును కోరారు. -
నేర చరిత నేతల బ్యాన్పై సుప్రీంలో వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ: నేర చరిత్ర కలిగిన ప్రజా ప్రతినిధులను తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెట్టనివ్వకుండా జీవిత కాలం నిషేధం విధించాలన్న అంశంపై సుప్రీంకోర్టులో గురువారం వాదనలు జరగనున్నాయి. భారతీయ జనతా పార్టీ నేత అశ్వని ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యం పై బెంచ్ నేడు విచారణ చేపట్టనుంది. ఏదైనా నేరంలో ఛార్జ్‌షీట్ నమోదై జైలుకు వెళ్లి వచ్చిన నేతల(ఎమ్మెల్యే, ఎంపీ తదితరులు)పై ఆరేళ్ల నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ నిబంధనను శాశ్వత నిషేధంగా మార్చాలంటూ బీజేపీ నేత అశ్వని పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఆ పిటిషన్ పై విచారణ జరగనుంది. కాగా, ఇదే పిటిషన్ గత వాదనల సందర్భంగా శిక్ష అనుభవించిన నేతల విషయంలో స్పష్టమైన విధానాలు లేకుండా అవలంభిస్తున్నారంటూ ఎన్నికల కమిషన్ పై సుప్రీం సీరియస్ అయ్యింది. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత, వయో పరిమితి విధించాలంటూ ఈసీతోపాటు కేంద్రానికి కూడా అత్యున్నత న్యాయస్థానం సిఫార్సు చేసింది. నేర చరిత్ర ఉన్న నేతలు రాజకీయాల్లో కొనసాగటం సబబు కాదన్న అభిప్రాయం వ్యక్తం ఏస్తూనే.. వారిపై జీవిత కాల నిషేధానికి మాత్రం ఎన్నికల సంఘం వెనకంజ వేయటం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం కూడా ఆర్టికల్ 14 ప్రకారం నేరచరిత నేతలపై బ్యాన్ సబబు కాదని ఇప్పటికే సుప్రీంకోర్టుకు ఓ నివేదికను సమర్పించింది.