Sheikh Abdul Rashid
-
‘వారి కోసం జీవితాన్ని త్యాగం చేస్తా’.. జైలులో లొంగిపోయిన ఎంపీ రషీద్
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ‘ఇంజనీర్ రషీద్’ సోమవారం తీహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో మధ్యంతర బెయిల్ గడువు నేటితో ముగియడంతో జైలులో లొంగిపోయారు. ఈ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ తెలిపారు. సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడతానని పేర్కొన్నారు. తాను కాశ్మీర్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని, శాంతి, అభివృద్ధి, ప్రజల హక్కుల పునరుద్ధరణ కోసం కృషిచేస్తానని చెప్పారు.‘మా ప్రజల కోసం ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము ఏ తప్పు చేయలేదు. మాకు న్యాయం జరుగుతుంది. మేము జైల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ప్రజల సంక్షేమం, కాశ్మీర్ సంక్షేమం, శాంతి గురించి , గౌరవంగా మాట్లాడుతాం. మేము లొంగిపోము. జైలు శిక్ష గురించి భయపడవద్దు. పోరాడి గెలుస్తాం. ‘మేం ఏ నేరం చేయలేదు. నేను జైలుకు వెళ్లడం గురించి చింతించను. నా ప్రజలకు దూరంగా ఉంటానన్న ఒకే ఒక భావన ఉంది’ అని అన్నారు.అయితే తీవ్రవాద నిధుల కేసులో అరెస్టయిన అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు రషీద్, జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం కోసం సెప్టెంబర్ 10న మధ్యంతర బెయిల్ పొందారు. అనంతరం రెండుసార్లు మధ్యంతర బెయిల్‌ను పొడిగించారు. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆయన ఎంపీగా ఉన్నందున చట్టసభ సభ్యులను విచారించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక కోర్టుకు అతని కేసు వెళ్లవచ్చని దనపు సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ తెలిపారు. దీనిపై ఢిల్లీ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. -
మా గొంతు ఎవ్వరూ నొక్కలేరు
శ్రీనగర్: ‘జమ్మూకశ్మీర్ ప్రజలు శాంతిని ఆకాంక్షిస్తున్నారు. అదీ వారి అభీష్టం ప్రకారమే. కేంద్రం ఆంక్షలకు లోబడి మాత్రం కాదు’ అని ఆవామీ ఇత్తెహాద్ పార్టీ(ఏఐపీ) చీఫ్, లోక్‌సభ ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ స్పష్టం చేశారు. ఉగ్ర నిధుల కేసులో తిహార్ జైల్లో ఉన్న ఆయనకు ఇటీవల సుప్రీంకోర్టు బెయిలివ్వడంతో విడుదలైన విషయం తెలిసిందే. గురువారం ఐదేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీనగర్ చేరుకున్న ఎంపీ రషీద్.. విమానాశ్రయంలో కాలు మోపిన వెంటనే మోకాళ్లపై వంగి నుదుటితో నేలను తాకి, బయటకు వచ్చారు. తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ‘మా కంటే వేరెవరికీ కశ్మీర్లో శాంతితో అవసరం లేదని ప్రధాని మోదీకి చెప్పదల్చుకున్నా. అయితే, మేం పెట్టే షరతులకు లోబడే శాంతి నెలకొనాలి తప్ప కేంద్రం విధించే ఆంక్షలకు లోబడి కాదు. మాక్కావాల్సింది గౌరవంతో కూడిన శాంతి ఒక్కటే. శ్మశాన నిశ్శబ్దంతో కూడిన శాంతి కాదు’ అని అన్నారు. ‘సత్యం మాతోనే ఉంది. నరేంద్ర మోదీ, అమిత్ షా.. ఎవరైనా కానీ మా గొంతు నొక్కలేరు. మేం యాచించడం లేదు. మనుషుల్లా చూడండని కోరుతున్నాం. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొడుతూ మోదీ ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5న తీసుకున్న నిర్ణయాన్ని మేం ఒప్పుకోం. ఇంజనీర్ రషీద్‌ను తిహార్ జైలుకు పంపినా, మరెక్కడికి పంపినా విజయం మాదే’ అని చెప్పారు.ఇండియా కూటమికి మద్దతిస్తాం..అయితేజమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి తాము మద్దతిస్తామని రషీద్ చెప్పారు. అయితే, ఇండియా కూటమికేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తామని ముందుగా హామీ ఇవ్వాలన్నారు. అలాంటి హామీ ఇస్తే మా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆ కూటమి అభ్యర్థులకే ఓటేస్తామని ప్రతిజ్ఞ చేస్తారన్నారు. భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలన్న కల నెరవేరాలంటే ముందుగా కశ్మీర్ అంశాన్ని పరిష్కరించాలని సూచించారు.‘మేం భారత్ శత్రువులం కాదు, అదే సమయంలో పాకిస్తాన్‌కు మిత్రులమూ కాదు’ అని వ్యాఖ్యానించారు. ‘ఆర్టికల్ 370ని సాధించుకోవాలనే వారు ఇళ్లలో కూర్చుని ప్రకటనలిస్తే చాలదు. లాల్‌చౌక్‌లో నిరసనలు చేపట్టి, లాఠీచార్జీలను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ నేతలు ఆ పని చేయలేదు’ అని వ్యాఖ్యానించారు. -
Election Commission: ఎన్నికల వ్యయంలో తేడాలున్నాయి
శ్రీనగర్: ఎన్నికల వ్యయ నివేదికలో చూపిన ఖర్చులో తేడాలున్నాయని బారాముల్లా ఎంపీగా ఎన్నికైన షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజనీర్ రషీద్)కు ఎన్నికల సంఘం మంగళవారం నోటీసులు జారీచేసింది. తీవ్రవాదులకు నిధులు అందజేశారనే అభియోగాలను ఎదుర్కొంటున్న ఇంజనీర్ రషీద్‌ను 2019లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. అప్పటి నుంచి తీహార్ జైలులో ఉన్న రషీద్ బారాముల్లా నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి విజయం సాధించారు. కోర్టు రెండు గంటలు పెరోల్ ఇవ్వడంతో ఈనెల 5న ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రషీద్ తనకు రూ.2.10 లక్షలు ఖర్చయిందని ఎన్నికల రిజిస్టర్లో చూపారని, అయితే ఎన్నికల పరిశీలకులు నిర్వహించిన సమాంతర రిజిస్టర్లో ఖర్చును రూ.13.78 లక్షలుగా చూపారని ఈసీ తెలిపింది. ఈ వ్యత్యాసంపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. జిల్లా వ్యయ పర్యవేక్షక కమిటీ ముందు రషీద్ లేదా ఆయన ప్రతినిధి హాజరై వివరణ ఇవ్వాలని, ఈసీకి సకాలంలో ఎన్నికల వ్యయ నివేదికను సమరి్పంచాలని కోరింది. -
రషీద్ ప్రమాణ స్వీకారానికి ఎన్ఐఏ ఓకే
న్యూఢిల్లీ: జైల్లో ఉన్న కశ్మీరీ నాయకుడు, ఎంపీగా ఎన్నికైన షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజనీర్ రషీద్) ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమమైంది. జూలై 5న రషీద్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. ప్రమాణ స్వీకారం నిమిత్తం రషీద్‌కు ఒకరోజు బెయిల్ ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం ప్రత్యేక కోర్టుకు తెలిపింది. మీడియాతో మాట్లాడకూడదని, ప్రమాణ స్వీకార ప్రక్రియను ఒక రోజులో పూర్తి చేయాలని ఎన్ఐఏ షరతులు విధించింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేశారనే కేసులో కఠినమైన చట్ట వ్యతిరేక కార్యాకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద 2019 ఆగస్టులో అరెస్టయిన రషీద్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో జమ్మూ కశీ్మర్లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ)పై నెగ్గారు. -
రూ.64.70 లక్షలకు ఐపీ
ఖమ్మం లీగల్, న్యూస్‌లైన్: నగరానికి చెందిన చిట్‌ఫండ్ వ్యాపారులైన షేక్ అబ్దుల్ రషీద్-షేక్ రషీద్బేగం దంపతులు 64.70లక్షల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మంగళవారం దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశారు. మొత్తం ఎనిమిదిమంది రుణదాతలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. మొదటి ఇద్దరు ప్రతివాదులైన కాంతాలి శ్రీనివాసరావు-పద్మ దంపతులకు 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సుందని పేర్కొన్నారు. పిటిషన్లో తెలిపిన ప్రకారం.. షేక్ అబ్దుల్ రషీద్-షేక్ రషీద్బేగం దంపతులు ఖమ్మంలో చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహించేవారు. వ్యాపార అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు. చిట్టీలు పాడుకున్న వారు డబ్బును వాయిదాల ప్రకారం చెల్లించకపోవడంతో వ్యాపారంలో నష్టపోయారు. అప్పులు తీర్చలేక, ప్రతివాదుల ఒత్తిళ్లు తట్టుకోలేక దివాళ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్‌దారుల తరఫున న్యాయవాదులుగా తాళ్ళూరి దిలీప్, రావుల వెంకట్ వ్యవహరిస్తున్నారు. రూ.7.3లక్షలకు మరో వ్యాపారి... రఘునాధపాలెం మండలంలోని రుద్రంకోట గ్రామానికి చెందిన పసుపులేటి అప్పారావు 7.03లక్షల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మంగళవారం దివాలా పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 12మంది రుణదాతలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పిటిషన్లో తెలిపిన ప్రకారం.. పిటిషన్‌దారుడైన పసుపులేటి అప్పారావు ఖమ్మం చుట్టుపక్కల గేదెల వ్యాపారం నిర్వహించేవాడు. ఇందుకోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చాడు. ఆ తరువాత గేదెలు చనిపోవడం, వ్యాపారంలో ఒడుదుడుకులు వచ్చాయి. దీంతో అప్పులు తీర్చలేకపోయాడు. ప్రతివాదుల నుంచి ఒత్తిళ్లు తీవ్రమవడంతో తనను దివాలా తీసినట్టుగా ప్రకటించాలని అభ్యర్థిస్తూ దివాలా పిటిషన్ దాఖ లు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాదుదిగా కన్నెబోయిన నాగేశ్వరరావు వ్యవహరిస్తున్నారు.