రేవంత్ రెడ్డితో విభేదాలు వాస్తవమే: ఎర్రబెల్లి
రేవంత్ రెడ్డితో విభేదాలు వాస్తవమే: ఎర్రబెల్లి
Published Mon, Sep 22 2014 5:28 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో గత అర్ధరాత్రి రహస్యంగా సమావేశమయ్యారనే వార్తల్ని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. రహస్య భేటి అంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. ఎవరినో చూసి తనను అనుకుని ఆ పత్రిక వార్తా కథనాన్ని వెల్లడించి ఉండవచ్చని దయాకర్ రావు అన్నారు. వాహనం కూడా తనది కాదని ఆయన స్పష్టం చేశారు.
టీడీపీని వీడే ఉద్దేశ్యం లేదని, చివరి శ్వాస వరకు టీడీపీలోనే ఉంటానని ఆయన అన్నారు. టీడీపీని వీడాలనుకునే వారంత ఎన్నికలకు ముందే ఇతర పార్టీలో చేరిపోయారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మెట్రో అంశంపై రేవంత్ రెడ్డికి, తనకు మధ్య విభేదాలు ఉన్నమాట నిజమేనని ఆయన అన్నారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Advertisement
Advertisement