ఇచ్చాపురం: మరోసారి బయటపడ్డ  టీడీపీ, జనసేన విభేదాలు | Differences Between TDP And Janasena Once Again In Ichapuram, Details Inside - Sakshi
Sakshi News home page

ఇచ్చాపురం: మరోసారి బయటపడ్డ  టీడీపీ, జనసేన విభేదాలు

Published Sun, Feb 11 2024 3:26 PM | Last Updated on Sun, Feb 11 2024 5:19 PM

Differences Between Tdp And Janasena Once Again In Ichapuram - Sakshi

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఇచ్చాపురంలో జనసేన, టీడీపీ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. లోకేష్‌ శంఖారావం సభకు రావొద్దంటూ జనసేన నేతలతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. సభకు వస్తున్న జనసేన నేతలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.

టీడీపీ నేతల తీరుపై జనసేన నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో అవమానంతో జనసేన నేతలు తిరిగి వెళ్లిపోయారు. లోకేష్‌ సభలో జనసేన జెండాలు కనబడకూడదని టీడీపీ నేతలు హుకుం జారీ చేయడంతో సభలో జనసేన నేతలు, జెండాలు కనిపించలేదు.

కాగా, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సిగపట్లు ఏమాత్రం తగ్గడంలేదు. ఎవరికి వారు సై అంటే సై అంటూ కత్తులు నూరుతున్నారు. రెండు పార్టీల అధినేతలు పొత్తు కుదుర్చుకున్నా కింది స్థాయి­లో నేతలు, కేడర్‌ మనసులు మాత్రం కల­వడంలేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు కేడర్‌ సంసిద్ధంగాలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో చాలాచోట్ల రెండు పార్టీల నేతల మధ్య పొత్తు అస్సలు పొసగడంలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement