నేను, షోయబ్ విడిపోలేదు: సానియా | Sania Mirza dispels rumours of differences with husband Shoaib Malik | Sakshi
Sakshi News home page

నేను, షోయబ్ విడిపోలేదు: సానియా

Published Wed, Apr 9 2014 4:32 PM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

నేను, షోయబ్ విడిపోలేదు: సానియా

నేను, షోయబ్ విడిపోలేదు: సానియా

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాల వివాహ బంధం ఒడిదుడుకుల్లో ఉందంటూ వచ్చిన వార్తలపై సానియా తొలిసారి పెదవి విప్పింది. తమ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, షోయ్బ్కు తాను దూరంగా ఉంటున్నానని వచ్చిన మీడియా కథనాలు అవాస్తవమని సానియా స్పష్టం చేసింది. తామిద్దరం అన్యోన్యంగా ఉంటున్నామని చెప్పింది. షోయబ్ సొంతూరు సియల్కోట్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదీ వెళ్లింది. ఈ సందర్భంగా సానియా తమ వివాహ బంధం గురించి మాట్లాడింది.

'మేమిద్దరం వేర్వేరు దేశాలకు చెందినవాళ్లం. ఇద్దరూ క్రీడాకారులతో కావడంతో మాపై ఒత్తిడి ఉంటుంది.  ఇలాంటి సమస్యలను అధిగమిస్తున్నాం. షోయబ్కు, నాకు మధ్య ఎలాంటి విభేదాలూ లేవు. నా భర్తతో కలసి విశ్రాంతి తీసుకునేందుకు సియల్కోట్ వచ్చాను' అని సానియా చెప్పింది. సానియా కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటుండంతో షోయబ్తో విడిపోయిందంటూ ఆ మధ్య పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement