28 సీట్లపై ఎంవీఏలో పీటముడి
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహావికాస్ అఘాడీలో టికెట్ల పంపిణీపై విభేదాలు మొదలయ్యాయి. 288 స్థానాల్లో 260 స్థానాలపై మధ్య ఏకాభిప్రాయం కుదరగా, 28 సీట్లపై పీటముడి పడినట్లు సమాచారం. అఘాడీ భాగస్వాములు కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎప్‌పి) శుక్రవారం 9 గంటల పాటు జరిగిన మారథాన్ సమావేశం జరిపాయి. . విదర్భలో ఐదు సీట్లు కావాలని కాంగ్రెస్‌ను ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.
ఆ సీట్లనే కోరుతున్న శివసేన
విదర్భ ప్రాంతంలో 62 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ ఉమ్మడి శివసేన, బీజేపీ కూటమి 27 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 15, శివసేన 12 స్థానాలు నెగ్గాయి. కాంగ్రెస్ ఒంటరిగా 29, ఎన్సీపీ ఐదు సీట్లు గెలిచాయి. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత కూడా విదర్భ ఎమ్మెల్యేలు శరద్ పవార్ వెంటే ఉన్నారు. శివసేనలో తిరుగుబాటు తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు సీఎం ఏకనాథ్ షిండే వైపు, 8 మంది ఉద్ధవ్ వైపు నిలిచారు.
ఇప్పుడు పాత ఫలితాలపైనే సమస్య నెలకొంది. సీట్ల పంపిణీ ఫార్ములా ప్రకారం 2019లో గెలిచిన 12 సీట్లు తమకే దక్కాలని ఉద్ధవ్ వాదిస్తున్నారు. కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేదని సమాచారం. ముంబైలోని 20–25 స్థానాల్లో స్థానాల పంపకాలు కూడా సమస్యగా మారింది. ముంబై శివసేన కంచుకోట గనుక అక్కడ ఎక్కువ సీట్లు రావాలని ఉద్ధవ్ డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ముంబైలోని 36 అసెంబ్లీ స్థానాలకు గాను 31 స్థానాలను బీజేపీ–సేన కూటమి కైవసం చేసుకుంది. శివసేన 22, బీజేపీ 9 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ ఐదు సీట్లు గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment