
నిందితులతో యానాం పోలీసులు
యానాం: కేరళ రాష్ట్రానికి రూ.15లక్షల విలువ చేసే ఉప్పుడు బియ్యం లోడుతో యానాం నుంచి వెళ్లిన లారీని అపహరణ నిందితులను పోలీసులు పట్టుకున్నారు. పీసీఆర్‌సెల్ ఎస్సై కట్టా సుబ్బరాజు నేతృత్వంలోని యానాం పోలీస్ క్రైమ్‌టీమ్ సిబ్బంది గణేష్, జాంటీ, దుర్గారావు చాకచక్యంగా కేసు ఛేదించారు. నిందితులైన లారీ డ్రైవర్ బాబు, రాజకలైలను శుక్రవారం అరెస్ట్ చేసి యానాం సబ్ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారని ఎస్సై శేరు నూకరాజు తెలిపారు.
నియోజకవర్గ పరిధిలోని అడివిపొలం గ్రామంలోని గాయత్రి రైస్‌మిల్లు నుంచి ఈ నెల 2వ తేదీన 28టన్నుల ఉప్పుడు బియ్యం లోడుతో కేరళ రాష్ట్రానికి లారీ బయలుదేరింది. 6వ తేదీకి కేరళ చేరుకోవాల్సి ఉన్నప్పటికి చేరుకోకపోవడంతో సంబంధిత రైస్‌మిల్లు యజమాని చౌదరి యానాం పోలీసులకు ఈ నెల 15న ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి గాలించగా ఖాళీ లారీ తమిళనాడులోని కోయంబత్తూరు వద్ద ఉన్నట్లు కనుగొన్నారు. దానిని స్వాఽధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment