![Petrol Bunk Blast Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/8/petrol.jpg.webp?itok=3wCd1yST)
సాక్షి, తూర్పుగోదావరి: బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పేలింది. పేలడు ధాటికి భారీ శబ్దం రావడంతో ప్రజలు భయబాంత్రులకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. తొస్సిపూడి గ్రామంలోని ఇండియన్ బంక్ ప్రక్కన ఉన్న షెడ్డులో బాణాసంచా నిల్వ ఉంచారు. అనుకోకుండా బాణాసంచా పేలుడు సంభవించడంతో ఆ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ కూడా బ్లాస్టయింది.
ఉదయం పూట ఈ ప్రమాదం జరగడంతో పెద్దగా జనసంచారం లేకపోవడంతో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ ఘటనలో బంక్ ప్రక్కన వున్న గాయత్రి రైస్ మిల్ స్వల్పంగా ధ్వంసమైంది. బంక్ పేలుడుతో భూకంపం వచ్చినట్లు శబ్దాలు వినిపించాయని చుట్టుపక్కల మూడు గ్రామాల్లోని ప్రజలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment