balst
-
పేలిన పెట్రోల్ బంక్.. ఎగసిపడిన మంటలు
సాక్షి, తూర్పుగోదావరి: బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పేలింది. పేలడు ధాటికి భారీ శబ్దం రావడంతో ప్రజలు భయబాంత్రులకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. తొస్సిపూడి గ్రామంలోని ఇండియన్ బంక్ ప్రక్కన ఉన్న షెడ్డులో బాణాసంచా నిల్వ ఉంచారు. అనుకోకుండా బాణాసంచా పేలుడు సంభవించడంతో ఆ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ కూడా బ్లాస్టయింది. ఉదయం పూట ఈ ప్రమాదం జరగడంతో పెద్దగా జనసంచారం లేకపోవడంతో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ ఘటనలో బంక్ ప్రక్కన వున్న గాయత్రి రైస్ మిల్ స్వల్పంగా ధ్వంసమైంది. బంక్ పేలుడుతో భూకంపం వచ్చినట్లు శబ్దాలు వినిపించాయని చుట్టుపక్కల మూడు గ్రామాల్లోని ప్రజలు చెబుతున్నారు. -
కెమికల్ డబ్బాపేలి వ్యక్తి మృతి
నార్సింగ్: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ పాత సామాన్ల దుకాణంలో ప్రమాదవశాత్తూ కెమికల్ డబ్బా పేలడంతో ఒకరు మృతి చెందారు. ప్రమాద సమయంలో కుమార్(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: ఓ ఇంట్లో వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ పార్క్ కాలనీలో బుధవారం ఉదయం జరిగింది. రోడ్డు నంబర్ 7 లోని ఓ ఇంట్లో గ్యాస్ లీకై స్టవ్ వెలిగించేందుకు ప్రయత్నించడంతో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.