కుభీర్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ హయూంలో ధరలకు రెక్కలు వచ్చాయని, పెట్రోల్, డీ జిల్‌తోపాటు ఉల్లి, కూరగాయలు, ఎరువులు, విత్తనాలు ధరలు ఆకాశాన్నంటాయని ఎంపీ రాథోడ్ రమేశ్ విమర్శించారు. మండలంలోని సౌంవ్లీ, లింగి, వాయి, అంతర్ని, మాలేగాం, సోనారి, డోడర్న గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన పర్యటించారు. టీడీపీ హయూంలో యూరియా బస్తా ధర రూ.160 ఉంటే ఇప్పుడు రూ.400లకు పెరిగిందని, డీఏపీ రూ.400 నుంచి రూ.1300లకు చేరిందని ఎంపీ ఆం దోళన వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు ఎక్కువయ్యూయని ఆరోపించారు.
గ్రామాల్లో నీరు, డ్రెరుునేజీలు, రోడ్ల సమస్యలు పట్టించుకునేవారు కరువయ్యూరని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కమీషన్లతో దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదాకా అందరూ ఉద్యమించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు ఏం సాధించారని కృతజ్ఞత సభ పెట్టారని, ఆ పార్టీకి చెందినవారే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అంతకుముందు మాలేగాం, అంతర్నిలో సీసీ రోడ్ల పనులు ప్రారంభించారు. డోడర్న తండాలో బస చేశారు. టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు బోయిడి విఠల్, శేషనారాయణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వి.మోహన్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాశెట్టి రాజన్న, పార్టీ మండల అధ్యక్షుడు కె.శంకర్, మాలేగాం సర్పంచ్ రేఖ, నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ హయూంలో ధరలకు రెక్కలు
Published Fri, Nov 15 2013 4:49 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement