rathod ramesh
-
టార్గెట్.. అనిల్
సాక్షి, ఆదిలాబాద్: జెడ్పీచైర్మన్ పదవి ఆశిస్తూ అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి నేరడిగొండ జెడ్పీటీసీగా బరిలోకి దిగిన అనిల్ జాదవ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు కొందరు సిద్ధమయ్యారు. ఇదే అదనుగా ఆయనను రాజకీయంగా దెబ్బతీసేందుకు లోస్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేశ్, బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు ఎత్తుగడలు వేస్తున్నారు. ఎస్టీ (జనరల్) రిజర్వు అయిన ఆదిలాబాద్ జెడ్పీచైర్మన్ పదవిపై అధికార పార్టీ నుంచి అనిల్ జాదవ్ ఆశలు పెట్టుకున్నారు. ఆయనను జెడ్పీటీసీగానే ఇక్కడే నిలువరించడం ద్వారా రాజకీయంగా దెబ్బతీయాలని వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అనిల్ జాదవ్‌పై వారిద్దరు ఎందుకు దృష్టి పెట్టాల్సి వస్తుందంటే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలప్పుడు జరిగిన పరిణామాలు ఇందుకు కారణమవుతున్నాయి. అనిల్ ఓటమికి ఎత్తుగడలు నేరడిగొండ జెడ్పీటీసీ స్థానం ఎస్టీ (జనరల్) రిజర్వు అయింది. అనిల్‌జాదవ్ టీఆర్ఎస్ నుంచి ఇక్కడ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సోయం, రాథోడ్ నేరడిగొండలో అనిల్‌ను ఎలాగైనా నిలువరించాలని ఎత్తుగడలు వేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనిల్ జాదవ్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ నుంచి సోయం బాపురావు, అనిల్ జాదవ్ టికెట్ ఆశించారు. 2009, 2014లో బోథ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అనిల్ జాదవ్ పోటీ చేసినా ఓటమి చెందారు. దీంతో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం సోయం పేరును ఖరారు చేయడంతో అనిల్‌జాదవ్ నిరుత్సాహం చెందారు. కాంగ్రెస్ రెబల్‌గా ఆయన బోథ్ నుంచి పోటీ చేశారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన రాథోడ్ బాపురావు ఆ నియోజకవర్గంలో వరుసగా మరోసారి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపురావు 6,400పై చిలుకు ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసిన అనిల్ జాదవ్ 28 వేల ఓట్లు సాధించినా ఓటమి చెందాడు. అయితే అనిల్ రెబల్‌గా పోటీ చేయడంతోనే సోయం బాపురావు ఓటమి పాలయ్యాడని అనుచరులు మదన పడ్డారు. ఈ నేపథ్యంలో అనిల్‌పై రాజకీయ అదను కోసం సోయం బాపురావు ఎదురు చూస్తుండగా ఇప్పుడు అవకాశం లభించింది. రాథోడ్‌కు ఇలా.. అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసిన అనిల్ జాదవ్‌ను అప్పట్లో అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎన్నికల అనంతరం సస్పెన్షన్ ఎత్తివేశారు. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం రాథోడ్ రమేశ్‌ను ఆదిలాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించారు. అనిల్ టీఆర్ఎస్లో చేరేందుకు యత్నిస్తున్నాడన్న సమాచారం మేరకు రాథోడ్ రమేశ్ రంగలోకి దిగాడు. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలోని బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నా యకులను సమన్వయం చేసుకునేందుకు రాథోడ్ రమేశ్ యత్నించారు. అందులో భాగంగా అప్ప ట్లో అనిల్‌జాదవ్‌ను రాథోడ్ రమేశ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, భార్గవ్‌దేశ్ పాండేలు కలిసి టీఆర్ఎస్లోకి వెళ్లకుండా నిరోధించేందుకు ప్రయత్నిం చారు. అయినా నామినేషన్ల పర్వం నడుస్తున్న సందర్భంలో అనిల్‌జాదవ్ హైదరాబాద్‌లో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ పరిణామం రాథోడ్ రమేశ్‌కు కంటగింపుగా మారింది. తాను స్వయంగా వెళ్లి కలిసినా అనిల్ జాదవ్ టీఆర్ఎస్లో చేరడంపై ఆయనలో ఆగ్రహం వ్యక్తం అయింది. రాజకీయంగా అనిల్‌పై ప్రతీకారం పెంచుకున్నాడు. అదును కోసం ఎదురుచూస్తుండగా ఇప్పుడు జెడ్పీచైర్మన్ ఆశతో నేరడిగొండ జెడ్పీటీసీగా బరిలో దిగిన అనిల్‌జాదవ్‌ను ఓడించేందుకు నేరడిగొండపై ప్రత్యేక దృష్టి సారించారు. పాచిక.. సోయం బాపురావు, రాథోడ్ రమేశ్‌లు ఇద్దరు నేరడిగొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న అనిల్ జాదవ్‌ను ఎలాగైనా ఓడించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీజేపీ నుంచి ఆదివాసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టాలని సోయం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా లంబాడా సామాజిక వర్గానికి చెందిన అనిల్ జాదవ్‌కు ఆ సామాజికవర్గం ఓట్లు పడకుండా కాంగ్రెస్ నుంచి లంబాడా సామాజిక వర్గానికి చెందిన నాయకున్ని జెడ్పీటీసీగా బరిలోకి దించాలని రాథోడ్ రమేశ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇరువురి నేతలు ఇటీవల నేరడిగొండలో పర్యటించి కార్యకర్తలతో సమీక్షించారు. ఈ నేపథ్యంలో నేరడిగొండలో జెడ్పీటీసీ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బరిలో... జెడ్పీటీసీ రెండో విడత ఎన్నికల నామినేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్లో ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులకే ఆ పార్టీ బీ–ఫామ్ ఇస్తారు. అయితే అనిల్ జాదవ్ మొదటి రోజే బీ–ఫామ్ లేకుండానే నామినేషన్ వేశారు. పరోక్షంగా పార్టీలో ఎవరినో హెచ్చరించేందుకే ఆయన నామినేషన్ వేశారనేది పార్టీలో చర్చ సాగుతోంది. ఆదివారం బీ–ఫామ్‌తో మందిమార్బలంతో వచ్చి మరోసారి నామినేషన్ వేస్తానని అని ల్ తన అనుచర గణంతో పేర్కొన్నారు. అయితే అనిల్ జాదవ్ నేరడిగొండ నుంచి జెడ్పీటీసీగా బరిలో ఉండడం ఓ ముఖ్యనేతకు అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రేపటి నాడు జెడ్పీచైర్మన్‌గా ఉన్నత పదవిలో ఉంటే బోథ్ నియోజకవర్గంలో బలమైన నేతగా తయారై పార్టీలోనే పోటీగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే కొంతమంది ముఖ్యనేతలు ఆశీస్సులు ఉండటంతోనే అనిల్ జాదవ్ పోటీకి రెడీ అవుతున్నట్లు చర్చ సాగుతోంది. ఏదేమైనా ఈ పరిణామాలు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. -
కారు ప్రమాదం.. మాజీ ఎంపీకి తీవ్రగాయలు
-
జిల్లాలో నామినేషన్లు షురూ..
సాక్షి, ఆదిలాబాద్ అర్బన్: లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దివ్యదేవరాజన్ నామినేషన్ కేంద్రంలో అందుబాటులో ఉండి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్ నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రానికి వచ్చిన రాథోడ్ రమేశ్ రిటర్నింగ్ అధికారి దివ్యదేవరాజన్‌కు నామినేషన్ పత్రాలు అందించారు. కాగా మంగళవారం తారాబలం కారణంగా మంచి ముహూర్తం ఉండడంతో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలిరోజు ఒక్కటే.. నోటిఫికేషన్ జారీ అయిన తొలిరోజు ఒక్కటే నామినేషన్ దాఖలు అయింది. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ తన కుటుంబసభ్యులతో సహా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొని ముందుగా కాంగ్రెస్ ఆయాజిల్లాల డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. తద్వారా కాంగ్రెస్ మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి, భార్గవ్ దేశ్‌పాండే, టీపీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాత, కాంగ్రెస్ నాయకులు సాజీద్‌ఖాన్, పలువురు నాయకులు కలిసి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రానికి వెళ్లి తన నామినేషన్‌ను దాఖలు చేశారు. వీడని ఉత్కంఠ.. ఆదిలాబాద్ లోక్‌సభ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరనేది ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించి మూడురోజులు గడుస్తున్నా.. ఇంకా ఆ రెండు పార్టీల అభ్యర్థులు మాత్రం ఖరారు చేయలేదు. ఆయా పార్టీలు అభ్యర్థుల ఖరారులో నెల రోజులుగా తలమునకలవుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలైనా ఇప్పటికీ ఆ రెండు పార్టీల ఎంపీ అభ్యర్థులెవరో తేలకపోవడంతో కిందిస్థాయి కార్యకర్తల్లోనూ గందరగోళం ఏర్పడింది. లోక్‌సభ నామినేషన్ల స్వీకరణకు సెలవులతో కలుపుకొని కేవలం ఏడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నేడో, రేపో ఆ రెండు పార్టీల ఎంపీ అభ్యర్థుల జాబితా బయటకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. నామినేషన్ కేంద్రం చుట్టూ బందోబస్తు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల స్వీకరణకు కలెక్టరేట్లో కేంద్రం ఏర్పాటు చేశారు. కేంద్రానికి వందమీటర్ల దూరంలో పోలీసు బందోబస్తు నిర్వహించడంతోపాటు కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ ఉన్న దారులు పోలీసు బలగాలతో నిండిపోయాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
క్రీడా సంఘాల ఎన్నికలు పారదర్శకంగా జరగాలి: రాథోడ్
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు చెందిన క్రీడా సంఘాలు తప్పనిసరిగా క్రీడా నియమావళి (స్పోర్ట్స్ కోడ్)ని అమలు చేయాల్సిందేనని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. ‘కోడ్ ప్రకారం ఆయా సంఘాల్లో పారదర్శకంగా ఎన్నికలు జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షకుడి ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలి’ అని రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పష్టం చేశారు. 2011 స్పోర్ట్స్ కోడ్‌కు విరుద్ధంగా నడుచుకున్నందుకు ఇప్పటికే కొన్ని రాష్ట్ర సంఘాల గుర్తింపుని రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా ఏ క్రీడా సంఘమైన వ్యవహరించినా, అక్రమాలు, అవకతవకలకు పాల్పడినా ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని రాథోడ్ వివరించారు. ఆసియా క్రీడలు ముగిశాక కబడ్డీ సమాఖ్య ఎన్నికలపై దృష్టి సారిస్తామన్నారు.. ‘కబడ్డీ పూర్తిగా శరీర సామర్థ్య క్రీడ. దీనికి క్రీడా సామగ్రి కూడా తక్కువే అవసరముంటుంది. ఇలాంటి గ్రామీణ క్రీడ 30 దేశాల్లో ప్రాచుర్యం పొందింది. ఒలింపిక్స్ ఆటగా అడుగులు వేస్తుంది’ అని చెప్పిన రాథోడ్... రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఫేవరెట్ క్రీడ కబడ్డీ అని తన ప్రసంగాన్ని ముగించారు. -
కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగ భద్రత
ఆదిలాబాద్ రూరల్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్నా ఏ ఒక్కరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని ఆదిలాబాద్ మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాథోడ్ రమేష్ విమర్శించారు. కేవలం వారి కుటుంబానికే ఉద్యోగ భద్రతను కల్పించుకున్నారని దుయ్యబట్టారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ సెంట్రల్ గార్డెన్లో పశ్చిమ జిల్లా మినీ మహానాడు సభ నిర్వహించారు. ముందుగా పార్టీలో కొనసాగి మృతిచెందిన కార్యకర్తలకు రెండు నిమిషాల మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ చౌక్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారని అన్నారు. తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చిన కేసీఆర్ ఆయననే సీఎం అయ్యారని దుయ్యబట్టారు. భూమి లేని దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమిని ఇస్తానని కేవలం నియోజకవర్గానికి ఐదుగురికి అది కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారని విమర్శించారు. యూనివర్సిటీ భూముల్లో ఇల్లు నిర్మిస్తానని ప్రకటించడం సరికాదన్నారు. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ పథకాలు కేవలం దోచుకోవడానికేనని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఎదుట 150 రోజులుగా వికలాంగులు ధర్నా కొనసాగిస్తున్నా.. లోకల్ మంత్రి జోగు రామన్న పరామర్శించలేదని పేర్కొన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జిల్లాలో పర్యటించి ఐదు కుటుంబాలకే ఆర్థిక సాయం అందించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆదిలాబాద్‌ను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్దనే నిర్మించాలని, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్‌కు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. సమావేశంలో జిల్లా ఎన్నికల పరిశీలకుడు, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, పశ్చిమ, తూర్పు జిల్లాల అధ్యక్షులు లోలం శ్యాంసుందర్, బోడ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సోయం బాపూరావ్, సుమన్ రాథోడ్, రాష్ట్ర నాయకుడు యూనుస్ అక్బానీ, నారాయణ్‌రెడ్డి, బాబర్, అబ్దుల్ కలాం, రీతేష్ రాథోడ్, రాజేశ్వర్, ఎడిపెల్లి లింగన్న, నైతం వినోద్, మహిళా కార్యకర్తలు లక్ష్మి, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాలకు చెక్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తాజా మాజీ ప్రజాప్రతినిధులు ఎన్నికల వేళ ఇష్టారాజ్యంగా ధారాదత్తం చేసిన అభివృద్ధి పనుల్లో జరిగిన అక్రమాలపై కలెక్టర్ ఎం.జగన్మోహన్ కొరడా ఝళిపిస్తున్నారు. తూతూ మంత్రంగా పనులు చేసి, రూ.లక్షల్లో బిల్లులు డ్రా చేసుకునే ప్రయత్నాలకు చెక్ పెడుతున్నారు. నాణ్యతకు తిలోదకాలిచ్చి, నామమాత్రంగా చేసిన పనులకు బిల్లులు కట్టబెట్టకుండా కట్టడి చేస్తున్నారు. ప్రత్యేకంగా నియమించిన ఉన్నతాధికారి సంబంధిత అభివృద్ధి పనులను పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాత బిల్లులు మంజూరు చేయాలని కలెక్టర్ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇష్టారాజ్యంగా పనులు చేసి రూ.లక్షల్లో బిల్లులు కాజేద్దామనుకునే కార్యకర్తలకు, చోటామోటా నాయకుల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. ఎన్నికల ముందు పనుల పందేరం గత ప్రజాప్రతినిధులు తమకు కేటాయించిన ఎంపీ లాడ్స్, ఏసీడీపీ నిధులను మొదటి నాలుగున్నరేళ్లు ఆచీతూచీ పనులు ప్రతిపాదించగా, ఎన్నికలు సమీపించడంతో పనుల పంపకాల పందేరానికి తెరలేపా రు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనులను ప్రతిపాదించాల్సింది పోయి.. రాజకీయ ప్రయోజనాలను ఆశించి చోటామోటా నేతలకు, కార్యకర్తలు, అనుచరులకు ఈ పనులను పంపిణీ చేశారనే విమర్శలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. మార్చి వారంలో ఎన్నికల నగారా మోగగా, ఫిబ్రవరి చివరి వారం వరకు పనుల పంపకాల జాతర కొనసాగింది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఫిబ్రవరి మొదటి వారంలో రూ.69.25 లక్షల అంచనా వ్యయం కలిగిన సుమారు 40 అభివృద్ధి పనులను ప్రతిపాదించగా, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ ఏకంగా రూ.1.01 కోట్ల అంచనా వ్యయం కలిగిన 62 అభివృద్ధి పనులను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే కొన్నిరోజుల ముందు ప్రతిపాదించారు. అలాగే అప్పటి ఇన్చార్జి మంత్రి సారయ్య కోటాలోని ఏసీడీపీ నిధులకు సంబంధించిన పనుల పంపకాలకు కూడా ఎన్నికలకు ముందే తెరలేచింది. మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనులు ప్రతిపాదించారు. తూతూ మంత్రంగా పనులు ఎంపీ లాడ్స్, ఏసీడీపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు తూతూ మంత్రంగా జరిగాయి. కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన చోటామోటా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. నాణ్యత ప్రమాణాలను తుంగలో తొక్కి బిల్లులు డ్రా చే సుకునే యోచనలో ఉన్నారు. కొన్నిచోట్ల అసలు పను లు చేయకుండానే ఎంబీ రికార్డులు సృష్టించి బిల్లులు డ్రా చేసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోం ది. మరికొన్ని చోట్ల పాత పనులకు పూతలు పూసి ఎంబీ రికార్డులు సృష్టించినట్లు సమాచారం. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు గత కలెక్టర్ అహ్మద్‌బాబు ఆయా పనులకు సంబంధించి ఫొటోలను ఎంబీ రికార్డుతోపాటు పెట్టాలని నిబంధనలు పెట్టారు. దీంతో అక్రమాల్లో ఆరితేరిన కొందరు వెరే పనుల ఫొటోలను పెట్టి బిల్లులు డ్రా చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రస్తుత కలెక్టర్ జగన్మోహన్ దృష్టికి వచ్చింది. దీంతో వాస్తవాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం నాణ్యతతో చేసిన పనులకు మాత్రమే బిల్లులు మంజూరు చేయాలని, ఈ పనులను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ అధికారులు ఆయా పనులను చూసి నిబంధనల ప్రకారం జరిగాయని నివేదిక ఇచ్చాకే బిల్లులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ పనుల్లో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం కష్టంగా మారింది. -
హామీలకే పరిమితమైన ప్రభుత్వం
ఖానాపూర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితమైందని మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీలేదని విమర్శించారు. ప్రభుత్వ హామీలన్నీ ప్రకటనలకే పరిమితమవుతున్నాయన్నారు. సోమవారం జరిగిన జెడ్పీ సమావేశం ప్రజాసమస్యలపై చర్చించకుండా సన్మానాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ చేసిన హామీల్లో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదన్నారు. జిల్లాకు చెందిన వ్యక్తే అటవీశాఖ మంత్రి అయినప్పటికీ రహదారుల నిర్మాణానికి ఆ శాఖ నుంచి క్లియరెన్స్ ఇప్పించకపోవడం శోచనీయమన్నారు. వర్షాభావ పరిస్థితులతో విత్తనాలు మొలకెత్తక రైతులు నష్టపోయినా ప్రభుత్వం వారికి ఉచితంగా విత్తనాలు అందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. పంటల రుణమాఫీ వెంటనే అమలు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడినవారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీఏసీఎస్ చైర్మన్ వెంకాగౌడ్, మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామునాయక్, మాజీ ఎంపీపీలు రామేశ్వర్‌రెడ్డి, రాజేశ్వర్‌గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు అంకం రాజేందర్, ఉప సర్పంచ్ కారింగుల సుమన్ పాల్గొన్నారు. -
వెలుగు చూస్తున్న ‘వ్యవహారాలు’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : టీడీపీ-బీజేపీ పొత్తు, సీట్ల పంపకాల్లో తెర వెనుక జరిగిన ‘వ్యవహారాలు’ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. టీడీపీ నేత, ఎంపీ రాథోడ్ రమేష్ వద్ద ముడుపులు తీసుకుని జిల్లాలోని ఎస్టీ ఎమ్మెల్యే స్థానాలను టీడీపీకి అమ్ముకున్నారంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యనగారి భూమయ్యపై ఆ పార్టీ ముఖ్య నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. తూర్పు జిల్లాకు చెందిన గోనె శ్యాంసుందర్‌రావుతో కలిసి భూమయ్య బీజేపీకి ఒక్క ఎస్టీ సీటు దక్కకుండా చేశారంటూ రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రానికి వచ్చిన భూమయ్యను స్థానికంగా ఉన్న ఆ పార్టీ నాయకులు నిలదీశారు. ఈ సందర్భంగా ఏకంగా ఆయనపై దాడికే యత్నించడం.. వెంటనే ఆయన అక్కడి నుంచి చిత్తగించడం ఆలస్యంగా వెలుగుచూసింది. జిల్లాలో ఆదిలాబాద్ ఎంపీ స్థానంతోపాటు, బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్ స్థానాలు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. రెండు పార్టీల పొత్తుల్లో ఈ నాలుగింటిలో ఒక్క ఎస్టీ సీటు కూడా బీజేపీకి ఇవ్వకపోవడాన్ని ఆ పార్టీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. గిరిజన స్థానాలు టీడీపీకి కట్టబెట్టిన అయ్యనగారి భూమయ్య ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చే అర్హతే లేదని ఆ పార్టీ ముఖ్య నాయకులు మడావి రాజు పేర్కొంటున్నారు. ఏ ముఖం పెట్టుకుని బీజేపీ గిరిజనులను ఓట్లు అడగాలని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే భూమయ్యపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ దీని ప్రభావం ఆ పార్టీ ఉమ్మడి అభ్యర్థుల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టీడీపీ పోటీ చేస్తున్న స్థానాల్లో బీజేపీ శ్రేణులు సహకరించకపోగా, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో టీడీపీ నాయకులు దూరంగా ఉంటున్నారు. దీని ప్రభా వం ముఖ్యంగా ఎంపీ అభ్యర్థి రాథోడ్ గెలుపు ఓటములపై పడటం ఖా యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఈ విషయమై.. అయ్యనగారి భూమయ్యను అడుగగా.. రాథోడ్ రమేష్‌తో నేను ఎలాం టి కుమ్ముక్కు కాలేదు. అవగాహన లేకపోవడంతోనే కొందరు నాయకులకు డబ్బులు చేతులు మారాయని ఆరోపిస్తున్నారు. ఇది పూర్తి అవాస్తవం. సీట్ల పంపకాల్లో నా ప్రమేయం లేదు అని పేర్కొన్నారు. రాజీనామా యోచనలో పలువురు పొత్తుల్లో బీజేపీకి నాలుగు స్థానాలు కేటాయించారు. ఈ నాలుగింటిలో టీడీపీకి నుంచి వచ్చిన వారికే బీజేపీ అభ్యర్థులుగా ఎంపిక చేయడంపై బీజేపీ నాయకులు అసంతృప్తి తో ఉన్నారు. ఆదిలాబాద్ అభ్యర్థి శంకర్ టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరినవారే. అలాగే ముథోల్ బీజేపీ అభ్యర్థి రమాదేవి కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే. ఇలా టీడీపీ నుంచి వచ్చిన నాయకులకే బీజేపీ టిక్కెట్లు ఇవ్వడంపై ఆ పార్టీలోని సీని యర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన నాయకులు కూడా తమను పట్టించుకోక పోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఈ మేరకు బీజేపీలోని పలువురు జి ల్లా నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తామని బీజేపీ ముఖ్యనాయకులు కొందరు పేర్కొంటున్నారు. -
పొత్తు చిత్తవుతోంది!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : టీడీపీ, బీజేపీ జాతీయ రాజకీయ అవసరాల కోసం పొత్తు పెట్టుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు కలిసి పనిచేయలేకపోతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల ప్రచారంలో బీజేపీ నాయకులు పాల్గొనడం లేదు. బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో టీడీపీ శ్రేణులు దూరంగా ఉంటున్నాయి. పలు నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నేతల పరస్పర సహకారం కొరవడడంతో పొత్తు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందనే భావన వ్యక్తమవుతోంది. పొత్తుల్లో భాగంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానం టీడీపీకి దక్కగా, ఎమ్మెల్యే స్థానం బీజేపీకి కేటాయించారు. ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి పాయల శంకర్ మధ్య తీవ్ర విభేదాలున్నాయి. పాయల టీడీపీలో ఉండగా ఈ విభేదాలు తలెత్తాయి. ఆదిలాబాద్ ఉప ఎన్నికల కోసం టీడీపీ నుంచి వచ్చిన పార్టీ ఫండ్ పంపకాల్లో వీరికి తేడాలు రావడంతో ఈ విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు రెండు పార్టీల పొత్తు కారణంగా వారిద్దరు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా, వీరు కలిసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం లేదు. పైగా టీడీపీ పట్టణాధ్యక్షుడు మునిగెల నర్సింగ్‌ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలపడం వెనుక రాథోడ్ జిమ్మిక్కు ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బోథ్‌లో ఉమ్మడి అభ్యర్థి సోయం బాపూరావు చేస్తున్న ఎన్నికల ప్రచారానికి కూడా నియోజకవర్గంలోని బీజేపీ శ్రేణులు దూరంగా ఉంటున్నాయి. మంగళవారం రెండు పార్టీల ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. బీజేపీకి దక్కినా ముథోల్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి రమాదేవి ప్రచారానికి టీడీపీ నాయకులు దూరంగా ఉన్నారు. పార్టీ టిక్కెట్ ఆశించిన నారాయణరెడ్డి, నామినేషన్ వేసిన లడ్డా తదితర నేతలు బీజేపీ ప్రచారంలో పాల్గొనడం లేదు. టీడీపీ శ్రేణులు దూరంగా ఉండటంతో చెన్నూరులో బీజేపీ అభ్యర్థి రాంవేణు ఒంటరిగానే ప్రచారం చేస్తున్నారు. మంచిర్యాల స్థానం కూడా బీజేపీకి కేటాయించడంతో టీడీపీ శ్రేణులు ఏకంగా పార్టీకే దూరమయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జి కొండేటి సత్యం తెరమరుగయ్యారు. దీంతో బీజేపీ అభ్యర్థి మల్లారెడ్డి బీజేపీ శ్రేణులతోనే ప్రచారం నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీకి దక్కిన నిర్మల్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి మీర్యాసిన్బేగ్ ఇంకా ప్రచారం ప్రారంభించలేదు. ఇక్కడ బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, జిల్లా అధ్యక్షుడు అయ్యనగారి భూమయ్య వంటి ముఖ్య నాయకులున్నారు. టీడీపీకి దక్కిన బెల్లంపల్లి అభ్యర్థి పాటి సుభద్రకు కూడా టీడీపీ శ్రేణులు అంతగా సహకరించడం లేదు. మొత్తం మీదా రెండు పార్టీల శ్రేణులు కలిసి ప్రజల్లోకి వెళ్లలేకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. -
2 ‘పొత్తు’ కయ్యం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలుగుదేశం పార్టీతో పొత్తును జిల్లాలోని కమలనాథులు జీర్ణించుకోలేక పోతున్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకుల మనోభావాలకు విరుద్ధంగా అధినాయకత్వం ‘దేశం’తో జతకట్టడంపై తీవ్ర అసంతృప్తి తో రగిలిపోతున్నారు. పొత్తులో భాగంగా సీట్లు గల్లంతవుతున్న స్థానాల్లో తెలుగు తమ్ముళ్లు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. జిల్లా రాజకీయ కేంద్రమైన నిర్మల్ అసెంబ్లీ స్థానం విషయంలో ఇరుపార్టీలు పట్టుబడుతున్నాయి. ఈ సీటు బీజేపీకి కేటాయించని పక్షంలో బీజేపీ ముఖ్యనాయకత్వం కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతోంది. ‘నిర్మల్‌లో టీడీపీకి బలమైన అభ్యర్థి లేరు. కాబట్టి ఈ సీటు బీజేపీకే వస్తుందని భావిస్తున్నాము. లేని పక్షంలో పార్టీ పదవికి రాజీనామా చేసే విషయం ఆలోచిస్తా..’ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యనగారి భూమయ్య ‘సాక్షి’తో పేర్కొన్నారు. టీడీపీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జిగా మిర్జాయాసిన్ బేగ్ (బాబర్) కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బాబర్ బరిలోకి దిగినా, మరో టీడీపీ నాయకుడు పోటీ చేసినా బీజేపీ శ్రేణులు టీడీపీ అభ్యర్థికి సహకరించడం ప్రశ్నార్థకమేనని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. తెలుగు తమ్ముళ్ల తిరుగుబావుటా టీడీపీ-బీజేపీల పొత్తుపై పలుచోట్ల తెలుగు తమ్ముళ్లు కూడా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. పొత్తులో భాగంగా మంచిర్యాల స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ స్థానానికి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కొండేటి సత్యం ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు పొత్తుల్లో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్తుండటంతో ఆయన అనుచరులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ సీటు బీజేపీకి కేటాయించిన పక్షంలో మంగళవారం మూకుమ్మడి రాజీనామా పత్రాలు చంద్రబాబుకు పంపుతామని సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జక్కుల రాజేశం, బెల్లంకొండ మురళి ప్రకటించారు. బీజేపీ నుంచి మంచిర్యాల టిక్కెట్‌ను ఇటీవల బీజేపీలో చేరిన కేవీ ప్రతాప్, మల్లారెడ్డి, గోనె శ్యాంసుందర్‌రావు ఆశిస్తున్నారు. సీట్ల పంపకాలు పొత్తులో భాగంగా జిల్లాలో ఆదిలాబాద్ ఎంపీ స్థానం టీడీపీకి కేటాయించారు. సిట్టింగ్ ఎంపీ కావడంతో రా థోడ్ రమేష్‌ను ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు సోమవా రం ప్రకటించారు. కాగా జిల్లాలో ఉన్న పది ఎమ్మెల్యే స్థా నాల్లో నాలుగు బీజేపీకి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చా యి. ఆదిలాబాద్, ముథోల్, మంచిర్యాల, చెన్నూరు స్థా నాలను బీజేపీకి ఇచ్చేందుకు ప్రాథమికంగా రెండు పార్టీ లు అంగీకరించినట్లు తెలుస్తోంది.నిర్మల్ సీటును కూడా తమకే కేటాయించాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీలకు రిజర్వు అయిన బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్‌లలో ఏదో ఒక స్థానం బీజేపీకి ఇవ్వాలని పట్టు బడుతున్నారు. సీట్ల పంపకాల్లో స్పష్టత రాకముందే రెండు పార్టీల్లో ఈ స్థాయిలో అసంతృప్తులు రగిలిపోతున్నాయి. ఏ సీటు ఎవరికో తేలాక, సీట్లు గల్లంతయిన నాయకుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయోనని అగ్రనాయకులు ఆందోళన చెందుతున్నారు. -
ఆదిలోనే వివాదం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బీజేపీ-టీడీపీ పొత్తులపై ఢిల్లీలో కొనసాగుతున్న చర్చలు ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తుంటే, జిల్లాలో మాత్రం టీడీపీ ఏకపక్షంగా వెళ్తోంది. పొత్తు ఖరారు కాకుండానే, జిల్లాలో ఏ సీటు ఎవరికో తేలకుండానే టీడీపీ నాయకుడు రాథోడ్ రమేష్ ఏకంగా నామినేషన్ల పర్వానికి తెర లేపడంపై బీజేపీ శ్రేణులు రగులుతున్నాయి. సీట్లు ఖరారు కాకుండానే ఇలా టీడీపీ నామినేషన్లు వేయడం ఏంటని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు పార్టీల పొత్తు ఆదిలోనే వివాదానికి దారి తీస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. తొలిరోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి టీడీపీ ఎంపీ రాథోడ్ రమేష్ తన నామినేషన్ పత్రాలను ఆయన భార్య సుమన్ రాథోడ్‌తో దాఖలు చేయించారు. ఆయన కుమారుడు రితేష్‌తో కూడా ఈ స్థానానికి నామినేషన్ వేయించారు. మరోవైపు ఖానాపూర్ ఎమ్మెల్యే స్థానానికి కూడా ఆయనతోపాటు, కొడుకు రితేష్‌తో నామినేషన్ వేయించారు. ఆసిఫాబాద్ స్థానానికి కూడా రాథోడ్ రమేష్ నామినేషన్ వేయడం గమనార్హం. ఇలా రాథోడ్, తన కుమారుడు కలిపి జిల్లాలో మూడు స్థానాలకు నామినేషన్లు వేశారు. ఈ మూడింటిలో ఆదిలాబాద్ ఎంపీ, ఖానాపూర్ ఎమ్మెల్యే టీడీపీ సిట్టింగ్ స్థానాలు. వీటితోపాటు ఆసిఫాబాద్ స్థానానికి కూడా నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ల వ్యవహారంపై ఈ మూడు నియోజకవర్గాల నుంచి బీజేపీ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న నాయకులు, వారి అనుచరులు రగిలిపోతున్నారు. ఈ విషయమై వారు బీజేపీ జిల్లా ముఖ్య నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకవైపు పొత్తుపై పార్టీ ముఖ్యనేతలు చర్చలు కొలిక్కి వస్తున్న తరుణంలో రాథోడ్ ఒంటెత్తు పోకడలకు వెళ్లడం ఏంటని కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిరోజు చూసుకుని ఆయా స్థానాల్లో టీడీపీకి ధీటుగా నామినేషన్లు వేయాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. రాథోడ్ రమేష్ వ్యవహార శైలి ఏమాత్రం సహించేదిగా లేదని బీజేపీ జాతీయ నాయకుడు, జిల్లా ఇన్చార్జి మురళీధర్‌గౌడ్ ‘సాక్షి ప్రతినిధి’తో పేర్కొన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే ఓటమి ఖాయమని భావించే రాథోడ్ మొదటి నుంచి పొత్తు మంత్రాలు జపించారని విమర్శించారు. ఇప్పుడు ఇలా వ్యవహరించడాన్ని తమ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. అవసరమైతే టీడీపీతో పొత్తు నుంచి జిల్లాను మినహాయించాలని అధిష్టానం దృష్టికి తీసుకెళతానన్నారు. పొత్తుల చర్చలు కొనసాగుతుండగానే రాథోడ్ రమేష్ నామినేషన్లు వేసిన వ్యవహరాన్ని మా పార్టీ ముఖ్య నాయకులకు ఫిర్యాదు చేస్తాం. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ మాట్లాడాను. అనధికారికంగా వేశాం : రాథోడ్ రమేష్, ఎంపీ అభ్యర్థి నామినేషన్లు వేసేందుకు నేను వెళ్లలేదు. మంచి రోజు ఉందనే ఉద్దేశంతోనే బుధవారం నామినేషన్లు వేయించాను. బీజేపీతో పొత్తు ఖరారయ్యాక అధికారికంగా మళ్లీ నామినేషన్లు వేస్తాం. ఇందులో తప్పేమీలేదు. -
టీడీపీతోనే సామాజిక తెలంగాణ
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : టీడీపీతోనే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని ఎంపీ రాథోడ్ రమేశ్ అన్నారు. సోమవారం రాత్రి స్థానిక రోజ్ గార్డెన్లో నిర్వహించిన టీడీపీ తూర్పు జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చి సామాజిక తెలంగాణ సాధించుకుంటామన్నారు. రాబోయే మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి పదవి కోసం కేసీఆర్ పాకులాడుతున్నాడని ఆరోపించారు. టీడీపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్రావు మాట్లాడుతూ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. అనంతరం పార్టీ పెద్దపెల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి శరత్, నాగేశ్వర్రావును శాలువాలతో సన్మానించారు. పట్టణానికి చెందిన నరేశ్, సాయికిరణ్, మొయినొద్దీన్, మహేశ్, ఖాదర్ హుస్సేన్, చాంద్ పాషా, ప్రవీణ్, మల్లేశ్ తదితరులు ఎంపీ సమక్షంలో టీడీపీలో చేరారు. బెల్లంపల్లి, కాగజ్‌నగర్, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జీలు పాటి సుభద్ర, బుచ్చిలింగం, నరేశ్, సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, నాయకులు అలిబిన్ అహ్మద్, చిట్టిబాబు, ప్రసాద్ గౌడ్, నిజాం, పిడుగు తిరుపతి, గణపురం ప్రకాశ్ పాల్గొన్నారు. -
ఎంపీ ల్యాడ్స్.. ఏమిటీ ల్యాప్స్!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధి నిధులు(ఎంపీ ల్యాడ్స్) రూ.కోట్లు విడుదలవుతున్నా ఖర్చుకావడం లేదు. ఎంపీలు ప్రతిపాదించిన పనులు, నిధుల విభజన, కేటాయింపుల్లో సమతూకం లేక పనులు అసంపూర్తిగా మిగులుతున్నాయి. ఐదేళ్లలో విడుదలైన నిధులు, పనులకు పొంతన కుదరడం లేదు. పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు కేటాయించిన పనులు పూర్తయ్యాయా? లేదా? పర్యవేక్షణ జరపకుండా కొత్త పనులకు నిధులు వెచ్చిస్తున్నారు. 2009-10, 2010-11లలో ఏటా రూ.2 కోట్ల చొప్పున ఎంపీ నిధులు విడుదల కాగా ఈ తర్వాత రూ.5 కోట్లకు పెంచారు. ఎంపీలుగాృ ఎన్నికై ఇప్పటికే నాలుగున్నరేళ్లు పూర్తి కాగా ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్ కోటా రూ.19 కోట్లకు, రూ.15.58 కోట్లు విడుదల కాగా రూ.11.43 కోట్లు ఖర్చు చేశారు. పెద్దపల్లి డాక్టర్ వివేక్ జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగేళ్లలో తన కోటా కింద రూ.4.37 కోట్లు కేటాయించగా రూ.2.83 కోట్లు ఖర్చు చేశారు. మరో ఆరు నెలల్లో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా ఎంపీ కోటా కింద విడుదలయ్యే నిధులు ఎలా ఖర్చు చేస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్ నిధుల లెక్క.. ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్ ఐదేళ్లలో రూ.19 కోట్లు ఎంపీ ల్యాడ్స్ కింద విడుదలవుతాయన్న అంచనా మేరకు ఆయన 1,157 పనులకు ప్రతిపాదనలు చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. 2009-10లో రూ.2 కోట్లకు 284 పనులు ఆయన ప్రతిపాదించగా, ఆ సంవత్సరంలో రూ.1.80 కోట్ల విలువ చేసే 168 పనులు పూర్తయ్యాయి. 2010-11లో 138 పనులకు రూ.1.68 కోట్లు ఖర్చు చేశారు. 2011-12 నుంచి ఎంపీ కోటా రూ.5 కోట్లకు పెరగగా ఆ యేడు 356 పనులను ఆయన ప్రతిపాదించారు. అందులో రూ.4.22 కోట్లు ఖర్చు చేస్తే 213 పనులే పూర్తయ్యాయి. 2012-13లో రూ.5 కోట్లకు 298 పనులు ప్రతిపాదన చేయగా, రూ.3.73 కోట్లు ఖర్చు చేసి 160 పనులు పూర్తి చేశారు. అయితే 2013-14 సంవత్సరం కోటా మొదటి విడతలో రూ.1.54 కోట్లతో 117 పనులకు ప్రతిపాదించారు. ఎంపీగా ఆయన పదవీ కాలంలో విడుదలైన నిధులు, చేపట్టిన, పూర్తయిన పనుల వివరాలు చూస్తే ఏటా అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా ఆదిలాబాద్ ఎంపీ కోటా కింద విడుదలయ్యే రూ.19 కోట్లకు ప్రతిపాదించిన పనులు 1,157 కాగా, ఇప్పటి వరకు 619 పనులు మాత్రమే పూర్తయ్యాయి. పెండింగ్‌లో ఉన్న 538 పనులకు ఎప్పుడు నిధులు కేటాయిస్తారు? ఎప్పుడు ప్రారంభిస్తారు? అవెప్పుడు పూర్తవుతాయనేది చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి ఎంపీ కోటా కింద రూ.4.37 కోట్లు పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ ఆయన పార్లమెంట్ నియోజకవర్గం పరిధికి వచ్చే జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు నాలుగేళ్లలో రూ.4.37 కోట్లతో 316 అభివృద్ధి పనులను ప్రతిపాదించారు. అందులో 100 పనుల కోసం రూ.2.83 కోట్లు ఖర్చు కాగా... 2013-14 సంవత్సరానికి సంబంధించిన నిధుల నుంచి ఇంకా జిల్లాకు వాటా కేటాయించలేదు. 2009-10లో 106 పనుల కోసం రూ.84.15 లక్షలు కేటాయించగా 39 పనులు పూర్తి చేశారు. 2010-11లో రూ.83.78 లక్షలు 47 పనులకు కేటాయిస్తే 19 పనులే చేపట్టారు. 2011-12లో పెరిగిన కోటా ప్రకారం 108 పనుల కోసం రూ.1.68 కోట్లు కేటాయించగా రూ.1.16 కోట్లు ఖర్చు చేసి 42 పనులు పూర్తి చేశారు. 2012-13లో రూ.1.02 కోట్లతో 55 పనులు ప్రతిపాదించగా... కొత్త పనులు చేపట్టకపోగా, గతంలో పెండింగ్ పనులకు రూ.48.50 లక్షలు చెల్లించినట్లు రికార్డులు చెప్తున్నాయి. 2013-14 సంవత్సరానికి విడుదలయ్యే ఎంపీ నిధుల కోటాలో ఇంకా జిల్లాలోని మూడు సెగ్మెంట్లకు ప్రతిపాదనలు చేసినట్లు ఇటీవల అధికారులు వెల్లడించిన ఎంపీ కోటా నిధులు, పనుల జాబితాలో లేదు. ఇదిలా వుండగా ఎంపీ కోటా కింద విడుదలయ్యే నిధుల కింద చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణలో అధికారుల కూడ పారదర్శకంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఎంపీలు సైతం వీలైనంత వరకు అసంపూర్తి పనులు లేకుండా చూసిన తర్వాతే... కొత్త పనులకు నిధులు కేటాయిస్తే బాగుంటుందంటున్నారు. -
సాదాసీదాగా..
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం సాదాసీదాగా ముగిసింది. శనివారం ఎంపీ రాథోడ్ రమేష్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎజెండా ప్రకారం 28 అంశాలపై చర్చించాల్సి ఉండగా.. 15 అంశాలకే పరిమితం చేశారు. పైగా చర్చ జరిగిన అంశాలనూ అంతగా లోతుగా పట్టించుకోలేదు. చెన్నూర్ మండలం కత్తెరశాల వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు చేపట్టిన ధర్నాకు విజిలెన్స్ కమిటీ మద్దతు తెలిపింది. వాగుపై వంతెన నిర్మాణానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రధానంగా వ్యవసాయంలో పంట నష్టం, హౌసింగ్‌లో ఇళ్లను కట్టకుండానే బిల్లులు చెల్లించడం, కూలిపోయిన ఇళ్లు, పంచాయతీ రాజ్ శాఖలో వర్షాలకు చెడిపోయిన రోడ్లపై చర్చ కొనసాగింది. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, డ్వామాలో ఉపాధి హామీ కూలీ డబ్బుల చెల్లింపు, ఇందిర జలప్రభ కింద ఎస్సీ, ఎస్టీల వ్యవసాయ భూములకు సాగునీరు, ఆర్‌డబ్ల్యూఎస్‌లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీరు కల్పించాల్సిన గ్రామాలకు పైప్‌లైన్ సౌకర్యాలు, మార్కెట్ యార్డులో పత్తి కొనుగళ్లు, విద్యుత్, అంగన్వాడీలపై, పాఠశాలలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అహ్మద్‌బాబు మాట్లాడుతూ.. బేల మండలానికి మంజూరైన సబ్ మార్కెట్‌యార్డు ఏర్పాటుకు స్థలం గుర్తించామని, నాలుగు నెలల్లో కాంటాలతో కూడిన మార్కెట్‌యార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. జిన్నింగ్‌మిల్లులో పత్తి కొనుగోళ్లు కుదరదని, అలాగైతే జిల్లా వ్యాప్తంగా చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఐసీడీఎస్‌లో అమృతహస్తం, సబల కార్యక్రమంపై పూర్తి వివరాలను తనకు అందజేయాలని పీడీ మీరాబెనర్జీని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, పంచాయతీ భవనాలు, మండల సమాఖ్య భవన నిర్మాణాలకు, ఇతర పనులకు మార్చి 31 వరకు కొత్తగా మంజూరు ఇవ్వలేమని డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. హౌజింగ్ పీడీ గంగారాం మాట్లాడుతూ.. అవతవకలు జరిగిన మండలాల్లో విచారణ చేపట్టి సంబంధిత ఏఈని సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. విద్యుత్ శాఖ ఎస్ఈ అశోక్ మాట్లాడుతూ.. కరెంటు లేని గ్రామాల్లో స్తంభాలు సరఫరా చేస్తామన్నారు. చెడిపోయిన రోడ్లకు మరమ్మతు కోసం టెండర్లు పిలిచామని ఎస్ఈ ఉమా మహేశ్వర్‌రావు పేర్కొన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డీఆర్వో ఎస్ఎస్.రాజు, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జేడీఏ రోజ్‌లీల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇళ్లు కట్టకుండానే బిల్లులు చెల్లించారు.. - రాథోడ్మ్రేష్, ఆదిలాబాద్ ఎంపీ ఏజెన్సీ ప్రాంతమైన పిట్టగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కొసాయి గ్రామంలో గిరిజనులకు, కోలాంలకు, ఎస్సీ, ఎస్టీలకు 20 ఇళ్లు మంజూరయ్యాయి. కానీ.. వారు నిర్మించకుండానే అధికారులే బిల్లులు కాజేశారు. ఇందిర జలప్రభ కింద ఎంత మంది లబ్ధిదారులున్నారు.. ఏయే పనులు చేపట్టాల్సి ఉందో అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు - వివేక్, ఎంపీ, పెద్దపల్లి భీమిని, నెన్నెల, బెల్లంపల్లి మండలాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చాలా అవకతవకలు జరిగాయి. రచ్చబండ కార్యక్రమంలో కూడా ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. దండేపల్లి మండలం వెల్గనూరులో పశుసంవర్ధక శాఖకు చెందిన డాక్టర్ రావడం లేదు. ఇందిరా జలప్రభ కింద ఎస్సీ, ఎస్టీల వ్యవసాయ భూముల్లో బోర్లు వేయకుంటే ఆ పథకం ఫెయిల్ అయినట్లే. ఇటిక్యాల, కోటపల్లి, కాసిపేటలో ఆర్‌డబ్ల్యూఎస్‌కు సంబంధించిన పనులు ఇంకా ప్రారంభం కాలేదు. రోడ్లు సరిగా లేవు.. - గుండా మల్లేష్, ఎమ్మెల్యే, బెల్లంపల్లి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లాకు కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఇంటర్ కనెక్టివిటి కింద చేసి గ్రామాలలో పనులు జరిగేలా చూడాలి. క్లస్టర్ విలేజ్ ట్రైనింగ్ క్యాంప్‌కు ఒక్క గ్రామం, మండలం కానీ ఎంపికకాలేదు. వర్షాలకు రోడ్లు పూర్తి అధ్వానంగా మారాయి. టేకులపల్లి నుంచి మండల కేంద్రానికి వెళ్లాలంటే 15 నుంచి 20 కిలో మీటర్లు వెళ్లాల్సి వస్తుంది. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బెల్లంపల్లి మార్కెట్‌యార్డు విస్తరణకు ప్రభుత్వ భూమి కావాలి. మార్కెట్‌యార్డు పక్కన ఉన్న ఐదారు ఎకరాలు ప్రభుత్వ భూమిని కేటాయించాలి. రాత్రిపూట చీకట్లో ప్రజలు.. - కావేటి సమ్మయ్య, ఎమ్మెల్యే, సిర్పూర్ సిర్పూర్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, బల్బులు లేక ప్రజలు చీకట్లో ఉంటున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి ఇంకా డబ్బులు చెల్లించలేదు. రోడ్లు బాగా చెడిపోయాయి. పత్తి తీసుకురావాలంటే ఇబ్బందులు.. - గేడం నగేష్, ఎమ్మెల్యే బోథ్ బోథ్ వ్యవసాయ మార్కెట్‌యార్డుకు పత్తి తీసుకురావాలంటే రైతులు ఇబ్బందులు పడుతున్నా రు. నియోజకవర్గంలోని చాలా మండలాల్లో రోడ్లు చెడిపోయి ఉన్నాయి. పనులు చేపట్టాలి. సబ్‌మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలి.. - జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్ బేల మండలంలో సబ్ మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం 2008లో మంజూరు చేసింది. కానీ ఇంత వరకు సబ్ మార్కెట్‌యార్డు ఏర్పాటు కాలేదు. బేలలో మార్కెట్ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిన్నింగ్ మిల్లుల ద్వారా బేలలో పత్తి కొనుగోలు చేయాలి. జైనథ్‌లో మార్కెట్ యార్డు ఉన్న జిన్నింగ్ మిల్లులు లేవు. ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లే లేవు.. - వేణుగోపాలచారి, ఎమ్మెల్యే ముథోల్ ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు లేవు. రెండేసి రేషన్‌కార్డులు ఉన్నాయి. కుభీర్‌లో 12 ఇండ్లు కాలిపోయాయి. ఇండ్లు పూర్తిగా కట్టుకున్న వారు బిల్లుల కోసం తిరుగుతున్నరు. ఉపాధి కూలీ డబ్బులు అందించాలి. ఆరు గ్రామాలకు ఒక పోస్టాఫీసు మాత్రమే ఉంది. దీని వల్ల ఇబ్బంది అవుతంది. ఆధార్, నగదు బదిలీలాగే వ్యక్తి గత మరుగుదొడ్లను కూడా జిల్లాలో మొదటి స్థానంలో నిలపాలి. ఐసీడీఎస్ అధికారులకు ఫోన్ చేసినా స్పందించడంలేదు. -
కింకర్తవ్యం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో పార్టీ పటిష్టంపై ఆయన దృష్టి సారించారు. నియోజకవర్గం ఇన్చార్జీల మార్పులు, చేర్పులు, యువతరం నేతలకు అవకాశం కల్పించడం, వరుస కార్యక్రమాల ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నేతలను సన్నద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు రెండు రోజుల క్రితం జిల్లాకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులు, సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించారు. అయితే 2009 ఎన్నికల్లో ఒక పార్లమెంట్, నాలుగు ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఆయన అనుసరించిన రెండుకళ్ల సిద్ధాంతానికి ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరం అయ్యారు. ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గోనె హన్మంతరావు సహా పలువురు సీనియర్లు, నియోజకవర్గం ఇన్చార్జీలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణపై స్పష్టత ఇవ్వకుండా తెలంగాణ జిల్లాల్లో టీడీపీని పటిష్టపరచడం ఎలా సాధ్యం అవుతుందన్న చర్చ ఆ పార్టీ నేతల్లో మొదలైంది. పార్టీ పూర్వవైభవం కోసం అభిప్రాయ సేకరణ హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్, జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎమ్మెల్యే గోడం నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్, రాష్ర్ట, జిల్లా నాయకులు యూనిస్ అక్బానీ, పాయల శంకర్, లోలం శ్యాంసుందర్‌తోపాటు పలువురు ఇన్చార్జీలు హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలిపించుకునేందుకు కార్యోన్ముఖులు కావాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కొందరు నాయకులు తెలంగాణపై పార్టీ వైఖరి స్పష్టంగా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుం దని, భవిష్యత్‌లో ఇదే పరిస్థితి ఉంటే జనాల్లోకి వెళ్లడం కూడా కష్టమేనని చెప్పినట్లు సమాచారం. ఇందుకు బాబు స్పందిస్తూ ‘తెలంగాణపై టీడీపీ వైఖరి స్పష్టంగా ఉంది, మనం ఇచ్చిన లేఖ మేరకు కేంద్రం తెలంగాణకు ప్రకటించింది.. ఇదే విషయాన్ని ప్రజ లకు వివరించండి.. కాంగ్రెస్, టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టండి’ అని సూచించి నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాగా పది నియోజకవర్గాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్చార్జీల పనితీరును సమీక్షించారు. అయితే చెన్నూరు నియోజకవర్గం నుంచి ప్రాతిని థ్యం వహించిన మాజీ మంత్రి బోడ జనార్దన్ రాజీనామా తర్వాత అక్కడ నేతల మ ధ్య సమన్వయం కుదరడం లేదు. చెన్నూరు ఇన్చార్జి కోసం అందుగుల శ్రీనివాస్, డాక్టర్ నరేశ్‌లు పోటీపడగా, జిల్లాలోనే పరిష్కరించుకోవాలని సూచించినట్లు తెలిసింది. కాగా, జిల్లా నేతలు, చంద్రబాబు జరిపిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణకు పలు అభిప్రాయాలు వెల్లడించినట్లు సమాచారం. -
కాంగ్రెస్ హయూంలో ధరలకు రెక్కలు
కుభీర్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ హయూంలో ధరలకు రెక్కలు వచ్చాయని, పెట్రోల్, డీ జిల్‌తోపాటు ఉల్లి, కూరగాయలు, ఎరువులు, విత్తనాలు ధరలు ఆకాశాన్నంటాయని ఎంపీ రాథోడ్ రమేశ్ విమర్శించారు. మండలంలోని సౌంవ్లీ, లింగి, వాయి, అంతర్ని, మాలేగాం, సోనారి, డోడర్న గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన పర్యటించారు. టీడీపీ హయూంలో యూరియా బస్తా ధర రూ.160 ఉంటే ఇప్పుడు రూ.400లకు పెరిగిందని, డీఏపీ రూ.400 నుంచి రూ.1300లకు చేరిందని ఎంపీ ఆం దోళన వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు ఎక్కువయ్యూయని ఆరోపించారు. గ్రామాల్లో నీరు, డ్రెరుునేజీలు, రోడ్ల సమస్యలు పట్టించుకునేవారు కరువయ్యూరని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కమీషన్లతో దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదాకా అందరూ ఉద్యమించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు ఏం సాధించారని కృతజ్ఞత సభ పెట్టారని, ఆ పార్టీకి చెందినవారే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అంతకుముందు మాలేగాం, అంతర్నిలో సీసీ రోడ్ల పనులు ప్రారంభించారు. డోడర్న తండాలో బస చేశారు. టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు బోయిడి విఠల్, శేషనారాయణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వి.మోహన్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాశెట్టి రాజన్న, పార్టీ మండల అధ్యక్షుడు కె.శంకర్, మాలేగాం సర్పంచ్ రేఖ, నాయకులు పాల్గొన్నారు. -
భీమ్ విగ్రహ ధ్వంసానికి యత్నం
ఖానాపూర్, న్యూస్‌లైన్ : ఖానాపూర్ మండల కేంద్రంలోని జంగల్‌హన్మాన్ చౌరస్తాలో ఉన్న కొమురం భీమ్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యత్నించారు. రాజ్‌గోండ్ సేవాసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భీమ్ విగ్రహాన్ని ఆయన మనవడు సోనేరావు, ఎంపీ రాథోడ్ రమేశ్ 15 రోజుల క్రితం ఆవిష్కరించారు. ఈ విగ్రహం దిమ్మెకు ఉన్న శిలాఫలకాన్ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. తలభాగం స్వల్పంగా దెబ్బతింది. శనివారం దీనిని నిరసిస్తూ స్థానిక రాజ్‌గోండ్ సేవా సంఘం నాయకులు విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. భీమ్ విగ్రహం ధ్వంసానికి యత్నించి, శిలాఫలకం పగులగొట్టిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, అప్పటివరకు ఆందోళన కొనసాగిస్తామని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య డిమాండ్ చేశారు. ఈ సంఘటనను సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ తరఫున ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయమై ఈ నెల 11న ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. విగ్రహాన్ని ఎస్సై రాము పరిశీలించారు. కార్యక్రమంలో రాజ్‌గోండ్ సేవాసంఘం అధ్యక్ష, కార్యదర్శులు అంకుశ్రావు, కుడిమెత మధు, నాయకులు కొమురం దేవరావు, లక్ష్మణ్, ఎల్లయ్య, శంకర్, బుక్య గోవింద్, మాలవత్ రోహిదాస్, మక్కల బీమన్న, గాండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.