టీడీపీతోనే సామాజిక తెలంగాణ | social telangana posiible with TDP | Sakshi
Sakshi News home page

టీడీపీతోనే సామాజిక తెలంగాణ

Published Tue, Mar 4 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM

social telangana posiible with TDP

ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : టీడీపీతోనే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని ఎంపీ రాథోడ్ రమేశ్ అన్నారు. సోమవారం రాత్రి స్థానిక రోజ్ గార్డెన్‌లో నిర్వహించిన టీడీపీ తూర్పు జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చి సామాజిక తెలంగాణ సాధించుకుంటామన్నారు. రాబోయే మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని కోరారు.

ముఖ్యమంత్రి పదవి కోసం కేసీఆర్ పాకులాడుతున్నాడని ఆరోపించారు. టీడీపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. అనంతరం పార్టీ పెద్దపెల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి శరత్, నాగేశ్వర్‌రావును శాలువాలతో సన్మానించారు. పట్టణానికి చెందిన నరేశ్, సాయికిరణ్, మొయినొద్దీన్, మహేశ్, ఖాదర్ హుస్సేన్, చాంద్ పాషా, ప్రవీణ్, మల్లేశ్ తదితరులు ఎంపీ సమక్షంలో టీడీపీలో చేరారు.  బెల్లంపల్లి, కాగజ్‌నగర్, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జీలు పాటి సుభద్ర, బుచ్చిలింగం, నరేశ్, సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, నాయకులు అలిబిన్ అహ్మద్, చిట్టిబాబు, ప్రసాద్ గౌడ్, నిజాం, పిడుగు తిరుపతి, గణపురం ప్రకాశ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement