Social Telangana
-
సామాజిక తెలంగాణే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ప్రజా కేంద్రంగా అభివృద్ధే తమ లక్ష్యమని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికే సామాజిక తెలంగాణ సాధన కోసమే పార్టీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ వెనుకబడింది వనరుల్లేక కాదని, పాలకుల అవినీతి వల్లేనని అన్నారు. ఆదివారం హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో టీజేఎస్ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా కోదండరాంను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. పార్టీ ఏర్పాటు కారణాలు, లక్ష్యాలపై వివరించారు. ‘‘పోరాడి సాధించుకున్న తెలంగాణలో అధికారంలో ఉన్న నాయకులకు ఉద్యమ ఆకాంక్షల పట్ల గౌరవం పోయింది. ప్రస్తుతం ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు, నిరంకుశ పాలనకు మధ్య ఘర్షణ కొనసాగుతోంది. ఎటువైపు ఉంటారో తేల్చుకోండని తెలంగాణ సమాజం అడుగుతోంది. ప్రజాస్వామ్య ఆకాంక్షలను బలోపేతం చేయడానికి, నిరంకుశానికి వ్యతిరేకంగా మడమ తిప్పని పోరాటం కొనసాగిస్తాం. ఈ పోరాటంలో అంతిమ విజయం మాదే. యువతకు, రైతులకు, పేద వర్గాలకు న్యాయం జరిగేలా ప్రతి టీజేఎస్ కార్యకర్త కదలాలి. ప్రజలు, వారి బతుకు దెరువు కేంద్రంగా పని చేయాలి. మరో తెలంగాణను నిర్మించుకుందాం. కొత్త రాజకీయాలను సృష్టించుకుందాం’’ అని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగం చేసే వారిని నిలదీయాలన్నారు. ‘పెత్తనం చేయొద్దు.. దిగిపొమ్మని చెబుతాం.. దింపేందుకు వస్తున్నాం..’ అని పేర్కొన్నారు. ప్రకృతి వనరుల దోపిడీ జరుగుతోందని, ప్రభుత్వానికి కాంట్రాక్టర్లపై ఉన్న ఆసక్తి ప్రజా సంక్షేమంపై లేదని విమర్శించారు. ఇప్పటివరకు జరిగిన ఆగడాలు, అక్రమాస్తులు, కాంట్రాక్టర్ల దోపిడీపై తెలంగాణ జన సమితి విచారణ చేస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో గుడిసెవాసులకు ఒక్కరికి కూడా ఇళ్లు కట్టివ్వలేదన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఏడెనిమిది వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ ఆపితే అడ్వొకేట్లకు, జర్నలిస్టులకు, నిరుపేదలందరికీ ఇళ్లు కట్టి ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం ఒక్కరితో వచ్చింది కాదు.. తెలంగాణ కోసం 650 మంది బలిదానాలు చేసుకున్నారని కోదండరాం చెప్పారు. అలాంటివారి త్యాగాలతో తెలంగాణ వచ్చిందే తప్ప ఏ ఒక్కరి వల్లో కాదని పేర్కొన్నారు. అలాంటి తెలంగాణలో పోరాడిన వారిపై రౌడీషీట్లు పెట్టారని, పెట్టించిన వారు మంత్రుల స్థానంలో కూర్చున్నారని అన్నారు. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర లేదని, యువతకు ఉద్యోగాలు లేవని, కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన వేతనం అందడం లేదని చెప్పారు. రాష్ట్రంలో 2 లక్షల ఖాళీ పోస్టులున్నా వాటిని భర్తీ చేయడం లేదని విమర్శించారు. నాలుగేళ్లలో 15 వేల ఉద్యోగాలే భర్తీ చేశారన్నారు. వేదికపై అన్ని వర్గాలు ఆవిర్భావ సభకు పార్టీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వేదికపై వివిధ వర్గాలకు చెందిన వెయ్యి మంది కూర్చునే అవకాశం కల్పించారు. వీరిలో పార్టీ నాయకులతో పాటు మల్లన్నసాగర్, నేరెళ్ల బాధితులు, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబీకులు, అమర వీరుల కుటుంబీకులు, నిర్వాసితులు ఉన్నారు. కొట్లాడి తెచ్చుకున్నది ఇందుకేనా? రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వం కొనసాగుతోందని, ఇందుకేనా కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నది అని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు. అభివృద్ధి అంటే ప్రాజెక్టులు, బిల్డింగులు కట్టడం కాదని ప్రజలు స్వేచ్ఛగా, సుఖంగా జీవించడమని పేర్కొన్నారు. రాష్ట్రంలో నలుగురు వ్యక్తుల చుట్టూనే పాలన నడుస్తోందని ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి విమర్శించారు. ‘హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తా అంటడు.. మరోరోజు ఇస్తాంబుల్ చేస్తా అంటడు. స్కైవేలు.. హైవేలు అని చెప్పాడు కదా... అవన్నీ ఏమయ్యాయి’ అని మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ ప్రశ్నించారు. -
‘సామాజిక తెలంగాణే లక్ష్యం’
కామారెడ్డి అర్బన్: సామాజిక తెలంగాణే సీపీఐ లక్ష్యమని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయనున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు అజీజ్‌పాష అన్నా రు. కామారెడ్డిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం పాలన హిట్లర్‌ను తలపిస్తోందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. దళితులకు మూడెకరాల సాగుభూమి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతులకు రుణమాఫీ, నిరుద్యో గులకు లక్ష ఉద్యోగాలు భర్తీ అని చెప్పిన కేసీఆర్ నేడు వాటిపై నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధికి దూరంగా ఉందో, రాష్ట్రం సిద్ధించి మూడేళ్లు గడుస్తున్నా రాష్ట్ర అభివృద్ధి జరుగలేన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి వీఎల్ నర్సింహారెడ్డి, కార్యవర్గ సభ్యులు దుబాస్ రాములు, జే.బాల్‌రాజ్, ఎల్.దశరథ్, వెంకట్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్, రాజశేఖర్, ఎర్ర నర్సింలు, రాజమణి, కాశీ, నాగనాథ్, కృష్ణ, తదితరులు ఉన్నారు. -
సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటం
సంగారెడ్డిజోన్: సామాజిక తెలంగాణ కోసం రాష్ట్రంలో మరో పోరాటానికి శ్రీకారం చుడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు అన్నారు. మహాజన పాదయాత్ర వార్షికోత్సవం సందర్భంగా ‘సరళీకరణ విధానాలు– సామాజిక తరగతులపై ప్రభావం’ అనే అంశంపై సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవనలో మంగళవారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సామాజిక న్యాయం – తెలంగాణ సమగ్రాభివృద్ధికి గత ఏడాది అక్టోబర్ 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైన ‘మహాజన పాదయాత్ర’ తెలంగాణ అంతా పర్యటించిందన్నారు. ఈ యాత్రలో 9 మంది బృందం 4,200 కిలో మీటర్ల కాలినడకతో లక్షల మందిని కలుసుకున్నారన్నారు. ప్రజా సమస్యలను నాయకులు తెలుసుకున్నారని తెలిపారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, కార్మికులు, కూలీలు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, యువకులు, వికలాంగులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి బి.మల్లేశం, జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు జయరాజు, జిల్లా కమిటీ సభ్యులు సాయిలు, నర్సింలు, మల్లేశ్వరి, నాయకులు కృష్ణ, అశోక్, రమేష్, బాల్‌రాజ్, స్వాతి, నాగభూషణం, అనంతయ్య, లక్ష్మయ్య ఉన్నారు. -
సామాజిక తెలంగాణ కోసం కొత్త పార్టీ
తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్ వెల్లడి హైదరాబాద్: సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా అణగారిన రాష్ట్ర ప్రజల కోసం త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని హస్తినాపురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు చేసి జైళ్లకు వెళ్లిన వారిని పక్కన పెట్టారని, తెలంగాణ ద్రోహులు నేడు అధికార దాహంతో పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలను పరామర్శించి, అన్ని వర్గాల ప్రజల ఆమోదం పొంది జూన్ 2 నాటికి నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొందని పేర్కొన్నారు. బడుగు, బలహీన అణగారిన వర్గాల వారు నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుకు ఎదురు చూస్తున్నారన్నారు. గౌని నర్సింహ్మగౌడ్ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో ఓరుగంటి వెంకటేశం, తెలంగాణ బీసీ సమాఖ్య అధ్యక్షుడు దుర్గయ్య గౌడ్, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు. -
కోదండరాం ఎటువైపో తేల్చుకోవాలి..
తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ సాక్షి, కరీంనగర్: జేఏసీ చైర్మన్ కోదండరాం ఎటువైపో తేల్చు కోవాలని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. సామాజిక తెలంగాణ కోసం ఉద్య మిస్తారా? అధ్యయనాల పేరిట కాలయాపన చేస్తారో? స్పష్టం చేయాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. కరీంనగర్లో సోమ వారం ఆయన తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. సామాజిక శక్తులను కలుపుకుని ప్రజావ్యతిరేక విధానాలు, హక్కుల కోసం ఉద్యమించాల్సిన జేఏసీ చైర్మన్ కోదండరాం వైఖరి శోచనీయమని అన్నారు. ఈ నెల 24న దీక్షను భగ్నం చేస్తే ప్రజాస్వామ్య విలువలున్న ప్రత్యామ్నాయ గొంతుకలకు ఆయన మద్దతు కూడా ఇవ్వకపోవడం విచారకరమని అన్నారు. ప్రజలు అష్టకష్టాల్లో ఉంటే చినజీయర్ స్వామి, గవర్నర్ నరసింహిన్‌లకు సీఎం కేసీఆర్ ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. -
సామాజిక తెలంగాణకు ఉద్యమిద్దాం
కరీంనగర్ : సామాజిక తెలంగాణ కోసం చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలని పలువురు కోరారు. నవతెలంగాణ యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు బిజిగిరి నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో శనివారం అమరవీరుల స్థూపం వద్ద చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంకుబండ్‌పై ప్రతిష్ఠించాలని కోరారు. బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కెనపల్లి గణేష్, వివిధ ప్రజా సంఘాలు, మహిళ సంఘాల నాయకులు చిట్టిమల్ల శ్రీనివాస్, వరాల జ్యోతి, కలర్ సత్తెన్న, బొల్లం లింగమూర్తి, పైడిపల్లి రాజు, బిజిగిరి శ్రీనివాస్, కె.మల్లేశం, ప్రశాంత్, రామడుగు రాజేశ్, పూసాల సంపత్ తదితరులు పాల్గొన్నారు. సీపీయూఎస్ఐ ఆధ్వర్యంలో... ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ(సీపీయూఎస్ఐ)ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. జిల్లా కో ఆర్డినేటర్ సి.రమేశ్, గణేష్, మానేటి రాజు, ఎల్లయ్య, శ్రీనివాస్, భూమయ్య, యాదగిరి, ప్రసాద్, అరుణ్‌కుమార్, వెంకటసాయి, మధు, గోపి, సురేష్, దిలీప్, పెద్దిరాజు, కర్ణ తదితరులు పాల్గొన్నారు. గొర్రెల, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో గొర్రెల, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కడారి అయిలయ్య ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కటికిరెడ్డి బుచ్చన్న, బీర్ల కనకయ్య, రవీందర్, వట్టె శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, మేకల నర్సయ్య, కాల్వ మల్లేశం, సదానందం తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం
♦ ఈ నెల 13న హైదరాబాద్‌లో సదస్సు ♦ ప్రొఫెసర్ ప్రభంజన్‌యాదవ్ తెయూ(డిచ్పల్లి): సామాజిక తెలంగాణ కోసం బహుజనులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని సామాజిక తెలంగాణ సాధన సమితి కన్వీనర్ ప్రొఫెసర్ ప్రభంజన్‌యాదవ్ పిలుపునిచ్చారు. గురువా రం తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం లో కూడా బహుజనులకు సమన్యాయం దక్కడం లేదన్నా రు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో త్యాగాలు బహుజను లు చేస్తే, బహుకొద్ది మంది మాత్రమే దాని ఫలాలు అనుభవిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా అధికారంలోని ఉన్నవాళ్లు వ్యవహరిస్తు న్నారని అన్నారు. తెలంగాణలో 60 శాతం ఉన్న బీసీలకు సరైన ప్రాతినిధ్యం లభించలేదన్నారు. ఒకటి, రెండు అగ్ర కులాలే లెక్కకు మించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉన్నారని అన్నారు. ఇతర నామినేటెడ్ పోస్టులు, అధికారిక పదవుల్లో సైతం అగ్ర కులాల వారినే నియమిస్తున్నారని ఆరోపించారు. నిజానికి బహుజనులు లేని ఊరు, ఉద్యమం లేదన్నా రు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నత పదవులన్నీ అగ్రకులాల వారికే అంటగడుతున్నారని అన్నారు. 1600లకు పైగా బహుజన విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేస్తే, మిలియన్ మార్చ్‌లు, సాగర హారాలు, సకల జనుల సమ్మె చేస్తే స్వరాష్ట్రంలో అధికార బోగాలన్నీ రెండున్నర కులాల వారే అనుభవిస్తున్నారని మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం లేక పోవడాన్ని ఆయన తప్పు బట్టారు. ఈ నెల 13న హైదరాబాద్‌లోని బీసీ సెం టర్లో ‘సామాజిక తెలంగాణ సాధించుకోవడం ఎలా’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రభంజన్‌యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి బహుజన మేథావులు, ఉద్యమకారులు హాజరై ఐక్య కార్యాచరణ రూపొందించాలన్నారు. అనంతరం సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో అధ్యాపకులు దామెర జాన్సన్, ప్రవీణాబాయి, పున్నయ్య, రమణచారి, వెంకటేశ్వర్లు, రాజారాం, విజయలక్ష్మి, దత్తహరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
హామీలపై నిలదీయండి
- సామాజిక తెలంగాణ ఇదేనా..? - ఇంటికో ఉద్యోగం ఏదీ? - అల్లుడొచ్చి 11 నెలలైంది.. ఇల్లు ఎక్కడ? - టీఆర్ఎస్పై మాజీ ఉప ముఖ్యమంత్రి ఫైర్ పుల్కల్: ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ప్రశ్నించారు. శనివారం మండల పరిధిలోని శివ్వంపేట, అంగడ్‌పేట గ్రామాలను సందర్శించారు. అనంతరం నవయుగ యూత్ 15వ వార్సికోత్సవంలో దామోదర మాట్లాడుతూ.. ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి అమాయక ఓటర్లను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ హామీలను విస్మరించిందన్నారు. తాము అధికారంలోకి వస్తే నిరుపేదలు ఇరుకు ఇండ్లల్లో ఉంటున్నారని.. పండుగకు అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలో తెలియదని అందుకోసం టీఆర్ఎస్ నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి 11 నెలలైంది. అల్లుడు ఎక్కడ పడుకోవాలని సీఎం చెప్పాలని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకున్నా ఆయన ఇంట్లో మాత్రం నలుగురికి ఉద్యోగాలు సంపాదించుకున్నాడని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చే హామీలపై ఆలోచింప చేసే బాధ్యత యువతపై ఉందన్నారు. రెండు రోజుల క్రితం పార్టీ మారిన నాయకునికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే యువకులు గెలిపించారన్నారు. తాను ఈ నియోజవర్గ ప్రజలు ఊహించని విధంగా దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చానన్నారు. ఫలితంగా రూ.1400 కోట్లతో భవ నాలు నిర్మాణం కావడంతో ఈ ప్రాంత రూపురేకలు మారిపోయాయని భూముల రేటు పెరిగిందన్నారు. జేఎన్టీయూ కావాలని ఎవరూ అడగలేదు? వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల కావాలని, మహిళా పాలిటెక్నిక్ కళాశాల కావాలని అడుగకుండానే నియోజకవర్గ అభివృద్ధి కోరి తీసుకొచ్చానని తెలిపారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శివ్వంపేట నుంచి వెంకటకిష్టాపూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీబీ డెరైక్టర్ రాంచెంద్రారెడ్డి, మాజీ జె డ్పీటీసీ మ ల్లప్ప, పార్టీ మండల అధ్యక్షుడు దుర్గారెడ్డి, నవయుగ యూత్ జిల్లా అధ్యక్షుడు సదానందం, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకునికి పరామర్శ... మండల పరిధిలోని మిన్పూర్ మాజీ సర్పంచ్ పాండును దామోదర రాజనర్సింహా పరామర్శించారు. శనివారం మండల పర్యటనకు వచ్చిన ఆయన మండల కాంగ్రెస్‌నాయకుడు, మిన్పూర్ మాజీ సర్పంచ్ పాండు కుమారుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. -
జన తెలంగాణ
నేతన్నలను ఆదుకోవాలి... వ్యవసాయం తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న రంగం చేనేత. ఆదరణ లేక నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వైఎస్ హయాంలో తప్ప నేతన్నలను పట్టించుకున్నవారే కరువయ్యారు. కొత్త రాష్ట్రంలో చేనేత కార్మికులు సగర్వంగా బతకాలి. 50 ఏళ్లు నిండిన నేత కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వాలి. ఉచిత వైద్యం కల్పించాలి. -లింగబత్తులరమేష్ సోమారం,తొర్రూరు తొలి అడుగు.. సామాజిక తెలంగాణ సాధనలో దళితనేత సీఎం కావడం తొలి అడుగు మా త్రమే. దళిత సీఎం అని పదేపదే ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారు. ఉద్యమంలో దళితబహుజన శక్తుల పాత్రే అత్యంత కీలకం. సామాజిక తెలంగాణ ద్వారానే దురన్యాయాలు అంతమవుతాయి. సామాజిక న్యాయం కోసం తొలిమెట్టుగా తెలంగాణ తొలిసీఎం దళితుడే కావాలి. -కడియం సుదేశ్ కుమార్ ఎర్రబెల్లిగూడెం -
టీఆర్ఎస్తో గడీల పాలనే
నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని వారికి టిక్కెట్లు ఇచ్చిన టీఆర్ఎస్తో సామాజిక తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలతో మళ్లీ గడీల పాలన వస్తుందన్న భయం ప్రజల్లో నెలకొందన్నారు. జిల్లాకేంద్రంలోని తన నివాసంలో బుధవారం ఉదయం విలేకరుల సమావేశంలో డీఎస్ మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను చూస్తే, వారు ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండడంతో పాటు పార్టీ జెండాలను మోసిన వారిని పక్కనపెట్టడంపై టీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోనే తెలంగాణ ప్రాంతాన్ని ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తమపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాలని తాను అనుకోవటంలేదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులే తాను సీఎం కావాలని కోరుకుంటున్నారని డీఎస్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఎన్నికల మేనిఫెస్టో అన్ని పార్టీల కంటే బాగుందని కితాబిచ్చారు. తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకోవడం, యువత, మహిళలు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందన్నారు. మేనిఫెస్టోలో తన సూచనలు ఎన్నో ఉన్నాయన్నారు. ఇప్పటికే తాను ’200 కోట్లతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. 2016 వరకు ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టులు పూర్తయి సిరికొండ మండలం వరకు సాగు,తాగునీరు అందిస్తామన్నారు. సిరికొండ లో రెండు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని చెప్పారు. ధర్పల్లిలో జూనియర్ ,పాలిటె క్నిక్ కళాశాలలను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. -
సమప్రాధాన్యతతోనే సామాజిక తెలంగాణ
న్యూఢిల్లీః తెలంగాణ రాష్ట్రంలో అన్నివర్గాలకు సమప్రాధాన్యం కల్పిస్తేనే సామాజిక తెలంగాణ సాధ్యమవుతందని మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ చైర్మన్ చిత్తరంజన్‌దాస్ అన్నారు. ఏపీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ శాససన సభ సీట్ల కేటాయింపులో ఒక్కో జిల్లాకు నాలుగు చొప్పున కనీసం 40 సీట్లు ఓబీసీలకు కేటాయించాలని కాంగ్రెస్‌పార్టీ అధిష్టానానికి ఆయన విజ్ఞప్తి చేశారు. సామాజిక తెలంగాణలో ఓబీసీలందరికీ న్యాయం జరుగుతుందన్న ఆశతో బీసీలు ఉన్నారన్నారు. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం జరుగుతున్న సీట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరుగుతుందన్న భయాందోళనలు ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించాలన్నా, రాహూల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి సీట్లు కేటాయించడం సరైంది కాదన్నారు. ఓవైపు బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బీసీ నినాదంతో వస్తున్నారని, తెలంగాణలో బీసీనే ముఖ్యమంత్రిని చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌పార్టీలోనూ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు. నాలుగు శాతంలో ఉన్న అగ్రకులాలకు అధిక సీట్లు కేటాయించి, 56 శాతం ఉన్న బీసీలకు జిల్లాకు ఒక సీటు ఇస్తే ఆ ప్రభావం ఓటర్లపై పడుతుందని హెచ్చరించారు. చెన్నారెడ్డి తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతూ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియాగాంధీని, రాహూల్ గాంధీని నేరుగా కలిసే అవకాశం లేకపోవడంతోనే మీడియా ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. పార్టీ అధిష్టానం స్పందించి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు సమప్రాధాన్యం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దీనిపై దిగ్విజయ్‌సింగ్‌కి కలిసి చెప్పినట్లు తెలిపారు. గెలవగలిన శక్తి ఉన్న ఓబీసీ నాయకులను ఎంపిక చేసి అత్యధిక మందికి సీట్లు కేటాయించాలన్నారు. సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలతో అధికారంలోకి రాలేమని, సామాజిక న్యాయమూ ముఖ్యమే అని ఆయన సూచించారు. -
బడుగుల రాజ్యం రావాలి
నవ తెలంగాణ: సామాజిక తెలంగాణ కావాలి. బడుగులకు అధికారంలో వాటా రావాలి. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలను ఆధునికీకరించాలి. పారిశ్రామిక విధానం పక్కాగా ఉండాలి. నియంతృత్వ వ్యవసాయ విధానం రావాలి. అప్పుడే తెలంగాణ నవ నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సూచనలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం కావాలి. జనాభాలోని దామాషా ప్రకారం అధికారంలో వాటా ఉండాలి. అప్పుడే తెలంగాణ నవ నిర్మాణం సాధ్యమవుతుంది.. - ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ అంతరంగం సామాజిక తెలంగాణ కావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం కావాలి. జనాభాలోని దామాషా ప్రకారం అధికారంలో వాటా ఉండాలి. అప్పుడే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమవుతుంది. లేకుంటే తెలంగాణ వచ్చి ప్రయోజనం ఉండదు. - గిరిజన ప్రాంతాల్లో మైనింగ్‌కు ప్రత్యేక విధానం ఉండాలి. భూమి కోల్పోయిన కుటుంబానికి తప్పనిసరిగా ఉద్యోగం ఇవ్వాలి. గిరిజన ప్రాంతాల్లో వెలికితీసిన ఖనిజాలకు అవసరమైన సంబంధిత పరిశ్రమలను అక్కడే ఏర్పాటు చేయాలి. - గిరిజన మైనింగ్‌లో భూమి కోల్పోయిన వారికి సంబంధిత కంపెనీల్లో లేదా మైనింగ్ లాభాల్లో వాటా ఇవ్వాలి. - పారిశ్రామిక విధానం పక్కాకా ఉండాలి. తెలంగాణలో పెట్టుబడి పెట్టే పారిశ్రామిక వేత్తలకు వారు పరిశ్రమలు నెలకొల్పుకునేందుకు 75 శాతం ప్రభుత్వమే సమకూర్చాలి. - {పభుత్వ ధనంతో ఏర్పాటైన పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కల్పించాలి. రిజర్వేషన్లు ఉండాలి. - కార్పొరేట్ ఆసుపత్రులకు పాలకమండలి ఏర్పాటు చేసి ప్రభుత్వమే వాటిని నిర్వహించాలి. కార్పొరేట్ చేతుల్లో ఆసుపత్రులు ఉండకూడదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సెకండరీ గ్రేడ్ ఆసుపత్రులను మోడ్రన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చాలి. - కార్పొరేట్ స్కూళ్లను ప్రభుత్వం చేపట్టాలి. సంబంధిత యాజమాన్యాలకు పరిహారం ఇచ్చి టేక్ఓవర్ చేయాలి. - {పభుత్వ పాఠశాలలను ఆధునికీకరించాలి. నిర్బంధ కంప్యూటర్ విద్యను అమలుచేయాలి. - నియంత్రిత వ్యవసాయ విధానం ఉండాలి. అందుకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వమే రైతులకు ఉచితంగా ఇవ్వాలి. నీటి సౌకర్యం కల్పించాలి. ఉచిత విద్యుత్ అందజేయాలి. - రైతు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రభుత్వమే వాటిని కొనాలి. - {పాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి. - వరంగల్‌లోని ఫ్లడ్ ఫ్లో కెనాల్‌ను పూర్తిచేయాలి. - ఎలిమినేటి మాధవరెడ్డి సొరంగ మార్గం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి. - నెట్టెంపాడు, మంజీర, ఉండి ప్రాజెక్టులను ఐదేళ్లలోగా పూర్తిచేయాలి. - భూపాల్పల్లి, మణుగూరు, పాల్వంచల్లో అదనపు విద్యుత్ కేంద్రాలను వచ్చే ఐదేళ్లలో నెలకొల్పాలి. ఈలోగా కొరతను అధిగమించేందుకు జాతీయ విద్యుత్ గ్రిడ్ నుంచి సగం ధరకు కేంద్రం విక్రయించాలి. - పోలవరం డిజైన్‌ను మార్చి సిరీస్ ఆఫ్ ప్రాజెక్టులను నిర్మించాలి. - హైదరాబాద్ శాంతిభద్రతల నిర్వహణ బాధ్యతను గవర్నర్‌కు రెండేళ్లకే పరిమితం చేయాలి. - ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను రెండేళ్లకే కుదించాలి. - ఉమ్మడి ఉద్యోగుల కాలవ్యవధిని రెండేళ్లకే కుదించాలి. - వచ్చే ఐదేళ్ల వరకు తెలంగాణ సినిమాలకు 75 శాతం సబ్సిడీ ప్రభుత్వమే సమకూర్చాలి. 100 శాతం తెలంగాణలో తీసే సినిమాలకు దీన్ని వర్తింపచేయాలి. అందులో తప్పనిసరిగా 70 స్థానిక ఉద్యోగులు, కళాకారులు ఉండేలా చూడాలి. జన తెలంగాణ: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలి నవ తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములవ్వాలి. ముఖ్యంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలి. ‘ప్రైవేటు’కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం, ఎంఈఓ పోస్టుల భర్తీ వంటి చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి. తెలంగాణ వీరయోధుల చరిత్రను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలి. - కామిడి సతీష్‌రెడ్డి, టీచర్, పరకాల, వరంగల్ ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలి నవ తెలంగాణ అభివృద్ధికి అవినీతి, నిరుద్యోగం అడ్డు కారాదు. కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం యువతకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలి. అభివృద్ధికి అవినీతే పెద్ద అవరోధం కాబట్టి దాని నివారణకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. - ఎండీ అక్తర్‌పాషా, టీచర్, ఆత్మకూరు,మహబూబ్‌నగర్ సామాజిక, ఆర్థికాభివృద్ధిపై దృష్టి పెట్టాలి చివరి గ్రామం వరకు సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధించినప్పుడే బంగారు తెలంగాణ ఆవిష్కృతమవుతుంది. ప్రతి రంగంలోను మెరుగైన సంస్కరణలు తేవాలి. నాణ్యమైన విద్య, వైద్యం అందించడం, విద్యుత్ లోటు భర్తీ వంటి చర్యలు చేపట్టాలి. ఇందుకోసం సామాజిక వేత్తలతో కూడిన దార్శనిక ప్రభుత్వం కొలువు తీరాల్సిన అవసరముంది. - జన్‌పల్లి అమృతరాజు, కొత్తకోట,మహబూబ్‌నగర్ జిల్లా యువత, బడుగు వర్గాలకు ప్రాధాన్యమివ్వాలి నవ తెలంగాణ నిర్మాణంలో యువత, రైతులు, దళితులు, బలహీన వర్గాలకు ప్రాధాన్యతివ్వాలి. సత్వరమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి... ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో మాదిరిగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలి.రైతుల రుణాలు మాఫీ చేయాలి. బలహీన వర్గాలకు భూపంపిణీ చేపట్టాలి. చేనేత పరిశ్రమను ఆదుకోవాలి. ఇందుకోసం సమర్థవంతమైన నాయకత్వం అవసరం. - చింతకింది మధు,గౌస్‌కొండ గ్రామం, నల్లగొండ జిల్లా -
ఒక్క చాన్స్ ఇస్తే.. స్వర్ణాంధ్రను చేస్తా: చంద్రబాబు
సాక్షి, నెల్లూరు: ‘‘నాకు ఒక్క అవకాశం ఇస్తే సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తా.. తెలంగాణను సామాజిక తెలంగాణ చేస్తా.. సీమాంధ్ర నుంచి 25 పార్లమెంట్ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిపిస్తే మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పుతా’’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు అధికారమిచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి 33 ఎంపీ స్థానాలు పొంది అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత మరచి తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టిందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన ఎంతో బాధ కలిగించిందన్నారు. విభజనతో నదీజలాల సమస్య వస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానని శపథం చేశారు. టీడీపీ ఐదో ప్రజాగర్జనను బాబు బుధవారం నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్సీ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది టీడీపీ ఒక్కటేనన్నారు. ‘‘హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది నేనే.. ఈ దొంగ కాంగ్రెస్, కేసీఆర్ కాదు’’ అని పేర్కొన్నారు. తనకు ప్రధాని పదవి ఇస్తామని చెప్పినా తెలుగుజాతి కోసం వదులుకున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అడ్రస్ లేకుండా చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో తన ప్రజాగర్జన ఎన్నికల శంఖారావంలా మారిందని బాబు పేర్కొన్నారు. అంతకుముందు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఓ కల్యాణ మండపంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు సభలో బాబు పలు ఎన్నికల హామీలను కుమ్మరించారు. అవేమిటంటే... * రైతులను ఆదుకునేందుకు రుణాలను రద్దు చేస్తా. * డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా. * వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్లు ఇస్తా. * బీసీలకు 100 అసెంబ్లీ సీట్లు ఇస్తాం. * బీసీ డిక్లరేషన్ తెస్తాం.. బడ్జెట్లో సబ్‌ప్లాన్ అమలు చేస్తాం. * కాపుల పేదరికాన్ని పోగొట్టేందుకు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్. * దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా. * ముస్లింల రిజర్వేషన్లు కొనసాగిస్తా. వారికి రాజకీయ ప్రాధాన్యత * బ్రాహ్మణుల అభివృద్ధికి రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం. * నుంచి బాబు వరుస గర్జనలు చంద్రబాబు ఈ నెల 8 నుంచి నెలాఖరు వరకూ వరుసగా వివిధ వర్గాల గర్జనలు, ప్రజాగర్జనలు నిర్వహించనున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 8న హైదరాబాద్‌లో మహిళ , 16న గుంటూరులో రైతు, 18న అనంతపురంలో బీసీ, 20న హైదరాబాద్‌లో యువ, 23న వరంగల్‌లో ఎస్సీ,ఎస్టీ, 28న ఆదిలాబాద్‌లో గిరిజన గర్జన నిర్వహిస్తారు. 12న విశాఖ, 15న ఖమ్మం, 17న కృష్ణా, 19న కర్నూలు, 21న శ్రీకాకుళం, 22న తూ.గో., 24న కరీంనగర్, 25న మహబూబ్‌నగర్, 27న కడపల్లో ప్రజాగర్జనలు నిర్వహిస్తారు. బాబును కలసిన సబితారెడ్డి: మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం చంద్రబాబును కలిశారు. ఈ నెల 9న హైటెక్స్‌లో జరిగే తన కుమారుడి వివాహానికి ఆయనను ఆహ్వానించారు. ఇదిలావుంటే.. ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి మంగళవారం బాబుతో భేటీ అయ్యారు. వీరిద్దరూ ఎప్పటి నుంచో టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. -
టీడీపీతోనే సామాజిక తెలంగాణ
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : టీడీపీతోనే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని ఎంపీ రాథోడ్ రమేశ్ అన్నారు. సోమవారం రాత్రి స్థానిక రోజ్ గార్డెన్లో నిర్వహించిన టీడీపీ తూర్పు జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చి సామాజిక తెలంగాణ సాధించుకుంటామన్నారు. రాబోయే మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి పదవి కోసం కేసీఆర్ పాకులాడుతున్నాడని ఆరోపించారు. టీడీపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్రావు మాట్లాడుతూ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. అనంతరం పార్టీ పెద్దపెల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి శరత్, నాగేశ్వర్రావును శాలువాలతో సన్మానించారు. పట్టణానికి చెందిన నరేశ్, సాయికిరణ్, మొయినొద్దీన్, మహేశ్, ఖాదర్ హుస్సేన్, చాంద్ పాషా, ప్రవీణ్, మల్లేశ్ తదితరులు ఎంపీ సమక్షంలో టీడీపీలో చేరారు. బెల్లంపల్లి, కాగజ్‌నగర్, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జీలు పాటి సుభద్ర, బుచ్చిలింగం, నరేశ్, సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, నాయకులు అలిబిన్ అహ్మద్, చిట్టిబాబు, ప్రసాద్ గౌడ్, నిజాం, పిడుగు తిరుపతి, గణపురం ప్రకాశ్ పాల్గొన్నారు. -
'టీటీడీపీ నాయకులు ఆడోమగో తేల్చుకోవాలి'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నాయకులు తము ఆడో, మగో తేల్చుకోవాలని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ సూచించారు. తెలంగాణలో టీడీపీకి స్థానం లేదని, ఆపార్టీలో కొనసాగితే ఎటూ కానివారిగా మిగిలిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె. మహంతిని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ‘సామాజిక తెలంగాణ’ అనే మాటను ఉచ్చరించే అర్హత కూడా లేదని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల నుంచి తొలగించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి కోరినట్లు తెలిపారు. జులై 30న సీడబ్ల్యుసీ నిర్ణయం వెలువడిన తరువాత కిరణ్ తీసుకున్న వివక్షపూరిత నిర్ణయాలపై చర్యలు తీసుకోవాలని గవ ర్నర్‌ను కలిసి కోరినట్లు చెప్పారు. బదిలీలు, అభివృద్ధి కార్యక్రమాలు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు, ఇతర పాలసీ నిర్ణయాలన్నింటి వెనుక సీఎం సోదరుడు సంతోష్‌రెడ్డి ఉన్న నేపథ్యంలో ఆయనపై కూడా విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని సీలేరు 450 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును, పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రకు కేటాయించడం అన్యాయమని అన్నారు. కాంగ్రెస్ సీఎంగా కొనసాగిన కిరణ్‌కుమార్ రెడ్డి మాట తప్పినట్లు కేసీఆర్ విలీనం విషయంలో మాట తప్పరని ఆయన భరోసా వ్యక్తం చేశారు. విలీనం కాకపోతే ఘర్షణలతో తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన పేర్కొన్నారు. -
‘ఇక సామాజిక తెలంగాణ కోసం ఉద్యమిస్తాం’
హైదరాబాద్: పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తాము ఇక రాజ్యాధికారంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భాగస్వామ్య ఫలాలందే సామాజిక తెలంగాణ కోసం పోరాడతామని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ నేత, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. ఇదే డిమాండ్ మార్చి రెండవ తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సామాజిక తెలంగాణ యుద్ధభేరి సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు అధికారం ఇవ్వడానికి అగ్రవర్ణాలు అంత సులభంగా అంగీకరించే పరిస్థితి ఉండదని... అందుకే తమ సభకు యుద్ధభేరిగా నామకరణం చేయాల్సి వచ్చిందని చెప్పారు. పార్టీ నేతలతో కలిసి శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ యుద్ధభేరి సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అజిత్‌సింగ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ హాజరవుతారని చెప్పారు. వచ్చే ఎన్నికలలో తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నామని దిలీప్‌కుమార్ తెలిపారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాల సభ్యులకు ఎన్నికలలో కొన్ని సీట్లు కేటాయించాలని కోరబోతున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆరే చెప్పారని.. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తమలో విలీనం కావాలని కోరుకుంటుందన్నారు. నిర్ణయం తీసుకోవాల్సింది కేసీఆర్నేనని అన్నారు.