సంగారెడ్డిజోన్: సామాజిక తెలంగాణ కోసం రాష్ట్రంలో మరో పోరాటానికి శ్రీకారం చుడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు అన్నారు. మహాజన పాదయాత్ర వార్షికోత్సవం సందర్భంగా ‘సరళీకరణ విధానాలు– సామాజిక తరగతులపై ప్రభావం’ అనే అంశంపై సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవనలో మంగళవారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సామాజిక న్యాయం – తెలంగాణ సమగ్రాభివృద్ధికి గత ఏడాది అక్టోబర్ 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైన ‘మహాజన పాదయాత్ర’ తెలంగాణ అంతా పర్యటించిందన్నారు. ఈ యాత్రలో 9 మంది బృందం 4,200 కిలో మీటర్ల కాలినడకతో లక్షల మందిని కలుసుకున్నారన్నారు.
ప్రజా సమస్యలను నాయకులు తెలుసుకున్నారని తెలిపారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, కార్మికులు, కూలీలు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, యువకులు, వికలాంగులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి బి.మల్లేశం, జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు జయరాజు, జిల్లా కమిటీ సభ్యులు సాయిలు, నర్సింలు, మల్లేశ్వరి, నాయకులు కృష్ణ, అశోక్, రమేష్, బాల్‌రాజ్, స్వాతి, నాగభూషణం, అనంతయ్య, లక్ష్మయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment