![CPI calls people to fight for social Telangana](/styles/webp/s3/article_images/2017/10/21/CPI.jpg.webp?itok=Z4LeLmAd)
కామారెడ్డి అర్బన్: సామాజిక తెలంగాణే సీపీఐ లక్ష్యమని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయనున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు అజీజ్‌పాష అన్నా రు. కామారెడ్డిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం పాలన హిట్లర్‌ను తలపిస్తోందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు.
దళితులకు మూడెకరాల సాగుభూమి, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, రైతులకు రుణమాఫీ, నిరుద్యో గులకు లక్ష ఉద్యోగాలు భర్తీ అని చెప్పిన కేసీఆర్ నేడు వాటిపై నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధికి దూరంగా ఉందో, రాష్ట్రం సిద్ధించి మూడేళ్లు గడుస్తున్నా రాష్ట్ర అభివృద్ధి జరుగలేన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి వీఎల్ నర్సింహారెడ్డి, కార్యవర్గ సభ్యులు దుబాస్ రాములు, జే.బాల్‌రాజ్, ఎల్.దశరథ్, వెంకట్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్, రాజశేఖర్, ఎర్ర నర్సింలు, రాజమణి, కాశీ, నాగనాథ్, కృష్ణ, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment