ఉల్లి ధరతో గృహణికి కన్నీళ్లు: చంద్రబాబు
ఉల్లిపాయ కేజీ ధర రూ.90 చేరుకోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. యూపీఏ పాలనలో నిత్యవసర ధరలు ఆకాశన్నంటాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఉల్లిపాయి ధరలే ఉదహారణ అని ఆయన పేర్కొన్నారు.
ఆకాశానంటిన ధరలను నేలకు దించేందుకు కేంద్రం చేపట్టిన చర్యలు శూన్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలవి మాటలే తప్ప చేతలు శూన్యమని తెలిపారు. ఉల్లికొనాలంటే గృహణి కళ్లలో కన్నీళ్లు వస్తున్నాయని బుధవారం చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాగే సైబరాబాద్ పరిధిలో ఐటీ ఉద్యోగినిపై జరిగిన అత్యాచార ఘటన పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు నిర్భయ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Onion price at Rs.90/KG, essential commodities skyrocketing, tears in the eyes of house wifes. UPA talks but no action.
— N Chandrababu Naidu (@ncbn) October 22, 2013
Nirbhaya act cudn't save an IT employee Abhaya in Cyberabad. I express my deep concern & demand strict implementation of Nirbhaya act.
— N Chandrababu Naidu (@ncbn) October 23, 2013