సాక్షి, నెల్లూరు: విద్యుత్ ఛార్జీలు పెంచి.. తమపై నిందలు మోపడం దారుణమంటూ కూటమి సర్కార్ తీరుపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి.. రెండోసారి కూడా పెంచుతున్నారంటూ దుయ్యబట్టారు.
9,400 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. విద్యుత్ రంగం సంక్షోభంలో కురుకుపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణం. 2014-19 మధ్య సోలార్, విండ్ పవర్‌ను సగటున 5.10 పైసలు పైనే చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. వైఎస్ జగన్ నిర్ణయం వల్ల రాష్టానికి లక్షా పది వేల కోట్లు ఆదాయం వస్తే.. చంద్రబాబు హయాంలో 90 వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం పడింది. చంద్రబాబు దిగిపోయే సరికి రూ.86,215 కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి డిస్కమ్‌లు వెళ్లిపోయాయి’’ అని కాకాణి వివరించారు.
సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టినా.. కరెంట్ ఛార్జీలు పెంచినా.. ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. నిత్యావసర వస్తువులు నుంచి.. మద్యం దాకా అన్నీ రేట్లు పెరిగాయి. సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు.. ప్రజల సంపదను ఆవిరి చేస్తున్నారు. సంక్షేమ పథకాలు రాకపోవడంతో.. కుటుంబ ఆదాయం పడిపోయింది.. అప్పులు పెరగడంతో కాల్ మనీ గ్యాంగ్‌లు హాల్ చల్ చేస్తున్నాయి. ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలని చూస్తున్నారు.. అందుకే రెండోసారి కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు.’’ అని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీన్ని వైస్సార్సీపీ ఖండిస్తుంది..
మంత్రి నారాయణ వర్సెస్ కోటంరెడ్డి వ్యవహారంపై కాకాణి స్పందిస్తూ.. ప్రతి జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అవినీతిలో విభేదాలు వస్తున్నాయి. రాయలసీమలో అది నారాయణ రెడ్డి, జేసీ మధ్య రాజకీయ వివాదం రచ్చకెక్కింది. నేతల మధ్య సమన్వయం ఉండటం లేదు.. పాలన సరిగా లేదనడానికి నిదర్శనం.. కూటమి నేతల మధ్య బయటపడుతున్న విభేదాలే స్పష్టం చేస్తున్నాయి’’ అని కాకాణి గోవర్థన్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment