సాక్షి, హైదరాబాద్: ఉల్లి ధర వారం రోజుల నుంచి ఆకాశాన్నంటుతోంది. రాష్ట్రంలో ఉల్లి ధరలు అంతకంతకూ పెరుగుతూ.. సామాన్యులకు కంటనీరు రప్పిస్తోంది. క్రమేపీ పెరుగుతున్న ఉల్లి ధరలతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు
నెల రోజుల క్రితం క్వింటాల్ రూ.3000–3500 ఉండగా, ఒక్కసారిగా రూ. 6000 నుంచి 7500 వరకు పెరిగింది. మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌కు వివిధ రాష్ట్రాల నుంచి రోజుకు 30 వేల బస్తాలు దిగుమతి అవుతుండగా, ఇప్పుడు రోజుకు 8వేల బస్తాలు మాత్రమే దిగుమతి అవుతోంది.
మహారాష్ట్రలో వర్షపాతం తక్కువగా ఉండటంతో పంట వేయలేదని, అందుకే దిగుమతి తక్కువగా ఉంటోందని అధికారులు చెప్పారు. వర్షాల కారణంగా ఏపీలో రైతులు ఉల్లికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయడంతో ఆంధ్రా నుంచి ఉల్లి దిగుమతి తక్కువైందన్నారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వడం కూడా ఉల్లి ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు.
అక్రమార్కులపై నిఘా:
కొత్తపంట వచ్చే వరకు ఉల్లి క్వింటాల్‌కు రూ. 6,000 నుంచి 8,000 వరకు ధర ఉంటుంది. నెల రోజులపాటు ఉల్లి ధర కిలో రూ.60 నుంచి 90 మధ్య ఉంటుంది. అక్రమ వ్యాపారులపై నిఘా పెట్టాం.
-రవీందర్‌రెడ్డి, గ్రేడ్–3 కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment