
సాక్షి, కర్నూలు: దేశవ్యాప్తంగా ఉల్లి ధర ఆకాశాన్ని అంటుతోన్న విషయం తెలిసిందే. రోజురోజుకు ప్రజల్లో ఉల్లిపై డిమాండ్ భారీగా పెరుగుతోంది. తాజాగా సోమవారం కర్నూలు జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లి ధర గరిష్ట స్థాయిలో పలికింది. క్వింటాల్ ఉల్లి ధర రూ. పది వేలకుపైగా అమ్మకం జరిగింది. రికార్డు స్థాయిలో పెరిగిన ఉల్లి ధరలతో.. ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు బజారుల్లో కిలో ఉల్లిపాయలను రూ. 25కే అందిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment