పేదలకందని రాయితీ ఉల్లి
- ఇబ్బంది పడుతున్న జనం
- గ్రామాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతి
రామాయంపేట: అమాంతం పెరిగిపోతున్న ఉల్లి ధరతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న వారికి రాయితీపై ఉల్లి సరఫరా చేస్తోంది. అయితే పేదలు ఎక్కువగా ఉండే పల్లెలపై దృష్టి పెట్టడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. రోజు రోజుకూ పెరిగిపోతున్న ఉల్లి ధరను నియంత్రించడంలో ప్రభుత్వాలు, అధికారులు విఫలమవుతున్నారని జనం మండిపడుతున్నారు. పట్టణ ప్రజలకు మాత్రమే రాయితీపై ఉల్లి విక్రయించడం సరికాదని పల్లె ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ. 50 నుంచి రూ. 60 వరకు పలుకుతోంది. చిన్న రకం అయితే ఈ ధర.
వ్యాపారం తగ్గింది
ఉల్లి ధర ఆకాశాన్ని అం టుతుండడంతో వ్యాపా రం పూర్తిగా పడిపోయిం ది. చాలా మంది ఉల్లి కొనడమే మానేశారు. ఐ దారు కిలోలు కొనుగోలు చేసే వారు ప్రసు్తతం కిలోతో సరిపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే చ ర్యలు తీసుకొని ఉల్లి ధరలు త గ్గించాలి.
- సంతోష్, వ్యాపారి, రామాయంపేట
రాయితీ ప్రకటనలకే పరిమితం
రాయితీపై ఉల్లి సరాఫరా చేస్తామన్న ప్రభుత్వ హామీ ప్రకటనలకే పరిమితమైంది. పట్టణ ప్రజలకు మాత్రమే రాయితీ సదుపాయం కల్పిం చారు. గ్రామీణ ప్రాంత ప్రజలను మరి చారు. ఈ విధానం సరికాదు. గ్రామాల్లో కూడా ఉల్లి కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
- బాలమణి, లక్ష్మాపూర్
గ్రామాల్లో ఉల్లి కేంద్రాలు ఏర్పాటు చేయాలి
ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి కొనాలంటే భయమేస్తోంది. కిలో రూ. 60 ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రాయితీ సదుపా యం పట్టణాలకే పరిమితమైంది. గ్రామీణ ప్రజలను పట్టించుకోకపోవడం దారుణం. వెంటనే గ్రామాల్లో కూడా ఉల్లి కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
- గుర్రాల నాగులు, తిప్పనగుల్ల