
సాక్షి, హైదరాబాద్: ఉల్లిగడ్డ ధరలు దిగొస్తున్నాయి. రోజురోజుకు రేట్లు తగ్గుతున్నాయి. గత పదిహేను రోజులతో పోలిస్తే ధరలు సగానికి పడిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి భారీ మొత్తంలో మలక్‌పేట్ మార్కెట్‌కు దిగుమతి అవుతోంది. అక్కడ అధిక పంట దిగుబడి, నిల్వ చేసిన సరుకును మన రాష్ట్రానికి తరలిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉల్లి క్వింటాల్‌కు రూ.600 నుంచి 700 వరకు మాత్రమే పలుకుతోంది. మార్కెట్‌లో కిలో ధర రూ.10 నుంచి 15 వరకు పలుకుతోంది.
పెరిగిన దిగుమతి..
హైదరాబాద్‌లోని మలక్‌పేట గంజ్ మార్కెట్ ఉల్లిగడ్డకు పేరు గాంచింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచే ఉల్లి సరఫరా అవుతుంది. ప్రధానంగా మహబూబ్ నగర్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలోని కర్నూల్ ప్రాంతాల నుంచి గంజ్ కు ఎక్కువగా సరుకు వస్తుంది. వారం రోజులుగా మార్కెట్‌కు నిత్యం 70 నుంచి 120 ట్రక్కుల్లో 30 వేల బస్తాల వరకు సరుకు దిగుమతి అవుతోంది
Comments
Please login to add a commentAdd a comment