Onion price control
-
Hyderabad: సగానికి పడిపోయిన ఉల్లి ధరలు.. కిలో రూ. 10
సాక్షి, హైదరాబాద్: ఉల్లిగడ్డ ధరలు దిగొస్తున్నాయి. రోజురోజుకు రేట్లు తగ్గుతున్నాయి. గత పదిహేను రోజులతో పోలిస్తే ధరలు సగానికి పడిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి భారీ మొత్తంలో మలక్‌పేట్ మార్కెట్‌కు దిగుమతి అవుతోంది. అక్కడ అధిక పంట దిగుబడి, నిల్వ చేసిన సరుకును మన రాష్ట్రానికి తరలిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉల్లి క్వింటాల్‌కు రూ.600 నుంచి 700 వరకు మాత్రమే పలుకుతోంది. మార్కెట్లో కిలో ధర రూ.10 నుంచి 15 వరకు పలుకుతోంది. పెరిగిన దిగుమతి.. హైదరాబాద్‌లోని మలక్‌పేట గంజ్ మార్కెట్ ఉల్లిగడ్డకు పేరు గాంచింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచే ఉల్లి సరఫరా అవుతుంది. ప్రధానంగా మహబూబ్ నగర్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలోని కర్నూల్ ప్రాంతాల నుంచి గంజ్ కు ఎక్కువగా సరుకు వస్తుంది. వారం రోజులుగా మార్కెట్‌కు నిత్యం 70 నుంచి 120 ట్రక్కుల్లో 30 వేల బస్తాల వరకు సరుకు దిగుమతి అవుతోంది -
ఉల్లి షాక్ నుంచి ఉపశమనం..
సాక్షి, న్యూఢిల్లీ : భగ్గుమంటున్న ఉల్లి ధరలతో సామాన్యుడు బెంబేలెత్తుతుంటే వీటి ధరలు క్రమంగా దిగివస్తాయనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. ఉల్లి సరఫరాలు మెరుగవడంతో పాటు ఆప్ఘనిస్తాన్, టర్కీల నుంచి దిగుమతవుతున్న ఉల్లితో ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ హోల్‌సేల్ మార్కెట్లో గత వారం కిలో ఉల్లి రూ 65 నుంచి 80 వరకూ పలుకగా, ఈ వారం రూ 50-75కే పరిమితమైంది. రాజధానిలోని దేశంలోనే అతిపెద్దదైన కూరగాయల మార్కెట్ ఆజాద్‌పూర్ మండీకి దేశీ ఉల్లితో పాటు 200 టన్నుల దిగుమతులు చేరుకోవడంతో ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. గత రెండు రోజులుగా 80 ట్రక్కుల ఉల్లి ఆప్ఘనిస్తాన్, టర్కీల నుంచి చేరుకుందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. పంజాబ్‌లో పెద్ద ఎత్తున ఆప్ఘన్ ఉల్లిని సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక పలు నగరాలు, పట్టణాల్లోనూ ఉల్లి ధరలు స్వల్పంగా తగ్గడంతో ఉల్లి ఘాటు నుంచి త్వరలోనే ఉపశమనం కలుగుతుందన్న అంచనాలు వెల్లడవుతున్నాయి. -
ఉల్లి ధర ఆల్‌టైం రికార్డ్!
రిటైల్ ధర రూ.60, హోల్‌సేల్‌లో రూ.48 సాక్షి, హైదరాబాద్: ఉల్లిగడ్డ ధర ఆకాశాన్నంటుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్లో రూ. 60 కు ఎగబాకింది. గతంతో పోలిస్తే దీనిని ఆల్ టైం రికార్డుగా పేర్కోవచ్చు. ఉల్లి ధర నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలించడం లేదు. డిమాండ్‌కు తగినట్లుగా ఉల్లి సరఫరా లేకపోవటమే ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. శుక్రవారం నగరానికి 9,794 క్వింటాళ్ల ఉల్లిగడ్డ దిగుమతయ్యింది. గతంలో కర్ణాటక, మహారాష్ట్ర, కర్నూలు ప్రాంతాల నుంచి నగరానికి ప్రతిరోజూ 15 వేల నుంచి 16 వేల క్వింటాళ్ల వరకు ఉల్లి సరఫరా జరిగేది. అయితే ఆయా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో సరఫరా తగ్గిపోయింది. శుక్రవారం ఒక్క రోజే 7 వేల క్వింటాళ్ల ఉల్లి దిగుమతి నిలిచి పోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా దిగుమతైన 9,794 క్వింటాళ్ల సరుకులో గ్రేడ్ వన్ రకం 1,959 క్వింటాళ్లు కాగా, గ్రేడ్ టు రకం 7,835 క్వింటాళ్లు ఉంది. గ్రేడ్ వన్ ఉల్లి క్వింటాల్ ధర గరిష్ఠంగా రూ.5,800లు, కనిష్ఠ ధర రూ.4,500 పలుకగా, మోడల్ ధర రూ. 5,200 పలికింది. గ్రేడ్ టు ఉల్లి క్వింటాల్ ధర గరిష్ఠంగా 4,800, కనిష్ఠ ధర రూ. 3,000, మోడల్ ధర రూ. 4,500 పలికింది. రిటైల్ మార్కెట్లో కిలో ధర రూ. 60 లకు విక్రయిస్తుండగా, హోల్‌సేల్‌గా రూ.48 చొప్పున విక్రయిస్తున్నారు.