భారతదేశంలో ఇప్పటికే మంచి అమ్మకాతో ముందుకు సాగుతున్న ఫ్రెంచ్ బ్రాండ్ కారు 'సిట్రోయెన్ సి3' ధరలు తాజాగా మళ్ళీ పెరిగాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ లైవ్, ఫీల్ అనే రెండు వేరియంట్లలో మార్కెట్లో విడుదలైంది. ప్రారంభంలో వీటి ధరలు రూ. 5.71 లక్షల నుండి రూ. 8.05 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండేవి. కాగా ఇప్పుడు వీటి ధరలు రూ. 45,000 వరకు పెరిగాయి.
ధరల పెరుగుదల తరువాత సి3 రూ. 6.16 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. 2023 ప్రారంభంలో కూడా దీని ధరలు పెరిగాయి. మార్కెట్లో మొదటి నుంచి గొప్ప అమ్మకాలు పొందుతున్న ఈ హ్యాచ్‌బ్యాక్ నాలుగు మోనోటోన్, ఆరు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది.
సిట్రోయెన్ సి3 మంచి డిజైన్ పొందుతుంది. ముందు భాగంలోని బంపర్‌లపై కలర్-కోడెడ్ ఇన్‌సర్ట్‌లు, గ్రిల్‌తో కలిసే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, హెక్సా గోనల్ ఎయిర్ డ్యామ్, X-షేప్ లో ఉండే ఫాక్స్ స్కఫ్ ప్లేట్, రూఫ్ రెయిల్స్, బాడీ క్లాడింగ్ ఉన్నాయి. ఇది 15 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది, వెనుక భాగంలో ర్యాపరౌండ్ టెయిల్-లైట్స్ చక్కగా అమర్చబడి ఉన్నాయి.
ఫీచర్స్ విషయానికి వస్తే, ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేసే 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, ఫోర్-స్పీకర్స్, యుఎస్బి ఛార్జింగ్ సాకేట్, మిర్రర్ స్క్రీన్ ఫంక్షన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇందులో ఉన్నాయి.
(ఇదీ చదవండి: రతన్ టాటా గురించి తెలుసు, 'మాయా టాటా' గురించి తెలుసా?)
సిట్రోయెన్ సి3 రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 81 బిహెచ్‌పి పవర్, 115 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 108 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment