![Ahead Of Sankranti Festival HYD TO AP Flight Charges Increased - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/11/air-port3.jpg.webp?itok=5_jwMRui)
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ నగరాలకు వెళ్లే విమాన ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో ప్రయాణ చార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణ సమయాల్లో హైద రాబాద్ నుంచి రాజమండ్రికి రూ. 3 వేల టికెట్ ధర ఉండగా ప్రస్తుతం రూ.8 వేల నుంచి గరి ష్టంగా రూ. 11 వేల చార్జీలను తీసుకుంటున్నా యి.
విశాఖపట్నం వెళ్లేందుకు విరివిగా విమానాలుండడంతో చార్జీలు కొంతమేరకు మాత్రమే పెరిగాయి. విజయవాడకు రద్దీ ఎక్కువగా ఉండటంతో సాధారణ సమయాలతో పోల్చితే వందశాతం అదనంగా టికెట్ ధరలు పెరిగాయి. సెలవులు కావడంతో తిరుపతి వెళ్లే ప్రయాణికు ల రద్దీ కూడా సాధారణ సమయాలతో పోల్చితే వందశాతం అధికంగా ఉండటంతో యాభైశా తానికి పైగా చార్జీలు పెరిగాయి. కర్నూలు, కడప నగరాలకు వెళ్లే విమానాలకు రద్దీ ఉండటంతో ఆ చార్జీలను కూడా పెంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment