నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సోమవారం నుంచి 5 శాతం టోల్ పెంపును ప్రకటించింది. 2024 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సిన కొత్త టోల్ చార్జీలు సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో కొత్త రేట్లు అమలులోకి వస్తాయి.
కొత్త టోల్ చార్జీలు ఈ రోజు నుంచే (జూన్ 3) అమల్లోకి వచ్చినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు పేర్కొన్నారు. కొత్త ధరలకు సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.
భారతదేశంలో మొత్తం సుమారు 855 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 675 పబ్లిక్ ఫండెడ్ కాగా, మిగిలిన 180 రాయితీదారుల నిర్వహిస్తున్నారు. నేషనల్ హైవే పే రూల్ 2008 ప్రకారం.. టోల్ ఫీజుల పెంపు జరిగిందని సంబంధింత అధికారులు చెబుతున్నారు.
NHAI డేటా ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో టోల్ వసూలు రూ. 50,000 కోట్లను దాటింది (నవంబర్ 2023 వరకు). టోల్ గేట్లు పెరగటం, ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుల సంఖ్య ఎక్కువ కావడంతో భారీ టోల్ వసూలు జరిగింది. ఇప్పుడు టోల్ చార్జీలు 5 శాతం పెరగడంతో టోల్ వసూలు మరింత పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment