సాక్షి,ముంబై: దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి మరోసారి తన వినియోగదారులకు షాకిచ్చింది. మారుతి అన్ని మోడల్ కార్ల ధరలను ఏప్రిల్ నుంచి పెంచేందుకు నిర్ణయించింది. ఈమేరకు కంపెనీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చదవండి: సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు)
ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వ్యయాలే కారణమని గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకి వ్యయాలను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, వివిధ అంశాల ప్రభావాన్ని భర్తీ చేయడానికి ధరల పెంపు తప్పడం లేదని తెలిపింది. ఏప్రిల్ 2023 నుండి ధరలను పెంచుతున్నట్టు ప్రకటించిన కంపెనీ, ఎంత శాతం పెంచేదీ స్పష్టం చేయలేదు. మోడల్‌ను బట్టి ఈ పెంపు ఉంటుందని తెలుస్తోంది.
హురున్ రిచ్ లిస్ట్ 2023: రేఖా ఝున్‌ఝున్‌వాలా ఎంట్రీ! సూపర్!
Comments
Please login to add a commentAdd a comment