దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'రాయల్ ఎన్‌ఫీల్డ్' (Royal Enfield) ఇప్పటికే తన 'సూపర్ మీటియోర్ 650' బైకుని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఈ బైక్ ధరలను ఇప్పుడు ఒక్క సారిగా రూ. 5000 వరకు పెంచింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కంపెనీ ఈ సూపర్ మీటియోర్ 650 ధరలను పెంచిన తరువాత ఈ బైక్ ప్రారంభ ధర రూ. 3.54 లక్షలు. ఇది ఆస్ట్రల్, ఇంటర్స్టెల్లార్, సెలెస్టియన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు కూడా రూ. 5వేలు పెరిగాయి. కావున ఈ బైక్స్ కొనాలనుకునే కస్టమర్లు కొత్త ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
బేస్ వేరియంట్ అయిన ఆస్ట్రల్ మూడు సింగిల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి బ్లాక్, బ్లూ అండ్ గ్రీన్ కలర్స్. ఇక మిడ్ స్పెక్ వేరియంట్ ఇంటర్స్టెల్లార్ రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. అవి గ్రే, గ్రీన్ అనే డ్యూయెల్ కలర్స్. డిజైన్ విషయానికి వస్తే మొదటి రెండు వేరియంట్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అయితే టాప్ వేరియంట్లో మాత్రం పెద్ద ఫ్రంట్ స్క్రీన్, టూరింగ్ సీట్, పిలియన్ బ్యాక్ రెస్ట్ వంటి అదనపు యాక్ససరీస్ లభిస్తాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 బైకులో 648 సిసి ప్యారలల్ ట్విన్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 47 bhp పవర్, 52.3 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కావున పనితీరుపరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.
(ఇదీ చదవండి: కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. నేరుగా సముద్రంలోకి - వీడియో)
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ట్రిప్పర్ నావిగేషన్, బ్లూ టూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉంటాయి. ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఈ బైక్ సీటు ఎత్తు భూమి నుంచి 650 మిమీ. 241 కేజీల బరువు కలిగిన ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15.7 లీటర్లు. కావున లాంగ్ రైడ్ చేయడానికి ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment