భారతదేశంలో పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా సిఎన్‌జి, ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తున్నారు. సీఎన్‌జీ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ మైలేజ్ పొందవచ్చు. సీఎన్‌జీ కార్ వినియోగదారుడు ఖర్చుని తగ్గించి డబ్బుని ఆదా చేయడానికి ఈ కింది చిట్కాలను పాటించాలి.
నీడలో పార్క్ చేయడం:
ఎండలు రోజురోజుకి అధికమవుతున్నాయి, ఇలాంటి సమయంలో మీ కారుని తప్పకుండా నీడలో పార్క్ చేయాలి. సీఎన్‌జీ కారుని ఎండలో పార్క్ చేసినప్పుడు వేడి తీవ్రతకు కొంత సీఎన్‌జీ గ్యాస్ ఆవిరయ్యే అవకాశం ఉంటుంది. సీఎన్‌జీ ఆదా చేయడానికి తప్పకుండా ఈ నియమం పాటించాలి.
ఓవర్‌ఫిల్ చేయడం మానుకోవాలి:
కేవలం పెట్రోల్ కార్లలో మాత్రమే కాకుండా సిఎన్‌జి కార్లలో కూడా ఓవర్‌ఫిల్ చేయడం మంచిది కాదు. సీఎన్‌జీ కారుని ఉపయోగించేటప్పుడు ట్యాంక్‌లో అదనపు సీఎన్‌జీ విడుదలవుతుంది. ఆ సమయంలో ఓవర్‌ఫిల్ కారణంగా కొంత నష్టం జరుగుతుంది.
ఎయిర్ ఫిల్టర్ మార్చుకోవాలి:
కారులో ఎయిర్ ఫిల్టర్ ప్రాధాన్యత ఎలా ఉంటుందో వినియోగదారులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కావున ఎప్పటికప్పుడు ఎయిర్ ఫిల్టర్స్ తనిఖీ చేస్తూ క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలి. ఇది ఇంజిన్ జీవిత కాలాన్ని పెంచుతుంది.
(ఇదీ చదవండి: Apple watch: బ్లడ్ గ్లూకోజ్ ట్రాకింగ్ ఇప్పుడు చాలా సింపుల్.. ఎలా?)
టైర్ ప్రెజర్ చెక్ చేస్తూ ఉండండి:
కారులో టైర్ ప్రెజర్ ఉండవల్సిన దాని కంటే తక్కువ వుంటే ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. కనీసం వారంలో ఒక సారైనా తప్పకుండా టైర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి. సరైన టైర్ ప్రెజర్ ఇంధనం ఆదా చేయడమే కాదు, టైర్ జీవిత కాలాన్ని కూడా పెంచుతుంది.
సీఎన్‌జీ లీకేజీ లేకుండా చూసుకోవాలి:
కారులో సీఎన్‌జీ లీకేజి కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సీఎన్‌జీ కారు ధరలు భారీగా ఉండటం వల్ల వినియోగదారుడు లీకేజీల గురించి తప్పకుండా తనిఖీ చేయాలి. అలాంటి సీఎన్‌జీ లీకేజి ఉన్నప్పుడు సమీపంలో ఉన్న మెకానిక్‌లకు వద్ద కాకుండా.. ప్రొఫెషనల్స్ ద్వారా టెస్ట్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment