సాధారణంగా పెట్రోల్, డీజల్ ధరలే ప్రజలకు షాకిస్తుంటాయి. కానీ ఇప్పుడు సీఎన్‌జీ ధరలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి. కేజీ సీఎన్‌జీ ధర ఉన్నట్టుండి.. ఏకంగా రెండు రూపాయల పెరిగింది.
ముంబైతో పాటు నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో సీఎన్‌జీ ధరలు పెరిగాయి. అయితే ఢిల్లీలో సీఎన్‌జీ ధరలు పెరగలేదని సమాచారం. దీనికి కారణం దేశ రాజధానిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే అని తెలుస్తోంది. కాబట్టి ఢిల్లీలో కేజీ సీఎన్‌జీ ధర రూ. 75.09 వద్ద ఉంది.
ధరల పెరుగుదల తరువాత ముంబైలో కేజీ సీఎన్‌జీ 77 రూపాయలు దాటేసింది. నోయిడా, ఘజియాబాద్‌లలో కేజీ సీఎన్‌జీ ధరలు వరుసగా రూ. 81.70, రూ. 82.12గా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఢిల్లీతో పోలిస్తే.. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో సీఎన్‌జీ రేటు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
ఎన్నికలు ముగియడంతో.. ముంబైలోని సిటీ గ్యాస్ రిటైలర్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) ముంబై, పరిసర ప్రాంతాల్లో సీఎన్‌జీ ధరలను కిలోపై రూ. 2 చొప్పున పెంచినట్లు వెల్లడించింది. గత రెండు నెలలుగా ధరలను పెంచని అదానీ టోటన్ గ్యాస్ కూడా సీఎన్‌జీ రేటును పెంచింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ ధర రూ. 96వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే దేశం మొత్తం మీద హైదరాబాద్‌లోనే సీఎన్‌జీ రేటు చాలా ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment