
సాక్షి, న్యూఢిల్లీ : మటన్,న ఫిష్ వ్యర్ధాలతో సీఎన్జీ తయారుచేసి బస్సులు, వాహనాలను నడిపించవచ్చని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. శిలాజ ఇంధనాల స్ధానంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగానికి ప్రభుత్వం కట్టుబడిఉందని ఆయన పునరుద్ఘాటించారు. పంట వ్యర్దాలను తగులబెట్టకుండా సీఎన్జీ తయారీకి ఉపయోగించే ప్రకియ లుధియానాలో ప్రారంభమైందని, ఇక మటన్, చేపలు, పండ్లు, కూరగాయల వ్యర్ధాలను బయో ఇంధనంగా మార్చే ప్రక్రియను మరో రెండు నెలల్లో మహారాష్ట్రలో ప్రారంభిస్తామని చెప్పారు. మెథనాల్, కార్బన్ డయాక్సైడ్‌ను విడతీయడం ద్వారా లభ్యమయ్యే సీఎన్జీతో బస్సులు, వాహనాలను నడిపించవచ్చని తెలిపారు. పంట వ్యర్ధాలను సీఎన్జీగా మార్చే లుథియానా ప్లాంట్‌కు చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తుందని చెప్పారు. వస్తువులు, ఉత్పత్తులకు ఐఎస్‌ఐ మార్క్ ఇచ్చే ప్రక్రియలో త్వరలో మార్పులు చేపడతామని వెల్లడించారు. నిర్ధిష్ట పరిమితికి మించి విద్యుత్‌ను వినియోగించే పరికరాలకు ఐఎస్‌ఐ మార్క్ కేటాయించరని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment