ఆప్ ఆమోదంతోనే పెరిగాయి : బీజేపీ
Published Sat, Dec 28 2013 1:00 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సీఎన్జీ ధరల పెంపులో ఆప్ హస్తం కూడా ఉందని బీజేపీ ఆరోపించింది. వీలైనంత త్వరగా పెంపును వెనక్కి తీసుకోకుంటే భారీ ఉద్యమం చేపడుతామని హెచ్చరించింది. ‘కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం అనుమతి తీసుకోకుండానే అధికారులు సీఎన్జీ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారని నమ్మకం కష్టం. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించకముందే సీఎన్జీ ధరల ఉపసంహరణపై ప్రకటన చేయాలి. లేకపోతే మా పార్టీ భారీ ఆందోళనకు దిగుతుంది’ అని విధానసభ పక్ష నాయకుడు డాక్టర్ హర్షవర్ధన్ హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేలతో శుక్రవారం విధానసభలో భేటీ అయిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. సీఎన్జీ ధరల పెంపు వల్ల సామాన్యులపై తీవ్రభారం పడుతుందని, ద్రవ్యోల్బణమూ పెరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న దిల్లీవాలాలకు ఈ భారాన్ని తట్టుకునే శక్తి లేదని హర్షవర్ధన్ అన్నారు.
Advertisement
Advertisement