బీజేపీకి ఓటేయండి.. డెంగ్యూ తెచ్చుకోండి: కేజ్రీవాల్
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ దిగజారుతోంది. ఈరోజు బీజేపీకి ఓటేసి.. రేపు డెంగ్యూ, చికన్ గున్యా లాంటి వ్యాధులు వస్తే దానికి మీరే బాధ్యులు అవుతారని ఓటర్లను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. ఢిల్లీ వరకు బీజేపీ 'డెంగ్యూ, చికన్ గున్యా పార్టీ' అని ఆయన అభివర్ణించారు. ఎంసీడీ ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్ల పాటు ఢిల్లీని ఆ పార్టీ మురికిగా ఉంచేస్తుందని అన్నారు. మూడు మునిసిపల్ కార్పొరేషన్లలో ప్రధాని మోదీ పేరును చూపించి అవినీతిని దాచేయడానికి బీజేపీ ప్రయత్నించిందని, ఈ వ్యూహం ఇక్కడ మాత్రం పనిచేయదని చెప్పారు. ఎంసీడీలో పరిస్థితిని మోదీ ఎలా బాగుచేస్తారని.. కార్పొరేషన్‌లో పనిని మోదీ తీసుకోడానికి వీలుండదని, విజేందర్ గుప్తా లాంటి స్థానిక నాయకులే పనిచేయాలని కేజ్రీవాల్ అన్నారు. పదేళ్ల పాలనలో కార్పొరేషన్‌ను బీజేపీ పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు.
దేశ రాజధానిలో ఆరోగ్య సమస్యలన్నింటికీ బీజేపీయే కారణమని ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి అన్నారు. ప్రధానమంత్రి అంతర్జాతీయ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారని, కానీ బీజేపీ మాత్రం ఆయన పేరు చెప్పి ఓట్లు అడుగుతోందని విమర్శించారు.
కేజ్రీవాల్ ఇతరుల మీద బురద చల్లుతూ కాలం గడిపేస్తున్నారని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్ అన్నారు. ఆయన తన పని చేయడం మానేసి.. అందరినీ ఏదో ఒకటి అంటున్నారని, అసలు ఈ మూడేళ్లలో ఆయన ఢిల్లీకి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. మొత్తం 272 వార్డులున్న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌కు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి.
BJP को वोट दिया तो अगले 5साल कूडा,मछर ऐसे ही रहेंगे।कल अगर आपके घर डेंगू हो जाए तो आप ख़ुद उसके ज़िम्मेदार होगे क्योंकि आपने BJP को वोट दिया
— Arvind Kejriwal (@ArvindKejriwal) 21 April 2017
दिल्ली वालों के लिए भाजपा "डेंगू और चिकनगुनीया वाली पार्टी" है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) 21 April 2017