delhi municipal elections
-
ఆప్ చేతిలో ఓటమి.. ఢిల్లీ బీజేపీ చీఫ్ అదేశ్ గుప్తా రాజీనామా
న్యూఢిల్లీ: ఇటీవలే జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ పరాజయం పాలైంది. 15 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో బీజేపీ పరాజయంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఢిల్లీ బీజేపీ చీఫ్ అదేశ్ గుప్తా. ఓటమికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. అదేశ్ గుప్తా రాజీనామాకు బీజేపీ అధిష్ఠానం ఆమోదం తెలిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ఉపాధ్యాక్షుడిగా ఉన్న వీరేంద్ర సచ్‌దేవను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది పార్టీ. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతారని తెలిపింది. బీజేపీ ఢిల్లీ యూనిట్ చీఫ్‌గా 2020 జూన్‌లో నియామకమయ్యారు అదేశ్ గుప్తా. ఎంసీడీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచన మేరకే అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆప్ ఘన విజయం.. హస్తినలో 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించుతూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో మెజారిటీకి 126 సీట్లు కావాల్సి ఉండగా.. కేజ్రీవాల్ పార్టీకి 134 స్థానాలు వచ్చాయి. బీజేపీ 104 సీట్లతో ఆగిపోయింది. మెజారిటీ సాధించకపోయినప్పటికీ మేయర్ ఎన్నికకు బీజేపీ పోటీ పడతుందని వాదనలు వినిపించాయి. అయితే ఆ వాదనలను గత శుక్రవారం కొట్టి పారేశారు అదేశ్ గుప్తా. మేయర్ పదవి ఆప్ చేపడుతుందని, బీజేపీ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఢిల్లీపై ఆప్ జెండా -
ప్రధాని మోదీ ఆశీస్సులు కావాలి.. ఢిల్లీ విజయంపై అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు, కేంద్రం సహకారం అవసరమని రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన అనంతరం కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అభివృద్ధి కోసం పనిచేయడానికి బీజేపీ, కాంగ్రెస్ సహకారాన్ని కోరుకుంటున్నామని తెలిపారు. ఈమేరకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి గొప్ప విజయాన్ని అందించినందుకు ఢిల్లీ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎంసీడీలో ఆప్ విజయం రాజధానిలో తొలిసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని అందించిందన్నారు. మనమందరం కలిసి ఢిల్లీ నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ఎంసీడీని అవినీతి రహితంగా మార్చేందుకు అన్ని పార్టీలు, అభ్యర్థులు కలిసి పనిచేయాలని సూచించారు. చదవండి: కాంగ్రెస్ నాయకత్వంలో విపక్షాల భేటీకి హాజరై షాకిచ్చిన ఆ రెండు పార్టీలు మరోవైపు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయంపై ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీపై విశ్వాసం చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదని.. పెద్ద బాద్యత అని వ్యాఖ్యానించారు. ప్రజలతో తీర్పుతో అతిపెద్ద పార్టీని ఓడించగలిగామని అన్నారు. కాగా బుధవారం వెల్లడైన మున్సిపల్ ఫలితాల్లో ఆప్ విజయ దుందుభి మోగించింది. మొత్తం 250 వార్డులు ఉండగా మెజార్జీ మార్క్(126)ను దాటి 134 స్థానాలను కైవసం చేసుకుంది. ఆప్ విజయంతో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో 15 ఏళ్ల బీజేపీ పాలనకు ఆమ్ ఆద్మీ పార్టీ గండికొట్టింది. దీంతో ఢిల్లీ మేయర్ పదవి ఆప్ వశమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 104 వార్డుల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ కేవలం 9 స్థానలకే పరిమితమైంది. మరో మూడు చోట్ల ఇతరులు విజయం సాధించారు. చదవండి: గుజరాత్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు ఇక ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల వద్ద ఆప్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పూలు చల్లుతూ, స్వీట్లు పంచుకుంటూ ఆనందంతో డ్యాన్స్‌లు చేశారు. -
ఢిల్లీ కార్పొరేషన్ ఎగ్జిట్ పోల్ 2022
-
Delhi Exit Poll 2022: టాప్‌లో ఆప్.. బీజేపీ మెరుగైన ప్రదర్శన.. మరి కాంగ్రెస్?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)కు ఆదివారం జరిగిన ఎన్నికల్లో 50 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు 7న జరగనుంది. 1,349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 1.45 కోట్ల మంది. 2017 ఎన్నికల్లో 53% పోలింగ్ నమోదైంది. ఈక్రమంలో గెలుపు తమదంటే తమదేనని ఆప్, బీజేపీ అంటున్నాయి. అయితే, ఎంసీడీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే మొగ్గు చూపాయి. బీజేపీ రెండు, కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాయి. మరోవైపు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు చేదు ఫలితాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో రెండు రాష్ట్రాల్లోనూ ఆప్ మూడో స్థానానికే పరిమితమైంది. గుజరాత్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత కనబర్చగా.. హిమాచల్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. (చదవండి: ప్రధాని రాష్ట్రంలో విరబూసిన కమలం, ఆప్ పరిస్థితేంటి?) మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆప్కే మొగ్గు చూపుతున్నట్లు ఎగ్జిట్‌పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఎగ్జిట్‌పోల్ సర్వే ప్రకారం.. ఆక్సిస్ మై ఇండియా ఆప్: 149-171 బీజేపీ 69-91 కాంగ్రెస్ 3-7 టైమ్స్ నౌ-ఈటీజీ ఆప్: 146-156 బీజేపీ: 84-94 కాంగ్రెస్: 6-10 న్యూస్ ఎక్స్-జన్‌కి బాత్: బీజేపీ: 70-92 ఆప్: 159-175 కాంగ్రెస్: 3-7 (చదవండి: హిమాచల్‌లో పుంజుకున్న కాంగ్రెస్.. రెండో స్థానంలో ఎవరంటే!) -
Times Now Sumit 2022: ఉమ్మడి పౌరస్మృతికి కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) తీసుకొచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. అయితే, అన్ని రకాల ప్రజాస్వామిర ప్రక్రియలను అనురించడంతోపాటు సంప్రదింపుల తర్వాతే తీసుకొస్తామని తేల్చిచెప్పారు. ఆయన గురువారం ఢిల్లీలో ‘టైమ్స్ నౌ’ సదస్సులో ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ) ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కులతత్వం, వారసత్వం, బుజ్జగింపు వంటి జాడ్యాల నుంచి దేశ రాజకీయాలకు విముక్తి కలిగించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. కేవలం పుట్టుక, కులం, ఇతరులను బుజ్జగించే తత్వం ఆధారంగా ఎన్నికల్లో నెగ్గే రోజులు పోయాయని స్పష్టం చేశారు. మతం ఆధారంగా చట్టాలా? బీజేపీ భారతీయ జనసంఘ్‌గా ఉన్నప్పటి నుంచే ఉమ్మడి పౌరస్మృతిపై దేశ ప్రజలకు హామీ ఇచ్చిందని అమిత్ షా గుర్తుచేశారు. బీజేపీ మాత్రమే కాదు రాజ్యాంగ సభ కూడా సరైన సమయంలో యూసీసీని తీసుకురావాలని పార్లమెంట్‌కు, రాష్ట్రాలకు సూచించిందని వెల్లడించారు. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు అనేవి మతం ఆధారంగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ లేదా రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదించిన ఒకే ఒక ఉమ్మడి చట్టం ఉండాలని చాలామంది కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో బీజేపీ తప్ప ఇతర పార్టీలేవీ ఉమ్మడి పౌరస్మృతి పట్ల అనుకూలంగా లేవని అమిత్ షా పేర్కొన్నారు. దానిపై కనీసం మాట్లాడడం లేదన్నారు. మాట్లాడే ధైర్యం లేకపోతే వ్యతిరేకించవద్దని హితవు పలికారు. ‘మీరు అమలు చేస్తే మేము మీ వెంటనే ఉంటాం’ అని కూడా ప్రతిపక్షాలు చెప్పడం లేదని ఆక్షేపించారు. ఉమ్మడి పౌరస్మృతిపై ఆరోగ్యకరమైన, బహిరంగ చర్చ జరగాలని ఆయన అన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అంటే.. ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) గురించి భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ప్రస్తావించారు. ఈ పౌరస్మృతిపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాల శాసన సభలకు కూడా ఉంది. ప్రస్తుతం గోవాలో యూసీసీ అమలవుతోంది. యూసీసీకి మరో అర్థం.. ఒకే దేశం, ఒకే చట్టం. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలు, వ్యక్తిగత నమ్మకాలు, విశ్వాసాలతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ సమానంగా వర్తించే ఒకే చట్టమే ఉమ్మడి పౌరస్మృతి. భారత్‌లో వేర్వేరు మతస్తులకు, జాతులకు వారి మతగ్రంథాలు, అందులోని బోధనల ఆధారంగా వేర్వేరు వ్యక్తిగత(పర్సనల్) చట్టాలు అమల్లో ఉన్నాయి. ఉదాహరణకు ఓ వర్గం పురుషులు ఒక్కరి కంటే ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకోవచ్చు. అందుకు వారి ‘పర్సనల్ లా’ అనుమతిస్తుంది. మరో మతంలో అలాంటి వివాహాలకు అనుమతి లేదు. ఉమ్మడి పౌరస్మృతిపై దేశంలో కొన్ని దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ప్రధానంగా వామపక్షాలు, ఇస్లామిక్ సంస్థలు, కొన్ని జాతులు, తెగలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
వైరల్ వీడియో: ఆప్ ఎమ్మెల్యేను దారుణంగా కొట్టిన సొంత పార్టీ కార్యకర్తలు
-
Video: ఆప్ ఎమ్మెల్యేపై సొంత పార్టీ కార్యకర్తల దాడి.. ఎందుకంటే!
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాజకీయ వేడి రాజేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. డిసెంబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. పోటీలో మహిళల అభ్యర్థులే అధికంగా ఉన్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రత్యర్ధులపై విమర్శలు ఎక్కుపెడుతూ ఎవరికి వారే ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాగా మున్సిపోల్స్ ఎన్నికల వేళ ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌పై సొంత పార్టీ కార్యకర్తలే దాడి చేయడం కలకలం రేపుతోంది. మటియాలా ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌ను జనాలు తీవ్రంగా కొట్టారు. ఎమ్మెల్యే యాదవ్ సోమవారం శ్యామ్ విహార్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ విషయంలో వాగ్వాదం చెలరేగడంతో యాదవ్ పట్ల కొంతమంది ఆప్ కార్యకర్తలు ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. చదవండి: తిహార్ జైలులో ఆప్ మంత్రి మసాజ్ వీడియోలో ట్విస్ట్.. అతను ఫిజియో థెరపిస్ట్ కాదు.. రేపిస్ట్.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇందులో ఆప్ కార్యకర్తలు గులాబ్ సింగ్ యాదవ్‌ను కాలర్‌తో పట్టుకోవడం, చేతులతో దాడి చేయడం కనిపిస్తుంది. చివరకు తన సొంత పార్టీ కార్యకర్తల ఆగ్రహం నుంచి తనను తాను రక్షించుకోవడానికి పరుగులు తీయడం స్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేపై దాడి ఘటనపై ఇప్పటి వరకు ఆప్ స్పందించలేదు. అయితే ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నందుకు సొంత పార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యేలను కొట్టినట్లు బీజేపీ ప్రచారం చేస్తోంది. ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తన అవినీతి ఎమ్మెల్యేలందరికీ ఇక్కొక్కరిగా ఇదే జరుగుతుందని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే గులాబ్ సింగ్ కొట్టిపారేశారు. టికెట్లు అమ్ముకున్నారంటూ బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తుందన్నారు. తనపై దాడి చేసింది బీజేపీ కార్యకర్తలేనని ఆరోపించారు. తాను చావ్లా పోలీస్ స్టేషన్లో ఉండగా.. ఆ వార్డుకు చెందిన బీజేపీ కార్పొరేటర్, వారి అభ్యర్థిని పీఎస్‌లో చూసినట్లు తెలిపారు. भाजपा उम्मीदवार थाने के अंदर आरोपियों की पैरवी कर रहा है भाजपा बुरी तरह नगर निगम चुनाव हार रहीं है जितनी मर्जी साजिश कर ले। https://t.co/q2minYuvHq pic.twitter.com/rPY2EDxikC — Gulab Singh yadav (@GulabMatiala) November 21, 2022 -
అవును.. పొరపాట్లు చేశాం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కొన్ని పొరపాట్లు చేసిందని ఢిల్లీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒప్పుకున్నారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి స్పందించిన సీఎం.. కొన్ని పొరపాట్లు జరిగాయని, వాటిని పరిశీలించుకుని సరిదిద్దుకుంటామని శనివారం ట్వీటర్లో పేర్కొన్నారు. ‘రెండ్రోజులుగా పార్టీ వలంటీర్లు, ఓటర్లతో మాట్లాడా. పరిస్థితి తెలుస్తోంది. అవును.. మేం పొరపాట్లు చేశాం. వాటిని సరిదిద్దుకుంటాం. చేతల్లో చూపించాల్సిన సమయం ఇది. ఓటర్లకు, కార్యకర్తలకు రుణపడి ఉన్నాం’ అని సీఎం పేర్కొన్నారు. ఢిల్లీ మహానగరంలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 270 సీట్లకుగాను బీజేపీ 181, ఆప్ 48, కాంగ్రెస్ 30 సీట్ల గెలుపొందిన విషయం తెలిసిందే. -
‘ఆప్’ చాప చుట్టేయాల్సిందేనా?
న్యూఢిల్లీ: కొన్ని సార్లు విజయం కంటే అపజయమే బలమైనది. మొన్న పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురైనది, నిన్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో చవిచూసిన పరాజయం అలాంటిదే. నెపాన్ని ముందుగా ఓటింగ్ యంత్రాలపైకి తోసేసిన ఆప్ వ్యవస్థాపక నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చివరకైనా ఓటమిని అంగీకరించడం ఆనందించాల్సిన అంశం. పార్టీ ఆవిర్భావం అవసరమైన చారిత్రక సందర్భాలను, పార్టీ ప్రాథమిక లక్ష్యాలను పక్కన పెట్టి, వేగంగా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలన్న తాపత్రయంతో ఆప్ రాజకీయ మైదానంలో మెల్లగా, సుదీర్ఘంగా ఆడాల్సిన ఇన్నింగ్స్‌ను అతివేగంగా ఆడి అతి త్వరగా మైదానం నుంచి నిష్క్రమించడం నిజమే. ఆప్ బుడగలా వచ్చి బుడగలా పగిలిపోయిందని, ఇక ఆప్ కోలుకోవడం సాధ్యమయ్యే పని కాదంటూ నేడు ఇంటా, బయటా చర్చ జరుగుతోంది. ఆప్ చాప చుట్టేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పడానికి ఆ పార్టీ కొంత మంది వ్యక్తులు, కొంత మంది నాయకుల కారణంగా ఆవిర్భవించిందీ కాదు. జయ ప్రకాష్ నారాయణ్ సృష్టించిన ఉద్యమం తర్వాత అలాంటి మరో ఉద్యమం కోసం ప్రజలు సుదీర్ఘంగా నిరీక్షిస్తున్న సమయంలో వచ్చిన ఓ కదలిక. లక్షలాది ప్రజల మనసుల్లో పురుడుపోసుకుంటున్న కొత్త ఆలోచనను ముందుకు తీసుకెళతావన్న నమ్మకం నుంచి పుట్టిందే ఆప్. ప్రత్యక్షంగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాస్వామ్యానికి నిజంగా పట్టం కడుతుందని, అవినీతి రహిత పారదర్శక ప్రభుత్వాన్ని అందిస్తుందన్న ప్రజల ఆశే ఆప్. భారత రాజకీయ చరిత్ర గమనాన్ని మారుస్తుందన్న ప్రగాఢ విశ్వాసంతోనే ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టారు ప్రజలు. అలాంటి ప్రజల నమ్మకాలను, ఆశలను నిలబెట్టేందుకు నిజాయితీగా కృషి చేయకపోవడం వల్ల కూడా నేడు ఆప్‌కు అపజయం ఎదురై ఉండవచ్చు. కొత్తగా పుట్టిన ఈ పార్టీ పూర్తిగా రాజకీయ నడత నేర్చుకోకముందే చుట్టుముట్టిన పరిస్థితులను కూడా ఇక్కడ పరిశీలించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం పెడుతున్న కేసుల్లో చిక్కుకుంటూ ఊపిరాడని పరిస్థితుల్లో చుట్టూ ఉన్న మీడియా కూడా విష ప్రచారం చేస్తున్న ప్రతికూల పరిస్థితుల్లో నెట్టుకు రావడం ఆషామాషీ కాదు. అయినప్పటికీ ప్రజలకు అత్యవసరమైన నీరు, విద్యుత్, విద్య, వైద్యం అందించడంలో ఆప్ సాధించిన విజయం తక్కువేమి కాదు. వాస్తవం చెప్పాలంటే ఇలాంటి ప్రజా సమస్యలను పరిష్కరించినందుకు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్కే ప్రజలు పట్టం గట్టాలి. పదేళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని పాలిస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోని బీజేపీకే ప్రజలు పట్టం గట్టారు. ప్రపంచంలో డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ ఏలుతున్న నేటి కాలమాన పరిస్థితులు వేరు. ఈ పరిస్థితుల్లో వాస్తవాలకంటే భ్రమలనే ఎక్కువ నమ్ముతారు. నిజానికన్నా అబద్ధాలకే ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఆప్ చాప చుట్టేయాల్సిన సమయం ఆసన్నమైందనడం కూడా ఇలాంటి ఓ భ్రమే. ఇలాంటి పరిస్థితులను తట్టుకొని నిలబడినప్పుడే అపార శక్తి అంకురిస్తుంది. అందుకే విజయం కన్నా బలమైనది ఈ పరాజయం. పార్టీలో, ప్రభుత్వ పనితీరులో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ మళ్లీ అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ముందుకు సాగితే ‘ఆప్ అప్నా’ అంటూ ప్రజలు పిలిచే రోజులు కచ్చితంగా వస్తాయి. –––ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
ఇకనైనా ‘స్వచ్ఛ్' ఢిల్లీ అవుతుందా?
న్యూఢిల్లీ: ‘బాజ్పాకి ప్రచండ్ జీత్ పర్ ఢిల్లీ కో నమాన్’ అనే నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ నగర శాఖ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఫొటోలతో కూడిన పోస్టర్లు పండిట్ మార్గ్‌లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు వెలిశాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ బుధవారం ఫలితాలు వెలువడవక ముందే ఈ పోస్టర్లను తయారు చేయడంలో తలమున్కలైంది. అఖండ విజయాన్ని కట్టబెట్టిన ఢిల్లీకి శిరస్సు వంచి ప్రణిమిల్లుతున్నామన్నది పోస్టర్లలో హిందీలో ఉన్న నినాదానికి తెలుగులో సమానార్థం. శిరస్సు వంచి ప్రణమిల్లాల్సిన అవసరం లేదని, శిరస్సు ఎత్తి నగరంలో గుట్టలుగా పేరుకుపోతున్న పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని ఢిల్లీ ప్రజలు కోరుతున్నారు. ఢిల్లీలోని మూడు కార్పొరేషన్లను కలుపుకొని బీజేపీ అఖండ విజయం సాధించినప్పటికీ ఉత్తర, దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్లతో పోలిస్తే తూర్పు ఢిల్లీ కార్పొరేషన్లలోనే అతి తక్కువగా, అంటే 49 సీట్లు వచ్చాయి. ఈ కార్పొరేషన్‌ను పట్టి పీడిస్తున్న పరిశుద్ధ్య సమస్యయే ఇందుకు ప్రధాన కారణం. ఈ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు, ఉద్యోగులు తరచూ సమ్మె చేయడమే అందుకు కారణం. పదేళ్లుగా ఢిల్లీ కార్పొరేషన్‌ను బీజీపీ పాలిస్తున్నప్పటికీ సమస్యను పరిష్కరించలేక పోతోంది. ఈ తూర్పు కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ టీచర్లు, డాక్టర్లు కలపుకొని 23 వేల మంది మున్సిపల్ ఉద్యోగులు ఉన్నారు. వారు గత రెండేళ్లలోనే ఇప్పటికీ ఐదుసార్లు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. మున్సిపల్ కార్మికుల జీతభత్యాలకు సంబంధించి ఢిల్లీ ఫైనాన్స్ కార్పొరేషన్ సమర్పించిన నివేదికను ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నేటికి అమలు చేయలేకపోతోంది. నిధులలేమీయే అందుకు కారణం. వెనకబడిన తూర్పు ఢిల్లీ కార్పొరేషన్‌కు పన్నుల రూపంలో ప్రజల నుంచే నిధులుగానీ, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంగానీ చాలా తక్కువ. అందుకని తామేమి చేయలేకపోతున్నామన్నది బీజేపీ నాయకత్వంలోని మున్సిపల్ పాలక మండలి వాదన. ఢిల్లీ స్థానిక ప్రభుత్వమే అదనపు నిధులు విడుదల చేయాలన్నది మండలి డిమాండ్. కేంద్రానికి తాము చెల్లిస్తున్న పన్నుల్లో తమ వాటాను పెంచితేనే తామివ్వగలమన్నది ఆప్ ప్రభుత్వం వాదన. ఈ వాదోపవాదాల నేపథ్యంలో కార్మికులు సమ్మె కట్టడం సాధారణమైంది. పారిశుద్ధ్యం పనులు నిలిచిపోవడం నిత్యకృత్యమైంది. ఇప్పుడూ కూడా తూర్పు మున్సిపల్ కార్యాలయానికి 13 కిలోమీటర్ల దూరంలో 12 మంది కార్మికులు బైఠాయింపు ఆందోళన నిర్వహిస్తున్నారు. వారు ఆందోళన చేపట్టి నేటికి 113వ రోజు. వారికి గతం నుంచి రావాల్సిన బకాయిలే కాకుండా, గత రెండు నెలలుగా జీతాలు కూడా రావడం లేదు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు పెద్దగా కలగకుండా సమన్వయం పాటిస్తూ వచ్చామని, ఎన్నికల్లో విజయం సాధించిన వారెవరూ తమను పలకరించిన పాపాన పోలేదని ఎసీడీ స్వచ్ఛ్ కర్మచారి యూనియన్ అధ్యక్షుడు సంజయ్ గెహ్లాట్ తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించేవరకు తమ ఆందోళన ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ నినాదానికిచ్చే గౌరవాన్ని అందుకు కష్టపడే తమ డిమాండ్లను ఎందుకు గౌరవించరన్నది సమ్మెకారుల ప్రశ్న. -
ఢిల్లీలో బీజేపీ విజయఢంకా..
-
ఢిల్లీలో బీజేపీ విజయఢంకా
► వరుసగా మూడోసారి ఎంసీడీ కైవసం ► 70 వార్డులకుగాను 181 చోట్ల గెలుపు ► 48 వార్డులతో రెండో స్థానంలో ఆప్, 30 చోట్ల కాంగ్రెస్ గెలుపు ► ఈవీఎంల ట్యాంపరింగ్‌తో ఓడిపోయామన్న ఆప్ న్యూఢిల్లీ: ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి విజయ దుందుభి మోగించింది. హస్తినలోని మూడు కార్పొరేషన్లపై పట్టు నిలబెట్టుకుని, ఆప్, కాంగ్రెస్‌లను చావుదెబ్బ తీసింది. మొత్తం 272 వార్డులకు గాను 270 వార్డుల్లో ఎన్నికలు జరగ్గా కాషాయ దళం 181 చోట్ల విజయ కేతనం ఎగరేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 48 వార్డుల్లో గెలిచి రెండో స్థానంలో, 30 వార్డులతో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచాయి. బీజేపీకి దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ)లో 70, ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ)లో 64, తూర్పు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్(ఈడీఎంసీ)లో 47 వార్డులు దక్కాయి. ఆప్ ఎస్‌డీఎంసీలో 16, ఎన్డీఎంసీలో 21, ఈడీఎంసీలో 11 చోట్ల గెలవగా, కాంగ్రెస్ ఈ మూడు చోట్లా వరుసగా 12, 15, 3 వార్డులతో గెలిచింది. ఇతరులు 11 వార్డుల్లో విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాలను బుధవారం ప్రకటించారు. అభ్యర్థుల మృతితో రెండు వార్డుల్లో ఎన్నికలు వాయిదాపడ్డాయి. 2012 నాటి మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ 138 వార్డులను కైవసం చేసుకుంది. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో గెలిచి అఖండ విజయం సాధించిన ఆప్ ఈ ఎన్నికల్లో చతికిలబడింది. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మూడే స్థానాల్లో గెలిచిన బీజేపీ తాజా పోరులో తన పదేళ్ల మునిసిపల్ పాలనపై వ్యతిరేకతను సులభంగా అధిగమించింది. ఎన్నికల్లో 71 లక్షల మందికిపైగా ఓటేయగా, అభ్యర్థులందర్నీ తిరస్కరించే ‘నోటా’ బటన్‌కు 0.69 శాతం(49,235) ఓట్లు పడ్డాయి. దక్షిణ ఢిల్లీలోని ఓ వార్డులో ఆప్ అభ్యర్థి తన బీజేపీ ప్రత్యర్థి చేతిలో కేవలం రెండు ఓట్ల తేడాతో ఓడిపోగా, దక్షిణ ఢిల్లీలోని ఓ వార్డులో బీజేపీకి చెందిన అభ్యర్థి అత్యధికంగా 9,866 ఓట్ల మెజారిటీతో ఆప్ అభ్యర్థిని ఓడించారు. తొలిసారిగా ఎన్నికల్లో పోటీచేసిన ఆప్ మాజీ నేత యోగేంద్ర యాదవ్ సారథ్యంలోని స్వరాజ్ ఇండియా పార్టీ ఖాతా తెరవలేకపోయింది. ఈవీఎంలను ట్యాంపర్ చేయడంతో ఓడిపోయామని ఆప్ నేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు. రిగ్గింగ్ జరగకుండా బీజేపీకి అంత భారీ విజయం సాధ్యం కాదన్నారు. అయితే సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ మాత్రం ఆరోపణలు చేయకుండా.. బీజేపీని అభినందించారు. ఢిల్లీ అభివృద్ధి కోసం మూడు కార్పొరేషన్లతో కలసి పనిచేస్తామని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ అజయ్ మాకెన్ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. సుక్మా జవాన్లకు అంకితం ఎన్నికల్లో తమ విజయాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో చనిపోయిన 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు అంకితమిస్తున్నామని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి చెప్పారు. గెలుపు సంబరాలకు దూరంగా ఉంటామన్నారు. ఆప్‌లో ఆత్మవిమర్శ అవసరం ఇటీవల పలు ఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్న ఆప్‌లో అంతర్మథనం మొదలైంది. ఆప్ ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ ఢిల్లీ కన్వీనర్ దిలీప్ పాండే పదవి నుంచి తప్పుకున్నారు. రాజీనామాకు తానూ సిద్ధమని చాందినీ చౌక్ ఆప్ ఎమ్మెల్యే ఆల్కా లాంబా చెప్పగా, పార్టీలో అత్మ విమర్శ అవసరమని ఢిల్లీ మంత్రి కపిల్ శర్మ పేర్కొన్నారు. మోదీ కృతజ్ఞతలు: బీజేపీపై విశ్వాసముంచి ఎన్నికల్లో గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. శ్రమించి ఘన విజయం సాధించిన బీజేపీ టీమ్‌ను అభినందిస్తున్నానన్నారు. ప్రతికూల రాజకీయాలను తిరస్కరించారు: అమిత్ ఢిల్లీ ప్రజలు ప్రతికూల రాజకీయాలను తిరస్కరించి, ‘అందరితో కలసి, అందరి అభివృద్ధి’ కోసం అన్న మోదీ నినాదానికి ఆమోదం తెలిపారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ‘బీజేపీకి ఇది అపూర్వ విజయం. ఇది మోదీ నాయకత్వం విజయం’ అని అన్నారు. ఆ ఈవీఎంలే మిమ్మల్నీ గెలిపించాయి: వెంకయ్య సాక్షి, న్యూఢిల్లీ: ఈవీఎంలపై ఆప్ ఆరోపణలు సిగ్గుచేటని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు విజయాన్ని కట్టబెట్టింది ఆ ఈవీఎంలేనని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలన్న ఆప్ అధికార దాహంతో ఢిల్లీ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. విపక్షాలు ఏకం కావాలి: కాంగ్రెస్ విపక్షాలు ఏకం కావాలని, కాంగ్రెస్‌పై గుడ్డి వ్యతిరేకత పనిచేయదని ప్రాంతీయ పార్టీలు తెలుసుకోవాలని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా పిలుపునిచ్చా రు. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో స్పందిం చిన ఆయన.. సైద్ధాంతిక పోరాటంలో పార్టీలు మొదల దేశ ప్రయోజనాలకు ప్రాధన్యమివ్వాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం 9.7 నుంచి 21కి పెరిగినందుకు కార్యకర్తలను అభినందిస్తున్నాఅని అన్నారు. కాంగ్రెస్‌కు పెరిగిన ఓట్ల శాతం 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 9.7% ఓట్లు సాధించిన కాంగ్రెస్ తాజా మునిసిపల్ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచినా ఓట్ల శాతంలో మాత్రం మెగురుపడి 21.28 శాతం(11 శాతం ఎక్కువ) ఓట్లు గెల్చుకుంది. బీజేపీ ఓట్ల శాతం 32.2 నుంచి 5 శాతం పెరిగి దాదాపు 37 శాతానికి చేరుకోగా ఆప్ ఓట్ల శాతం 54.3 నుంచి సగం తగ్గి 26 శాతానికి పతనమైంది. -
ఢిల్లీలో బీజేపీ విజయఢంకా
-
ఢిల్లీ మునిసిపల్ పీఠంపై బీజేపీ!
► ఎగ్జిట్ పోల్స్ వెల్లడి ► ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు న్యూఢిల్లీ: ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసి, వరుసగా మూడోదఫా అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఆదివారం 270 వార్డులకు ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా, 53 శాతం పోలింగ్ నమోదైంది. అభ్యర్థుల మృతితో రెండు వార్డుల్లో ఎన్నికలను వాయిదా వేశారు. ఎన్నికలు ముగియగానే పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. బీజేపీకి 218, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి 24, కాంగ్రెస్‌కు 22, ఇతరులకు 8 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్–సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. కాషాయ దళానికి ఏకంగా 202 నుంచి 220, ఆప్‌కు 23 నుంచి 35, కాంగ్రెస్‌కు 19 నుంచి 31 సీట్లు రావొచ్చని ఆజ్‌తక్–యాక్సిస్ మై ఇండియా అంచనా. ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడతాయి. మందకొడిగా మొదలై.. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(103), సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(104), ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(63).. మొత్తం 270 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ఉదయం మందకొడిగా ప్రారంభమై మధ్యాహ్నానికి పుంజుకుంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. లెఫ్టినెంట్ జనరల్ బైజల్, ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తదితర ప్రముఖులు ఓటేశారు. కేజ్రీ కుమార్తె హర్షిత తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒపీనియన్ పోల్స్ ప్రసారం చేసిన టైమ్స్ నౌ, ఏబీపీ న్యూస్ చానళ్లకు ఢిల్లీ ఎన్నికల కమిషన్ నోటీసులిచ్చింది. -
కొనసాగుతున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల పొలింగ్
-
నేడు ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. 1.3 కోట్ల మంది ఓటర్లు 272 మంది కౌన్సిలర్లను ఎన్నుకోనున్నారు. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ప్రజా తీర్పు రాజధాని రాజకీయ సమీకరణాలను మార్చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన ఆప్‌కు ప్రజల్లో ఇంకా పట్టుందో లేదో, పదేళ్లుగా మునిసిపల్ కార్పొరేషన్‌ను ఏలుతున్న బీజేపీ హవా తగ్గిందో లేదో ఎన్నికలు తేల్చనున్నాయి. కాగా, బీజేపీకి ఓటేసి మీ పిల్లల జీవితాలను ప్రమాదంలో పడేయవద్దని సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే పిల్లలకు డెంగీ, చికున్‌గున్యా వ్యాధులు వస్తాయని, అందుకు మీరే బాధ్యులవుతారని అన్నారు. మరోపక్క.. నిబంధనలకు విరుద్ధంగా ఒపీనియన్ పోల్స్ ఫలితాలను ప్రకటించిన టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ నౌ మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. -
బీజేపీకి ఓటేయండి.. డెంగ్యూ తెచ్చుకోండి
-
బీజేపీకి ఓటేయండి.. డెంగ్యూ తెచ్చుకోండి: కేజ్రీవాల్
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ దిగజారుతోంది. ఈరోజు బీజేపీకి ఓటేసి.. రేపు డెంగ్యూ, చికన్ గున్యా లాంటి వ్యాధులు వస్తే దానికి మీరే బాధ్యులు అవుతారని ఓటర్లను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. ఢిల్లీ వరకు బీజేపీ 'డెంగ్యూ, చికన్ గున్యా పార్టీ' అని ఆయన అభివర్ణించారు. ఎంసీడీ ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్ల పాటు ఢిల్లీని ఆ పార్టీ మురికిగా ఉంచేస్తుందని అన్నారు. మూడు మునిసిపల్ కార్పొరేషన్లలో ప్రధాని మోదీ పేరును చూపించి అవినీతిని దాచేయడానికి బీజేపీ ప్రయత్నించిందని, ఈ వ్యూహం ఇక్కడ మాత్రం పనిచేయదని చెప్పారు. ఎంసీడీలో పరిస్థితిని మోదీ ఎలా బాగుచేస్తారని.. కార్పొరేషన్లో పనిని మోదీ తీసుకోడానికి వీలుండదని, విజేందర్ గుప్తా లాంటి స్థానిక నాయకులే పనిచేయాలని కేజ్రీవాల్ అన్నారు. పదేళ్ల పాలనలో కార్పొరేషన్‌ను బీజేపీ పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. దేశ రాజధానిలో ఆరోగ్య సమస్యలన్నింటికీ బీజేపీయే కారణమని ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి అన్నారు. ప్రధానమంత్రి అంతర్జాతీయ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారని, కానీ బీజేపీ మాత్రం ఆయన పేరు చెప్పి ఓట్లు అడుగుతోందని విమర్శించారు. కేజ్రీవాల్ ఇతరుల మీద బురద చల్లుతూ కాలం గడిపేస్తున్నారని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్ అన్నారు. ఆయన తన పని చేయడం మానేసి.. అందరినీ ఏదో ఒకటి అంటున్నారని, అసలు ఈ మూడేళ్లలో ఆయన ఢిల్లీకి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. మొత్తం 272 వార్డులున్న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌కు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. BJP को वोट दिया तो अगले 5साल कूडा,मछर ऐसे ही रहेंगे।कल अगर आपके घर डेंगू हो जाए तो आप ख़ुद उसके ज़िम्मेदार होगे क्योंकि आपने BJP को वोट दिया — Arvind Kejriwal (@ArvindKejriwal) 21 April 2017 दिल्ली वालों के लिए भाजपा "डेंगू और चिकनगुनीया वाली पार्टी" है। — Arvind Kejriwal (@ArvindKejriwal) 21 April 2017 -
బీజేపీకి ఓటేస్తే.. చెత్తకుప్పలో వేసినట్టే!
కీలకమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ’న్యూస్18’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఉండకపోతే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించి ఉండేదని పేర్కొన్నారు. రానున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటువేస్తే.. చెత్తకుప్పలో వేసినట్టేనని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ హవా సాగుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఢిల్లీ ప్రజలు రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఎంసీడీలో బీజేపీ పదేళ్లు అధికారంలో ఉంది. ఈ పదేళ్లకాలంలో తీవ్ర ప్రజావ్యతిరేకతను అది మూటగట్టుకుంది. బీజేపీ ఎంసీడీ పాలకపక్షం చెత్త నిర్వహణ వల్ల డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులతోపాటు వీధుల్లో చెత్త బాగా పెరిగిపోయింది. ఎలాంటి అభివృద్ధీ చేపట్టలేదు. అయినా, బీజేపీకి ఓటు వేస్తే అది చెప్పకుప్పలో వేసినట్టే. ఎలాంటి మార్పు ఉండబోదు. బీజేపీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయదు. ఢిల్లీ అంతా చెత్త పేరుకుపోతుంది. ఇక, బీజేపీ ప్రధాని మోదీజీ ఫొటోలు ఉపయోగించుకొని ఓట్లు అడుక్కుంటున్నది. మోదీ ఎంసీడీని పాలించబోరు. ఆ పార్టీ అవినీతిపరులు పాలిస్తారు. కాబట్టి మోదీ హవా ఇక్కడ ఉండబోదు’ అని కేజ్రీవాల్ అన్నారు. -
గెలవకపోతే నేతలను కొనడమే బెటర్
న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలవని చోట గెలిచిన వాళ్లను కొనుక్కోవడమే ఉత్తమమైన మార్గంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) భావిస్తున్నట్లుంది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఈ సూత్రం అక్షరాల ఫలించడంతో ఇప్పుడు ఢిల్లీలోని ఆప్ పార్టీపై కన్నేసింది. అందులో భాగంగానే వారం రోజుల క్రితం ఆప్ ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్‌ను పార్టీలో చేర్చుకొంది. మరి కొంత మంది ఆప్ ఎమ్మెల్యేలతో ఇప్పటికే బేరసారాలు నడుస్తున్నాయని ఇరు పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఓ పద్ధతిగా పావులు కదుపుతోందని, ఈ విషయంలో తొందరపడితే ఆప్కే లాభం జరిగే ప్రమాదం కూడా ఉంటుందికనుక ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని బీజేపీ నాయకుడొకరు తెలిపారు. ఆప్‌ను బలహీనం చేయడం ద్వారా ప్రస్తుతం జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడంతోపాటు వచ్చే జనవరి నెలలో ఢిల్లీ నుంచి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ సీట్లలో ఒక్కటైన దక్కించుకోవాలన్నది అమిత్ షా వ్యూహంగా తెలుస్తోంది. పార్లమెంటరీ సెక్రటరీగా నియమితులైన 21 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని కూడా బీజేపీ ఆశిస్తోంది. జోడు పదవుల ద్వారా లబ్ధి పొందుతున్నారన్న కారణంగా ఈ అంశంపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపింది. ఇంకా తీర్పు వెలువడాల్సి ఉంది. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే ఆ స్థానాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడు ఎక్కువ సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం కూడా ఉంటుందన్న విశ్వాసం కూడా బీజేపీలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీకి చెందిన జనార్దన్ ద్వివేది, కరణ్ సింగ్, పర్వేజ్ హాష్మి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే జనవరి నెలల్లో వీరి సీట్లు ఖాళీ అవుతాయి. ప్రస్తుతం ఆప్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉండడం వల్ల మూడు సీట్లు ఆప్కే దక్కాల్సి ఉంది. ఈ లోగా ఆప్‌ను అన్ని విధాల బలహీనపరిచి అన్ని విధాల లబ్ధి పొందాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది.