ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి విజయ దుందుభి మోగించింది. హస్తినలోని మూడు కార్పొరేషన్లపై పట్టు నిలబెట్టుకుని, ఆప్, కాంగ్రెస్‌లను చావుదెబ్బ తీసింది. మొత్తం 272 వార్డులకు గాను 270 వార్డుల్లో ఎన్నికలు జరగ్గా కాషాయ దళం 181 చోట్ల విజయ కేతనం ఎగరేసింది.