
టాటా ఇండిగో, ఇండికా సీఎన్‌జీ వేరియంట్లు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ ఇండిగో, ఇండికా కార్లలో ఇమ్యాక్స్ సిరీస్ వేరియంట్‌లను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఇమ్యాక్స్ సిరీస్‌లో సీఎన్‌జీ, పెట్రోల్-బై ఫ్యూయల్ సిస్టమ్ ఆప్షన్ ఉంటుందని కంపెనీ వివరించింది. టాటా ఇండిగో ఇమ్యాక్స్ వేరియంట్ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.5.27 లక్షలు, టాటా ఇండికా ఇమాక్స్ వేరియంట్ ధరలు రూ.3.99 లక్షల నుంచి రూ.4.26 లక్షల రేంజ్‌లో ఉన్నాయని (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) కంపెనీ పేర్కొంది.
సీఎన్‌జీ మోడళ్లకు డిమాండ్ పెరుగుతోందని, అందుకే సీఎన్‌జీ మోడళ్లను అందిస్తున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్(కమర్షియల్)) అంకుష్ అరోరా చెప్పారు. ఈ కొత్త వేరియంట్లు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. టాటా మోటార్స్ కంపెనీ ఈ ఏడాది జూన్‌లో హొరెజెనైక్స్‌ట్ ఈవెంట్ సందర్భంగా ఇమ్యాక్స్ రేంజ్‌ను ప్రదర్శించింది. మొదటగా నానో ఇమాక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.