ఎక్కువ మంది ఇష్టపడి కొంటున్న 7 సీటర్ కారు ఇదే! | Best Selling 7 Seater Cars In India | Sakshi
Sakshi News home page

ఎక్కువ మంది ఇష్టపడి కొంటున్న 7 సీటర్ కారు ఇదే!

Published Sun, Jun 23 2024 5:38 PM | Last Updated on Sun, Jun 23 2024 6:12 PM

Best Selling 7 Seater Cars In India

భారతదేశంలో 7 సీటర్ కార్లు విరివిగా అందుబాటులో ఉన్నాయి. ఎన్ని కార్లు ఉన్నా.. ఈ విభాగంలో మారుతి ఎర్టిగా కారుకు ఓ ప్రత్యేకమైన డిమాండ్, ఆదరణ ఉంది. ఈ కారును గత నెలలో (మే 2024) ఏకంగా 13,893 మంది కొనుగోలు చేశారు. దీంతో ఎక్కువ అమ్మకాలు పొందిన 7 సీటర్ కారుగా ఎర్టిగా మళ్ళీ రికార్డ్ క్రియేట్ చేసింది.

దేశీయ మార్కెట్లో మారుతి ఎర్టిగా ధరలు రూ. 8.69 లక్షల నుంచి రూ. 13.03 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు మొత్తం ఏఋ మోనోటోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. దూర ప్రాంతాలకు ఫ్యామిలీతో కలిసి వెళ్లడానికి ఈ కారు ఉత్తమ ఎంపిక.

మారుతి ఎర్టిగా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 103 పీఎస్ పవర్ మరియు 137 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తోంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఇది CNG రూపంలో కూడా లభిస్తుంది. ఇది 88 పీఎస్ పవర్, 121.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.

డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజ్ వంటి సేఫ్టీ ఫీచర కూడా పొందుతుంది. ఈ కారు దేశీయ విఫణిలో ఇనోవా క్రిష్టా, కియా కారెన్స్, మారుతి ఎక్స్ఎల్6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement