Maruti Ertiga
-
ఎక్కువ మంది ఇష్టపడి కొంటున్న 7 సీటర్ కారు ఇదే!
భారతదేశంలో 7 సీటర్ కార్లు విరివిగా అందుబాటులో ఉన్నాయి. ఎన్ని కార్లు ఉన్నా.. ఈ విభాగంలో మారుతి ఎర్టిగా కారుకు ఓ ప్రత్యేకమైన డిమాండ్, ఆదరణ ఉంది. ఈ కారును గత నెలలో (మే 2024) ఏకంగా 13,893 మంది కొనుగోలు చేశారు. దీంతో ఎక్కువ అమ్మకాలు పొందిన 7 సీటర్ కారుగా ఎర్టిగా మళ్ళీ రికార్డ్ క్రియేట్ చేసింది.దేశీయ మార్కెట్లో మారుతి ఎర్టిగా ధరలు రూ. 8.69 లక్షల నుంచి రూ. 13.03 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు మొత్తం ఏఋ మోనోటోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. దూర ప్రాంతాలకు ఫ్యామిలీతో కలిసి వెళ్లడానికి ఈ కారు ఉత్తమ ఎంపిక.మారుతి ఎర్టిగా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 103 పీఎస్ పవర్ మరియు 137 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తోంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఇది CNG రూపంలో కూడా లభిస్తుంది. ఇది 88 పీఎస్ పవర్, 121.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజ్ వంటి సేఫ్టీ ఫీచర కూడా పొందుతుంది. ఈ కారు దేశీయ విఫణిలో ఇనోవా క్రిష్టా, కియా కారెన్స్, మారుతి ఎక్స్ఎల్6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఎర్టిగా కాదు.. ఇన్నోవాలే ముద్దు!
జంట కమిషనరేట్లకు పోలీసులకు సరికొత్త వాహనాలను సమకూర్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి.. ఇన్నోవాలనే ఎంచుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లు రెండింటికీ కలిపి వంద వరకు వాహనాలు కావాలని నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే దాదాపు 1500 కార్లు కావల్సి వస్తాయన్నారు. ముందుగా ఇన్నోవా వాహనాలు తీసుకోవాలని భావించారు. ఆ తర్వాత మారుతి కంపెనీ ప్రతినిధులు వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఇన్నోవాది, తమది దాదాపు ఒకటే డిజైన్ అని, సీట్ల సామర్థ్యం కూడా సమానంగా ఉంటుందని చెప్పారు. అయితే ఇన్నోవా ఖరీదు దాదాపు రూ. 16 లక్షలు కాగా ఎర్టిగా మాత్రం దాదాపు 10 లక్షలకే వస్తుందని, పైగా, ఇన్నోవా కంటే ఎర్టిగా ఎక్కువ మైలేజీ ఇస్తుందని మారుతి కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి నివేదించారు. తమ వాహనం ఖరీదు చేస్తే రూ.6 లక్షల మిగులుతో పాటు మైలేజ్ కలసివస్తుందని ప్రతిపాదించారు. పోలీస్ స్టిక్కర్లతో డిజైన్ చేసిన కొన్ని ఎర్టిగా కార్లను ప్రభుత్వ పెద్దలతో పాటు పోలీసు అధికారులకు చూపించి వాటి పనితీరును వివరించారు. ఒక్కో వాహనానికి 6 లక్షల చొప్పున జంట కమిషనరేట్లలోని వంద వాహనాలకే 6 కోట్ల రూపాయలు మిగిలే అవకాశం ఉండేది. మొత్తం 1500 కార్లకు అయితే దాదాపు 90 కోట్ల వరకు మిగిలిది. అయితే ఎందుకో గానీ.. ఎర్టిగాకు బదులు ఇన్నోవాలనే తెలంగాణ సర్కారు ఎంచుకుంది. దాంతో ఇన్నోవాలే గురువారం నాటి పెరేడ్లో దర్శనమిచ్చాయి. కొసమెరుపు: ఈ కొత్త వాహనాలను పెరేడ్ చేసిన తొలిరోజే ఓ ఇన్నోవా స్వల్ప ప్రమాదానికి గురైంది. ఇందులో ఎవరికీ గాయాలు కాకపోయినా వాహనం ముందుభాగం మాత్రం కొద్దిగా దెబ్బతింది. ఇంజన్ భాగంలోంచి కొంత ఆయిల్ కారింది. -
పోలీసుల వాహనాల్లో కొత్త ట్విస్ట్
తెరపైకి ఎర్టిగా వాహనం! ఇన్నోవా కంటే రూ.6 లక్షలు తక్కువ సాక్షి, సిటీబ్యూరో: పోలీసులకు రాబోతున్న కొత్త వాహనాలలో ఇప్పటి వరకు ఇన్నోవా తెరపైకి వచ్చింది. తాజాగా మారుతి కంపెనీ ఎర్టిగా కూడా ప్రభుత్వ పరిశీలనకు వచ్చింది. జంట పోలీసు కమిషనరేట్లకు ఇన్నోవా కారు, హీరో మోటార్ సైకిల్‌ను కొనేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి అందులో కొన్నింటిని ఖరీదు చేసింది. సుమారు 1,500 కార్లు, 1,600కుపైగా బైక్‌లు కొత్తగా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రూ.300 కోట్లు ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇన్నోవా ఖరీదు సుమారు రూ.16 లక్షలు ఉంది. కానీ, మారుతి ఎర్టిగా సుమారు రూ.10 లక్షలే. రెండు వాహనాల్లో సిట్టింగ్ కేపాసిటీ ఒకే విధంగా ఉంది. పైగా ఇన్నోవా కంటే ఎర్టిగా ఎక్కువ మైలేజీ ఇస్తుంది. దీన్నే మారుతి కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి నివేదించారు. తమ వాహనం ఖరీదు చేస్తే రూ.6 లక్షల మిగులుతో పాటు మైలేజ్ కలసివస్తుందని ప్రతిపాదించారు. పోలీస్ స్టిక్కర్లతో డిజైన్ చేసిన కొన్ని ఎర్టిగా కార్లను ప్రభుత్వ పెద్దలతో పాటు పోలీసు అధికారులకు చూపించి వాటి పనితీరును వివరించారు. దీంతో ఇన్నోవాల కొనుగోలులో ప్రభుత్వం పునరాలోచించే అవకాశం కనిపిస్తోంది.