Maruti Suzuki Baleno, Ignis, Ciaz get discounts of up to Rs 64,000 this June - Sakshi
Sakshi News home page

Maruti Suzuki: ఈ మారుతి కార్లను ఇప్పుడే కోనేయండి.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదేమో!

Published Sat, Jun 10 2023 11:58 AM | Last Updated on Sat, Jun 10 2023 1:07 PM

Maruti suzuki discounts up to 64000 ignis baleno and siaz - Sakshi

Maruti Suzuki Discounts: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. కావున కొనుగోలుదారులు వీటి మునుపటి ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో మారుతి ఇగ్నిస్, సియాజ్, బాలెనో మోడల్స్ ఉన్నాయి. ఈ కార్ల కొనుగోలుపైన కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఇగ్నిస్
మారుతి సుజుకి ఇగ్నిస్ కొనుగోలుపైన రూ. 64,000 వరకు బెనిఫీట్స్ పొందవచ్చు. ఈ ఆఫర్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్‌లకు వర్తిస్తుంది. ఇందులో రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4000 కార్పొరేట్ బెనిఫీట్స్ ఉన్నాయి. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. దీని ధర దేశీయ విఫణిలో రూ. 5.84 లక్షల నుంచి రూ. 8.16 లక్షల మధ్య ఉంది.

మారుతి సుజుకి సియాజ్
సియాజ్ కొనుగోలుపైన రూ. 33,000 అదా చేసుకోవచ్చు. ఇది నెక్సా లైనప్‌లోని ప్రాధమిక మోడల్. కస్టమర్లు దీనిపైన రూ. 30,000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపుని పొందవచ్చు. అయితే దీని పైన క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో లేదు. ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 105 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ధర మార్కెట్లో రూ. 9.30 లక్షల నుంచి రూ. 12.29 లక్షల మధ్య ఉంది.

(ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత ఇండియాలో మిస్‌ వరల్డ్‌ పోటీలు.. రిజిస్ట్రేషన్‌ ఇలా చేయండి)

మారుతి సుజుకి బాలెనో
దేశీయ మార్కెట్లో ఎక్కువమందికి ఇష్టమైన మోడల్, ఎక్కువ అమ్ముడవుతున్న బాలెనో కొనుగోలుపైన కూడా కొనుగోలుదారులు రూ. 35,000 బెనిఫీట్స్ పొందవచ్చు. డెల్టా మ్యాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్ల మీద రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ పొందుతుంది. దీని ధర రూ. 6.61 లక్షల నుంచి రూ. 9.98 లక్షల మధ్య ఉంటుంది.

(ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్‌మెంట్‌లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..)

మారుతి సుజుకి అందిస్తున్న డిస్కౌంట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఈ ఆఫర్ స్టాక్ ఉన్నత వరకు మాత్రమే ఉంటుంది. కావున ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న స్థానిక డీలర్‌ను సంప్రదించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement