భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి గత కొంతకాలంగా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇప్పుడు 2023 ఏప్రిల్ నెల అమ్మకాల నివేదికను కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం, మారుతి సుజుకి గత నెలలో మొత్తం 1,60,529 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. ఇందులో దేశీయ అమ్మకాలు 1,39,519 యూనిట్లు కాగా.. 16,971 యూనిట్లు ఎగుమతులుగా నమోదయ్యాయి. అయితే ఇదే నెల గతేడాది కంపెనీ అమ్మకాలు 1,50,661 యూనిట్లు.
మినీ సెగ్మెంట్ విభాగంలో మారుతి ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటివి ఉత్తమ అమ్మకాలు పొందాయి. వీటి మొత్తం అమ్మకాలు 14,110 యూనిట్లు. ఇక కాంపాక్ట్ సెగ్మెంట్ విభాగంలో బాలెనొ, సెలెరియో, డిజైర్, స్విఫ్ట్ వంటివి ముందంజలో ఉన్నాయి. ఈ కార్ల అమ్మకాలు 89,045 యూనిట్లు. ఇక ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలలో సియాజ్ 1,017 యూనిట్ల అమ్మకాలను పొందింది.
(ఇదీ చదవండి: మార్కెట్లో 'పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో' స్మార్ట్‌వాచ్ లాంచ్ - ధర ఎంతంటే?)
మారుతి సుజుకి యుటిలిటీ వెహికల్స్ సేల్స్ లో బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా వంటివి ఉత్తమ అమ్మకాలు పొందాయి. ఈ కార్ల అమ్మకాలు ఏకంగా 90,062 యూనిట్లు. మొత్తం మీద మారుతి సుజుకి అమ్మకాలు గత నెలలో కూడా మంచి స్థాయిలో పెరిగాయి, రానున్న రోజుల్లో కూడా మరిన్ని మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment