ప్రముఖ వాహన తయారీ దిగ్గజం 'మారుతి సుజుకి' రూ.3.81 కోట్లకు పైగా డిఫరెన్షియల్ డ్యూటీని చెల్లించాలని డిమాండ్ చేస్తూ కస్టమ్స్ అథారిటీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కంపెనీ ముంబైలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్ కస్టమ్స్ (దిగుమతి), కమీషనర్ కార్యాలయం నుంచి షోకాజ్ నోటీసును అందుకుంది.
ఈ షోకాజ్ నోటీసులో.. నిర్దిష్ట కేటగిరీ వస్తువుల దిగుమతిపై కస్టమ్ డ్యూటీ మినహాయింపును క్లెయిమ్ చేయడానికి & వడ్డీ, జరిమానాతో పాటు రూ.3,81,37,748 డిఫరెన్షియల్ డ్యూటీని చెల్లించడానికి గల కారణాలను అందించాల్సిందిగా అధికార యంత్రాంగం కంపెనీని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment