Youtuber Converts Maruti Suzuki 5 Door Jimny Into Comfortable Camping Setup, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Maruti Jimny Into Camping Setup: మారుతి జిమ్నీని సింగిల్‌ బెడ్‌తో అలా మార్చేసిన జంట; వైరల్‌ వీడియో

Published Wed, Jul 26 2023 3:09 PM | Last Updated on Wed, Jul 26 2023 3:27 PM

YouTuber converts Maruti Jimny into cozy home on wheels viral video - Sakshi

మారుతి సుజుకి చెందిన పాపులర్‌ వెహికల్‌ 5-డోర్‌​ మారుతీ జిమ్నీని   ఒక  క్యాంపింగ్‌  బెడ్‌గా మార్చేసిన వైనం ఇంటర్నెట్‌లో  వైరల్‌గా మారింది. యూట్యూబర్స్‌ జంట మారుతి సుజుకి జిమ్నీని సౌకర్యవంతమైన క్యాంపింగ్ సెటప్‌గా మార్చేశారు. దీనికి  సంబంధించిన వీడియోను  Xreme Moto అడ్వెంచర్  షేర్‌ చేసింది. ఈ వీడియోలో దశల వారీగా మొత్తం  ప్రక్రియను పొందుపర్చింది ఈ జంట. ఇది  నెటిజనులను ఆశ్చర్య పరుస్తోంది. (బెదిరింపులు: అంబానీ కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు, ప్రత్యేకత తెలిస్తే..!)

యూట్యూబర్ , అతని భార్య తమ మారుతి సుజుకి జిమ్నీ కారు లోపలి భాగాన్ని పరుపుకు అనుగుణంగా మార్చి, హాయిగా క్యాంపింగ్ సెటప్‌ను సృష్టించారు.  ఇందుకోసం ఆగానే కష్టపడ్డారు. కారు వెనుక తలుపు తెరిచి కవర్‌ను తీసి వేయడం, ఇంటి నుండి 6-అంగుళాల సింగిల్ బెడ్‌ కోసం మధ్య సీటును తీసివేయడం ప్రారంభిస్తారు. ప్రారంభంలో, వారు మధ్యలో నుండి నాలుగు బోల్ట్‌లను తీసివేయడానికి ప్రయత్నించి, విఫలమై, మరుసటి రోజుకు వాయిదా వేయడం, మరుసటి రోజు మధ్య వరుస సీట్లలోని పైభాగాన్ని విప్పడంతో వారి పని  ఈజీ అవుతుంది.  (శాంసంగ్‌ లాంచ్‌ ఈవెంట్: అంచనాలు మామూలుగా లేవుగా!)

మారుతి సుజుకి జిమ్నీ వంటి కాంపాక్ట్ వాహనంలో కూడా క్యాంపింగ్‌ సెట్‌ను అందంగా మర్చుకోవడం  క్రియేటివ్‌గా నిలిచింది. సెటప్ పూర్తయిన తర్వాత, దంపతులు తమ కొత్త క్యాంపింగ్ ఏర్పాటును తమ తల్లికి ఆసక్తిగా చూపించడంతో వ్యక్తిగతంగా ఎనలేని సంతోషాన్ని, అటు  కుటుంబ ఆమోదాన్ని కూడా పొందింది. (ఐటీ రిటర్న్‌ గడువులోగా ఫైల్‌ చేయండి..లేదంటే?)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement