Jimmy
-
ధనిక యూట్యూబర్ 'మిస్టర్ బీస్ట్' ఎంగేజ్మెంట్.. అమ్మాయి ఎవరంటే? (ఫోటోలు)
-
‘ఎక్స్’ సమాచారాన్ని నమ్మలేం.. జిమ్మీ వేల్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
టెక్ కంపెనీల మధ్య నిత్యం పోటీ ఉంటుంది. వినియోగదారులకు అందించే సేవలతో పాటు ఇతర విషయాల్లో ఆ సంస్థల యజమానుల్లో ఆ పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా వికీపిడియా సహవ్యవస్థాపకుడు జిమ్మీవేల్స్ ఎలాన్‌మస్క్ సారధ్యంలోని ఎక్స్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాట్‌జీపీటీ, బింగ్, బార్డ్ వంటి చాట్‌బాట్స్ ఆధారిత లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) వికీపిడియా డేటాను ఉపయోగిస్తున్నాయని, మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ డేటాను కాదని జిమ్మీ వేల్స్ అన్నారు. పోర్చుగల్‌లోని లిస్బన్లో జరిగిన వెబ్ సమ్మిట్‌లో జిమ్మీ వేల్స్ మాట్లాడారు. ఎలాన్‌మస్క్, ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. సరైన సమాచారానికి ఎక్స్ నమ్మదగిన వేదిక కాదన్నారు. ట్విట్టర్‌కు (ఎక్స్) బదులు ఎల్ఎల్ఎంలు వికీపిడియా డేటాను వినియోగించడం పట్ల గర్వంగా ఉందన్నారు. ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా మస్క్ ఆఫర్ చేస్తున్న ఏఐ చాట్‌బాట్ గ్రోక్ గురించి తానిప్పటివరకూ వినలేదని వేల్స్ చెప్పారు. మరోవైపు ఎలన్ మస్క్ ఇటీవల వికీపిడియాపై చేసిన వ్యాఖ్యలపై డిబేట్ సాగింది. వికీపీడియా తన వెబ్సైట్ పేరును డికీపీడియాగా మార్చుకోవాలని మస్క్ సూచించారు. తన సూచనకు అనుగుణంగా వారు పేరు మారిస్తే ఆ వెబ్‌సైట్‌కు మిలియన్ డాలర్లు ఇస్తానని మస్క్ వ్యాఖ్యానించారు. -
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత!
ప్రముఖ అమెరికన్ సింగర్, గేయరచయిత జిమ్మీ బఫ్ఫెట్ (76) కన్నుమూశారు. ఆయన 'మార్గరీటవిల్లే', 'ఫిన్స్' వంటి హిట్ పాటలకు ప్రసిద్ధి చెందారు. సెప్టెంబర్ 1 రాత్రి ఆయన మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే జిమ్మీ మరణానికి గల కారణాలు వెల్లడికాలేదు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. (ఇది చదవండి: తెలుగు హీరోతో సినిమా వదులుకున్న స్టార్ హీరోయిన్.. తగిన శాస్తే జరిగింది!) జిమ్మీ బఫెట్ 25 డిసెంబర్ 1946న అమెరికాలోని మిస్సిస్సిప్పిలో జన్మించారు. అతను 50 సంవత్సరాల తన కెరీర్లో దాదాపు 27 స్టూడియో ఆల్బమ్‌లను విడుదల చేశాడు. 1977లో విడుదలైన 'మార్గరెట్ విల్లే' ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బఫెట్ సింగర్ మాత్రమే కాదు.. మంచి రచయిత కూడా. చాలా పుస్తకాలు రచించడమే కాకుండా పలు సినిమాలు, టీవీ షోలలో అతిథి పాత్రల్లో కనిపించాడు. 1981లో మాజీ ఫ్లోరిడా గవర్నర్ రాన్ గ్రాహంతో కలిసి సేవ్ ది మనాటీ క్లబ్ స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించాడు. మిస్టర్ బఫెట్ 2016లో ఫోర్బ్స్ అమెరికా సంపన్నుల జాబితాలో 550 మిలియన్ డాలర్ల నికర విలువతో 13వ స్థానంలో నిలిచారు. కాగా.. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం ఉన్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ పెళ్లి వాయిదా.. ఇప్పట్లో లేనట్లే! ) The pirate has passed. RIP Jimmy Buffett. Tremendous influence on so many of us -T pic.twitter.com/HpyDWYWPfE — Toby Keith (@tobykeith) September 2, 2023 -
మారుతి జిమ్నీని సింగిల్ బెడ్‌తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో
మారుతి సుజుకి చెందిన పాపులర్ వెహికల్ 5-డోర్ మారుతీ జిమ్నీని ఒక క్యాంపింగ్ బెడ్‌గా మార్చేసిన వైనం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. యూట్యూబర్స్ జంట మారుతి సుజుకి జిమ్నీని సౌకర్యవంతమైన క్యాంపింగ్ సెటప్‌గా మార్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను Xreme Moto అడ్వెంచర్ షేర్ చేసింది. ఈ వీడియోలో దశల వారీగా మొత్తం ప్రక్రియను పొందుపర్చింది ఈ జంట. ఇది నెటిజనులను ఆశ్చర్య పరుస్తోంది. (బెదిరింపులు: అంబానీ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు, ప్రత్యేకత తెలిస్తే..!) యూట్యూబర్ , అతని భార్య తమ మారుతి సుజుకి జిమ్నీ కారు లోపలి భాగాన్ని పరుపుకు అనుగుణంగా మార్చి, హాయిగా క్యాంపింగ్ సెటప్‌ను సృష్టించారు. ఇందుకోసం ఆగానే కష్టపడ్డారు. కారు వెనుక తలుపు తెరిచి కవర్‌ను తీసి వేయడం, ఇంటి నుండి 6-అంగుళాల సింగిల్ బెడ్ కోసం మధ్య సీటును తీసివేయడం ప్రారంభిస్తారు. ప్రారంభంలో, వారు మధ్యలో నుండి నాలుగు బోల్ట్లను తీసివేయడానికి ప్రయత్నించి, విఫలమై, మరుసటి రోజుకు వాయిదా వేయడం, మరుసటి రోజు మధ్య వరుస సీట్లలోని పైభాగాన్ని విప్పడంతో వారి పని ఈజీ అవుతుంది. (శాంసంగ్ లాంచ్ ఈవెంట్: అంచనాలు మామూలుగా లేవుగా!) మారుతి సుజుకి జిమ్నీ వంటి కాంపాక్ట్ వాహనంలో కూడా క్యాంపింగ్ సెట్‌ను అందంగా మర్చుకోవడం క్రియేటివ్‌గా నిలిచింది. సెటప్ పూర్తయిన తర్వాత, దంపతులు తమ కొత్త క్యాంపింగ్ ఏర్పాటును తమ తల్లికి ఆసక్తిగా చూపించడంతో వ్యక్తిగతంగా ఎనలేని సంతోషాన్ని, అటు కుటుంబ ఆమోదాన్ని కూడా పొందింది. (ఐటీ రిటర్న్ గడువులోగా ఫైల్ చేయండి..లేదంటే?) -
Hong Kong: జిమ్మీలాయ్కి 14 నెలల జైలు
హాంకాంగ్: హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూలవాదులపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. స్థానిక మీడియా అధిపతి, ప్రజాస్వామ్య అనుకూలవాది అయిన జిమ్మీ లాయ్(73)కి హాంకాంగ్ న్యాయస్థానం శుక్రవారం మరో 14 నెలల జైలు శిక్ష విధించింది. 2019లో అనుమతి లేకుండా ర్యాలీలు చేపట్టారన్న నేరంపై ఇప్పటికే ఆయన జైలులో ఉన్నారు. 2019 ఆందోళనల సమయంలోనే అనధికారికంగా గుమికూడారన్న మరో కేసులో లాయ్‌తోపాటు 10 మందికి న్యాయస్థానం తాజాగా జైలు శిక్షలు విధించింది. కాగా, లాయ్ రెండింటికీ కలిపి 20 నెలలపాటు కటకటాల్లోనే గడపాల్సి ఉంటుంది. ది యాపిల్ డైలీ వ్యవస్థాపకుడైన జిమ్మీలాయ్ చైనా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జాతీయ భద్రత విధానం ప్రజాస్వామ్య హక్కులకు తీవ్ర విఘాతం కలిగించేదిగా ఉందని విమర్శిస్తున్నారు. చదవండి: కరోనా: జాన్సన్ సింగిల్ షాట్‌కు యూకే ఓకే -
ఫెడరర్ టైటిల్స్ ‘సెంచరీ’
దుబాయ్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ శనివారం తన కెరీర్లో వందో సింగిల్స్ టైటిల్ సాధించాడు. దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో గ్రీస్ యువ కెరటం సిట్సిపాస్‌ను ఓడించడం ద్వారా అతడీ ఘనతను అందుకున్నాడు. ఫైనల్లో ఫెడరర్ 6–4, 6–4తో ప్రపంచ పదో ర్యాంకర్ సిట్సిపాస్‌ను అలవోకగా ఓడించి ఈ టైటిల్‌ను ఎనిమిదోసారి సొంతం చేసుకున్నాడు. ఇదే క్రమంలో కెరీర్ వందో టైటిల్ రికార్డునూ అందుకున్నాడు. అమెరికా టెన్నిస్ గ్రేట్ జిమ్మీ కానర్స్ (109 టైటిల్స్) తర్వాత అరుదైన ‘సెంచరీ క్లబ్’లో చేరిన రెండో ఆటగాడు ఫెడరర్ మాత్రమే కావడం విశేషం. ప్రస్తుతం ఈ స్విస్ వీరుడి ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్... 6 ఏటీపీ ఫైనల్స్ టైటిల్స్... 27 ఏటీపీ వరల్డ్ టూర్ మాస్టర్స్–1000 టైటిల్స్... 22 ఏటీపీ వరల్డ్ టూర్–500 టైటిల్స్... 25 ఏటీపీ వరల్డ్ టూర్–250 టైటిల్స్ ఉన్నాయి. వీటిలో 25 టైటిల్స్‌ను కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్న 2003 అక్టోబరు–2005 అక్టోబరు మధ్య కాలంలోనే సాధించడం గమనార్హం. -
‘జిమ్మీ’ ఇక లేదు...
రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ ఏఆర్ఐ క్వార్టర్స్ ప్రాంతవాసులకు రక్షణగా ఉన్న జిమ్మీ(కుక్క) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. గత ఐదు సంవత్సరాలుగా క్వార్టర్స్ వాసులను విషసర్పాల నుంచి కంటికి రెప్పలా కాపాడుతున్న జిమ్మీ...గత ఎనిమిది నెలల క్రితం రక్తపింజరి కాటుకు గురైన అస్వస్థకు గురైంది. ఆ సమయంలో స్థానిక వెటర్నరీ డాక్టర్లు ప్రథమ చికిత్స నిర్వహించారు. అప్పటి నుంచి అనారోగ్యంగా ఉన్న జిమ్మీ శుక్రవారం ఉదయం మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు అదే ప్రాంతంలో గోతి తీసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జమ్మీకి తోడుగా మరో కుక్క జానీ క్వార్టర్స్ ప్రాంతానికి వచ్చిన దాదాపు 40 కిపైగా పాములను కరిచి చంపాయి. క్వార్టర్స్‌వాసులు ఈ కుక్కల ఆలనాపాలనా చూసేవారు. క్వార్టర్స్‌లోకి విషసర్పాలతో పాటు ఏ జంతువులను, ఇతరులెవ్వరిని లోనికి రానిచ్చేవి కాదు. జిమ్మీ మృతదేహం వద్ద జానీ రోదిస్తూ కూర్చోవడం స్థానికులను కంటతడి పెట్టించింది.