ప్రముఖ అమెరికన్ సింగర్, గేయరచయిత జిమ్మీ బఫ్ఫెట్ (76) కన్నుమూశారు. ఆయన 'మార్గరీటవిల్లే', 'ఫిన్స్' వంటి హిట్ పాటలకు ప్రసిద్ధి చెందారు. సెప్టెంబర్ 1 రాత్రి ఆయన మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే జిమ్మీ మరణానికి గల కారణాలు వెల్లడికాలేదు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
(ఇది చదవండి: తెలుగు హీరోతో సినిమా వదులుకున్న స్టార్ హీరోయిన్.. తగిన శాస్తే జరిగింది!)
జిమ్మీ బఫెట్ 25 డిసెంబర్ 1946న అమెరికాలోని మిస్సిస్సిప్పిలో జన్మించారు. అతను 50 సంవత్సరాల తన కెరీర్‌లో దాదాపు 27 స్టూడియో ఆల్బమ్‌లను విడుదల చేశాడు. 1977లో విడుదలైన 'మార్గరెట్ విల్లే' ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బఫెట్ సింగర్ మాత్రమే కాదు.. మంచి రచయిత కూడా. చాలా పుస్తకాలు రచించడమే కాకుండా పలు సినిమాలు, టీవీ షోలలో అతిథి పాత్రల్లో కనిపించాడు.
1981లో మాజీ ఫ్లోరిడా గవర్నర్ రాన్ గ్రాహంతో కలిసి సేవ్ ది మనాటీ క్లబ్ స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించాడు. మిస్టర్ బఫెట్ 2016లో ఫోర్బ్స్ అమెరికా సంపన్నుల జాబితాలో 550 మిలియన్ డాలర్ల నికర విలువతో 13వ స్థానంలో నిలిచారు. కాగా.. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం ఉన్నారు.
(ఇది చదవండి: స్టార్ హీరోయిన్ పెళ్లి వాయిదా.. ఇప్పట్లో లేనట్లే! )
The pirate has passed. RIP Jimmy Buffett. Tremendous influence on so many of us -T pic.twitter.com/HpyDWYWPfE
— Toby Keith (@tobykeith) September 2, 2023
Comments
Please login to add a commentAdd a comment