Buffett
-
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత!
ప్రముఖ అమెరికన్ సింగర్, గేయరచయిత జిమ్మీ బఫ్ఫెట్ (76) కన్నుమూశారు. ఆయన 'మార్గరీటవిల్లే', 'ఫిన్స్' వంటి హిట్ పాటలకు ప్రసిద్ధి చెందారు. సెప్టెంబర్ 1 రాత్రి ఆయన మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే జిమ్మీ మరణానికి గల కారణాలు వెల్లడికాలేదు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. (ఇది చదవండి: తెలుగు హీరోతో సినిమా వదులుకున్న స్టార్ హీరోయిన్.. తగిన శాస్తే జరిగింది!) జిమ్మీ బఫెట్ 25 డిసెంబర్ 1946న అమెరికాలోని మిస్సిస్సిప్పిలో జన్మించారు. అతను 50 సంవత్సరాల తన కెరీర్లో దాదాపు 27 స్టూడియో ఆల్బమ్‌లను విడుదల చేశాడు. 1977లో విడుదలైన 'మార్గరెట్ విల్లే' ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బఫెట్ సింగర్ మాత్రమే కాదు.. మంచి రచయిత కూడా. చాలా పుస్తకాలు రచించడమే కాకుండా పలు సినిమాలు, టీవీ షోలలో అతిథి పాత్రల్లో కనిపించాడు. 1981లో మాజీ ఫ్లోరిడా గవర్నర్ రాన్ గ్రాహంతో కలిసి సేవ్ ది మనాటీ క్లబ్ స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించాడు. మిస్టర్ బఫెట్ 2016లో ఫోర్బ్స్ అమెరికా సంపన్నుల జాబితాలో 550 మిలియన్ డాలర్ల నికర విలువతో 13వ స్థానంలో నిలిచారు. కాగా.. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం ఉన్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ పెళ్లి వాయిదా.. ఇప్పట్లో లేనట్లే! ) The pirate has passed. RIP Jimmy Buffett. Tremendous influence on so many of us -T pic.twitter.com/HpyDWYWPfE — Toby Keith (@tobykeith) September 2, 2023 -
టాప్ 5 లోకి దూసుకొచ్చిన ముకేశ్ అంబానీ
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (63) ప్రపంచ కుబేరుల జాబితాలో శరవేగంగా దూసుకుపోతున్నారు. రిలయన్స్ టెలికాం విభాగం జియోలో వరుస భారీ పెట్టుబడులతో అంబానీ తాజాగా అత్యంత ధనవంతుల జాబితాలో 5వ స్థానానికి ఎగబాగారు. తద్వారా దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌లను వెనక్కి నెట్టేశారు. ప్రపంచంలో టాప్ 10 బిలియనీర్స్‌లో ఏకైక ఆసియా వ్యక్తి రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కావడం విశేషం. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం 75.1 బిలియన్ డాలర్ల నికర విలువతో ముఖేష్ అంబానీ 5వ స్థానానికి చేరుకున్నారు. బర్క్‌షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫెట్‌ను వెనక్కి నెట్టేశారు ముఖేష్ అంబానీ. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ తర్వాతి స్థానంలో అంబానీ ఉన్నారు. మార్క్ జుకర్ బర్గ్ 88.1 బిలియన్ డాలర్ల నికర విలువతో 4వ స్థానంలో ఉన్నారు. మరోవైపు 5వ స్థానం కోసం ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అంబానీ మధ్య భారీ పోటీ నెలకొంది. టెస్లా షేర్ల ధర భారీగా పెరగడంతో మస్క్ నికర సంపద 74 బిలియన్ డాలర్లకు చేరుకుంది. (జియో మార్ట్ దూకుడు: ఉచిత డెలివరీ) ఈ జాబితాలో 185.8 బిలియన్ డాలర్లతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ టాప్ టాప్ ప్లేస్‌లో ఉండగా, 113.1 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మూడో స్థానంలో లగ్జరీ గూడ్స్ ఎల్వీహెచ్ బ్రాండ్ మోయిట్ హెన్నెస్సీ ఛైర్మన్ బెర్నార్డ్ అర్నాల్ట్ ఫ్యామిలీ ఉంది. 89 బిలియన్ డాలర్ల నికర విలువతో నాలుగో స్థానంలో మార్క్ జుకర్ బర్గ్, ఆరో స్థానంలో వారెన్ బఫెట్, ఏడో స్థానంలో ఒరాకిల్ కార్పొరేషన్ ఫౌండర్ లార్రీ ఎల్లిసన్, ఎనిమిదో స్థానంలో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మర్, పదో స్థానంలో గూగుల్ కోఫౌండర్ లారీ పేజ్ ఉన్నారు -
బఫెట్ తప్పు చేశారు: ట్రంప్
ఎయిర్‌లైన్ ఇండస్ట్రీస్ షేర్లను విక్రయించి వారెన్ ఒఫెట్ తప్పుచేశారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. వైట్ హౌస్‌లో శుక్రవారం జరిగిన ఓ న్యూస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ ... కొన్నిసార్లు బఫెట్ లాంటి అనుభవజ్ఞులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. బఫెట్ ఎయిర్‌లైన్ స్టాక్లులను విక్రయించకుండా ఉండాల్సింది. ఎందుకంటే ప్రస్తుతం ఎయిర్షేర్లు భారీగా లాభపడుతున్నాయి. అయితే బఫెట్‌పై తనకు అపారమైన గౌరవం ఉందని ట్రంప్ తెలిపారు. తాను మాత్రం జీవితాంతం సరైన నిర్ణయాలే తీసుకున్నాను అని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో బఫెట్ అమెరికాలోని ప్రధానమైన 4 ఎయిర్‌లైన్స్ కంపెనీల షేర్లను విక్రయించారు. విచిత్రంగా బఫెట్ విక్రయం తర్వాత ఈ ఎయిర్‌లైన్ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఈ ఒక్క వారంలోనే డెల్టా ఎయిర్‌లైన్ షేరు 40శాతానికి పైగా పెరిగింది. అమెరికన్ ఎయిర్‌లైన్ షేరు 90శాతం, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ షేరు 25శాతం, యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ హోల్డింగ్ షేరు 60శాతానికి పైగా లాభపడింది. బఫెట్ 2016 నుంచి ఎయిర్టెల్ షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. తన సొంత సంస్థ బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశం ఈ మేనెలలో జరిగింది. ఈ సందర్భంగా బఫెట్ మాట్లాడుతూ వైమానిక పరిశ్రమ పట్ల ప్రపంచ థృక్పథం మారిపోయిందన్నారు. -
కోటక్ బ్యాంక్‌లో బఫెట్ పెట్టుబడులు?
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకులో (కేఎంబీ) ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథవే పెట్టుబడులు పెట్టనుందన్న వార్తలు శుక్రవారం మార్కెట్లో హల్చల్ చేశాయి. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కేఎంబీలో 10 శాతం వాటాలను బెర్క్‌షైర్ కొనుగోలు చేయాలని భావిస్తోంది. ప్రమోటర్ వాటాలను కొనుగోలు చేయడం లేదా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ రూపంలో ఈ డీల్ ఉండవచ్చు. ఒప్పందం విలువ సుమారు 4 బిలియన్ డాలర్ల నుంచి 6 బిలియన్ డాలర్ల దాకా (దాదాపు రూ. 28,000 కోట్ల నుంచి రూ. 42,000 కోట్ల దాకా) ఉండొచ్చని అంచనా. ఒకవేళ ఈ డీల్ గానీ పూర్తయితే ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా కేఎంబీలో ప్రమోటర్లు తమ వాటాలను తగ్గించుకోవడం సాధ్యపడుతుంది. సెప్టెంబర్ ఆఖరు నాటికి కేఎంబీలో ప్రమోటరు, వైస్ చైర్మన్ ఉదయ్ కొటక్‌కు 29.73 శాతం వాటాలున్నాయి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 2018 నాటికల్లా ప్రమోటర్ల వాటాను 20 శాతానికి, 2020 మార్చి నాటికి 15 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కేఎంబీ మార్కెట్ క్యాప్ దాదాపు 34 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 2.38 లక్షల కోట్లు) ఉంది. మరోవైపు, ఈ వార్తలపై స్టాక్ ఎక్సే్చంజీలకు కేఎంబీ వివరణనిచ్చింది. బెర్క్‌షైర్ హాథవే తమ బ్యాంకులో వాటాలు కొనుగోలు చేసే ప్రణాళికల గురించి తమ వద్ద సమాచారమేమీ లేదని పేర్కొంది. షేరు 9 శాతం అప్..: బెర్క్‌షైర్ హాథవే పెట్టుబడులు పెడుతున్నట్లు వెలువడిన వార్తలతో శుక్రవారం కోటక్ మహీంద్రా షేర్లు భారీగా ఎగిశాయి. బీఎస్ఈలో ఒక దశలో సుమారు 14 శాతం పెరిగి రూ. 1,345.35 స్థాయిని కూడా తాకింది. చివరికి 8.53 శాతం లాభంతో రూ. 1,282.25 వద్ద క్లోజయ్యింది. మరోవైపు ఎన్ఎస్ఈలో కూడా ఇంట్రాడేలో రూ. 1,345.95 – రూ. 1,176.15 మధ్య తిరుగాడిన షేరు చివరికి 8.84 శాతం లాభంతో రూ. 1,284.55 వద్ద క్లోజయ్యింది. -
బఫెట్‌కు రూ.25వేల కోట్ల నష్టం!
అమెరికా స్టాక్ మార్కెట్ ఈ వారం భారీగా పడిపోవడంతో అపర కుబేరుడు, వారెన్ బఫెట్ సంపద కూడా భారీగా పతనమైంది. ఈ వారం స్టాక్ మార్కెట్ క్షీణతతో వారెన్ బఫెట్‌కు 374 కోట్ల డాలర్ల (రూ.24,300 కోట్లు) నష్టం వచ్చింది. వారెన్ బఫెట్ సంపదే కాకుండా ఇతర సంపన్నుల సంపద కూడా భారీ స్థాయిలోనే హరించుకుపోయింది. ఫేస్బుక్ మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ లారీ పేజ్, సెర్గీ బ్రిన్ తదితరులు పెద్ద మొత్తంలోనే నష్టపోయారు. బఫెట్‌కు చెందిన బెర్కషైర్ హాతవే మార్కెట్ విలువ తాజా పతనం తరవాత రూ.32.5 లక్షల కోట్లు. మొత్తం12,800 కోట్ల డాలర్లు హుష్‌కాకి... సోమవారం నుంచి అమెరికా స్టాక్ మార్కెట్ పతనం కావడంతో 500 మందికి పైగా కుబేరులు 12,800 కోట్ల డాలర్ల (రూ.8,32,000 కోట్లు) మేర నష్టపోయారు. ఇది నెట్‌ఫ్లిక్స్, లేదా మెక్‌డొనాల్డ్ కార్ప్‌ల మార్కెట్ క్యాపిటలైజేషన్కు సమానం. ఇలా నష్టపోయిన కుబేరుల్లో అమెరికాకు చెందిన వారి సంపద 5,500 కోట్ల డాలర్లు కాగా... చైనాకు చెందినవారిది 1,400 కోట్ల డాలర్లు. ఎందుకు ఈ నష్టాలు.. ? అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టిన జెరోమి పావెల్ ఇటీవలే అమెరికా సెనేట్‌లో ప్రసంగించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీ పటిష్టంగా ఉందని, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో నిమిత్తం లేకుండా రేట్లు పెంచుతామని సంకేతాలిచ్చారు. అమెరికా వ్యవస్థ అంచనాలకు మించి పుంజుకుం టుండటంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా అంచనాలను మించిన వేగంతో రేట్లను పెంచుతుందన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. దీంతో ఈ మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్ భారీగానే నష్టపోయింది. ఇక తాజాగా అమెరికాకు దిగుమతి అవుతున్న ఉక్కు ఉత్పత్తులపై 25 శాతం, అల్యూమినియమ్ ఉత్పత్తులపై 10 శాతం మేర సుంకాలు విధిస్తామని, ఈ సుంకాలు వచ్చే వారం నుంచే ఆరంభమవుతాయని, దీర్ఘకాలం పాటు అమల్లో ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో అమెరికా స్టాక్ మార్కెట్ గురువారం భారీగా పతనమైంది. ఈ సుంకాల విధింపు వాణిజ్య యుద్ధాలకు దారితీస్తుందని అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్లేషణ. -
వారెన్ బఫెట్ కు దిమ్మదిరిగే షాక్!
-
వారెన్ బఫెట్ కు దిమ్మదిరిగే షాక్!
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (86) దిమ్మతిరిగే షాక్ తగిలింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లో లెజండరీ ఇన్వెస్టర్ గా పేరొందిన బఫెట్ కేవలం ఒక్క రోజులో వేల కోట్ల రూపాయలను నష్టపోవడం మార్కెట్ వర్గాలను విస్మయపర్చింది. 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,375 కోట్లు) నష్టపోయాడు. బఫెట్ మేజర్ పెట్టుబడులు పెట్టిన అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల యాజమాన్య సంస్థ ఫార్గో అండ్ కో భారీ కుంభకోణంలో ఇరుక్కుకోవడంతో ఈ పరిణామం సంభవించింది. 65.8 బిలియన్ డాలర్ల తోప్రపంచంలోనే నాలుగో అత్యధిక ధనవంతుడిగా ఉన్న బఫెట్ వేలకోట్ల సంపద క్షణాల్లోఆవిరైపోయింది. బఫెట్ కు చెందిన బెర్కషైర్ హాత్వే ఇంక్ వెల్స్ ఫార్గో లో అత్యధిక వాటాను కలిగింది. నిబంధనలను విరుద్ధంగా రెండు మిలియన్లకు పైగా అకౌంట్లు తెరిచారన్న ఆరోపణలతో 185 మిలియన్ డాలర్లను జరిమానాను కంపెనీ ఎదుర్కోంటోంది. సంస్థ ఉద్యోగులు ఆయా ఖాతాదారుల అనుమతులు లేకుండా 20 లక్షలకు పైగా ఖాతాలు తెరిచిరన కుంభకోణం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా వేల్స్ ఫార్గో ఈక్విటీ విలువ 3.3 శాతానికి పైగా పడిపోయింది. దీంతో ఈ సంస్థలో అత్యధిక వాటాదారుగా ఉన్న బెర్క్ షైర్ హాత్ వే ఈక్విటీ 2 శాతం పడిపోయింది. మరోవైపు ఈ భారీ జరిమానా సంస్థను తీవ్రంగా బాధించిందని , తమ ప్రతిష్టకు భంగం కలిగిందని బ్యాంక్ ప్రకటించింది. రిటైల్ బ్యాంకర్ల దూకుడు ఉత్పత్తి అమ్మకపు గమ్యాలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వెల్స్ ఫార్గో సీఈవో జాన్ స్టంఫ్ వచ్చేవారం సెనేట్ బ్యాంకింగ్ కమిటీముందు హాజరు కానున్నారు. 2013 లో లాస్ ఏంజిల్స్ టైమ్స్ విచారణ లో ఈ విషయంలో తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేసిన ఫార్గో అనుమతిలేకుండా ప్రారంభించిన ఖాతాలకు సంబంధించిన ఫీజును వాపస్ చేస్తామని వెల్లడించింది.