‘జిమ్మీ’ ఇక లేదు...
రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ ఏఆర్‌ఐ క్వార్టర్స్ ప్రాంతవాసులకు రక్షణగా ఉన్న జిమ్మీ(కుక్క) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. గత ఐదు సంవత్సరాలుగా క్వార్టర్స్ వాసులను విషసర్పాల నుంచి కంటికి రెప్పలా కాపాడుతున్న జిమ్మీ...గత ఎనిమిది నెలల క్రితం రక్తపింజరి కాటుకు గురైన అస్వస్థకు గురైంది. ఆ సమయంలో స్థానిక వెటర్నరీ డాక్టర్లు ప్రథమ చికిత్స నిర్వహించారు. అప్పటి నుంచి అనారోగ్యంగా ఉన్న జిమ్మీ శుక్రవారం ఉదయం మృతి చెందింది.
విషయం తెలుసుకున్న స్థానికులు అదే ప్రాంతంలో గోతి తీసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జమ్మీకి తోడుగా మరో కుక్క జానీ క్వార్టర్స్ ప్రాంతానికి వచ్చిన దాదాపు 40 కిపైగా పాములను కరిచి చంపాయి. క్వార్టర్స్‌వాసులు ఈ కుక్కల ఆలనాపాలనా చూసేవారు. క్వార్టర్స్‌లోకి విషసర్పాలతో పాటు ఏ జంతువులను, ఇతరులెవ్వరిని లోనికి రానిచ్చేవి కాదు. జిమ్మీ మృతదేహం వద్ద జానీ రోదిస్తూ కూర్చోవడం స్థానికులను కంటతడి పెట్టించింది.