
6 కాళ్ల శునకం
నాలుగు కాళ్ల కుక్కను అందరూ చూస్తారు. కానీ, ఆరు కాళ్లు, రెండు తోకలున్న కుక్కను చూసి ఉండరు. ఆ బుల్లి ఆడ కుక్క ఇదే. పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా ద్వీపంలో బుధవారం పుట్టింది. రెండు శరీరాలు ఉదర భాగంలో అతుక్కున్నట్లు పుట్టిన ఈ పప్పీకి కిందివైపు నాలుగు కాళ్లు, చెరో పక్కన రెండు కాళ్లు.. మొత్తం ఆరు కాళ్లున్నాయి. గొర్రెలు, పశువులు కొన్నిసార్లు ఇలా విచిత్రరీతిలో పుడతాయని, కుక్కల్లో ఇలాంటిది నిజంగానే అరుదైన విషయమని వెటర్నరీ వైద్యులు చెప్పారు. పుట్టిన కొద్దిగంటలకే ఈ బుల్లి శునకం మరణించింది.