tonga island
-
వామ్మో.. వందల అణు బాంబుల ఎఫెక్ట్‌తో బద్ధలైందా?
హుంగా టోంగా-హుంగా హాపై.. పదిరోజుల క్రితం దాకా పసిఫిక్ మహాసముద్రంలోని జనావాసరహిత దీవిగా ఉండేది. మరి ఇప్పుడో?.. ఏకంగా మ్యాప్ నుంచే కనుమరుగు అయిపోయింది. కారణం.. ఆ దీవిలోని అగ్నిపర్వతం భారీ శబ్ధాలతో బద్ధలైపోవడమే!. జనవరి 15వ తేదీన చిన్న దీవి దేశం టోంగాకు దగ్గర్లో ఉన్న ‘హుంగా టోంగా-హుంగా హాపై’ అగ్నిపర్వత దీవి.. మహాసముద్రం అడుగులోని అగ్నిపర్వతం బద్ధలుకావడంతో పూర్తిగా నాశనమైంది. ఆ ప్రభావం ఎంతగా ఉందంటే.. సముద్రం ముందుకు వచ్చి పెద్ద పెద్ద అలలతో సునామీ విరుచుకుపడింది. టోంగా రాజధాని నుకువాలోఫాపై దట్టమైన మందంతో విషపూరితమైన బూడిద అలుముకుంది. తాగే నీరు కలుషితం అయ్యింది. పంటలు దెబ్బతిన్నాయి. రెండు గ్రామాలు ఏకంగా జాడ లేకుండా సముద్ర గర్భంలో కలిసిపోయాయి!. ఈ ప్రకృతి విలయంపై నాసా సైంటిస్టులు ఇప్పుడు సంచలన ప్రకటన చేశారు. టోంగా అగ్నిపర్వతం బద్ధలైన ఘటన.. వంద హిరోషిమా అణు బాంబు ఘటనలకు సమానమని నాసా పేర్కొంది. ఐదు నుంచి ముప్ఫై మెగాటన్నుల టీఎన్టీ(ఐదు నుంచి 30 మిలియన్ టన్నుల) పేలితే ఎలా ఉంటుందో.. అంత శక్తితో ఆ అగ్నిపర్వతం పేలింది. అందుకే అగ్ని పర్వత శకలాలు 40 కిలోమీటర్ల ఎత్తులో ఎగసిపడ్డాయి అని నాసా సైంటిస్టుల జిమ్ గార్విన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే 1945, ఆగష్టులో హిరోషిమా(జపాన్) పడిన ఆటం బాంబు 15 కిలోటన్నుల(15 వేల టన్నుల) టీఎన్టీ డ్యామేజ్ చేసింది. కేవలం ఒక్క నగరాన్ని మాత్రమే నామరూపాలు లేకుండా చేసింది. ఇప్పుడు అగ్నిపర్వతం ధాటికి సముద్రం కదిలి.. ఎక్కడో వేల కిలోమీరట్ల దూరంలోని తీరాల దగ్గర ప్రభావం చూపెట్టింది. ఇక టోంగాలో సునామీ ధాటికి ప్రాణ నష్టం పెద్దగా సంభవించకపోయినా!(స్పష్టత రావాల్సి ఉంది).. ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. జపాన్, న్యూజిలాండ్‌తోపాటు పసిఫిక్ తీరంలోని చాలా దేశాలు సునామీ అలర్ట్ జారీ చేసి.. 48 గంటల పరిశీలన తర్వాత విరమించుకున్నాయి. సంబంధిత వార్త: సునామీకి ఎదురీగిన తాత.. అందుకే ప్రపంచం జేజేలు -
ఏం సాహసం చేసినవ్ తాతా.. నీ తెగువకు సలాం
పిడుగులు పడ్డట్లు భారీ శబ్ధం.. ఆపై భూ ప్రకంపనలు.. హఠాత్తుగా ముందుకొచ్చిన సముద్రపు అలలతో సునామీని కళ్లారా వీక్షించింది టోంగా. పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వతం బద్ధలైన ఘటనతో ఆ చిన్న ద్వీప దేశానికి తీరని నష్టం వాటిల్లింది. అయితే సముద్రపు అలల్లో 27 గంటలపాటు ఈది.. ప్రాణాలతో బయటపడ్డ ఓ పెద్దాయన సాహసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత శనివారం పసిఫిక్‌లోని భారీ అగ్నిపర్వతం హుంగా టోంగ-హుంగ హాపయ్ అగ్నిపర్వతం బద్ధలైంది. ఆ ధాటికి సునామీ చెలరేగగా.. ఆ మహాసముద్రం అలలు వేల కిలోమీటర్ల దూరంలోని తీరాలను సైతం తాకాయి. ఇదిలా ఉంటే దగ్గర్లో ఉన్న టోంగాను అతలాకుతలం చేసింది ఈ ఘటన. అయితే సముద్రపు అలల్లో చిక్కుకుపోయిన 57 ఏళ్ల లిసలా ఫోలావ్.. తన చావు ఖాయమని అనుకున్నాడు. అలాగని చావుకి లొంగిపోలేదు. ఎలాగైనా బతకాలన్న తాపత్రయంతో వైకల్యాన్ని లెక్కచేయకుండా ప్రయత్నించి గెలిచాడు. టోంగా రాజధాని నుకువాలోఫాకు ఈశాన్యంవైపు 8 కి.మీ. దూరంలోఉంది అటాటా అనే ఓ చిన్న దీవి. ఈ దీవి జనాభా 60 మంది. లిసలా ఫోలావ్ తన కొడుకుతో పాటు ఆ దీవిలో జీవిస్తున్నాడు. వైకల్యం ఉన్న ఆ పెద్దాయన సరిగా నడవలేడు కూడా. సునామీ ఒక్కసారిగా విరుచుకుపడడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అంతా నేల ప్రాంతం వైపు పరుగులు తీశారు. కానీ, ఆ పెద్దాయన మాత్రం పాపం నీటి ఉధృతికి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. మొదట ఒడ్డులోని ఓ చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడిన ఆ పెద్దాయన.. ఆ టైంలో దూరంగా కనిపిస్తున్న తన కొడుక్కి తన అరుపుల్ని వినిపించాలని ప్రయత్నించాడు. ఇంతలో రెండో అల భారీగా రావడంతో ఆయన సముద్రంలోకి కొట్టుకునిపోయాడు. ఇక తన పని అయిపోయిందని నీళ్లలో మునిగిపోతున్న ఆయన.. వచ్చిన కొద్దిపాటితో ఈతతో ప్రాణాల్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ప్రాణ తీపి ఆయన్ని అలా 27 గంటలపాటు ముందుకు తీసుకెళ్లింది. మధ్యలో తొమ్మిదిసార్లు నీటి అడుగుభాగానికి చేరుతూ జీనవర్మణ పోరాటం చేశాడట ఆ పెద్దాయన. చివరికి ఏడున్నర కిలోమీటర్లు ఆపసోపాలు పడుతూ ఈదాక.. టోంగాటపు నేల భాగానికి చేరుకున్నాడు. ఆ టైంలో రెస్క్యూ టీం ఆయన్ని గుర్తించి.. ఆస్పత్రికి తరలించింది. అలా పెద్దాయన మృత్యుంజయుడిగా బయటపడడంతో పాటు సోషల్ మీడియాలో హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అంత ఓర్పుతో ఆయన చేసిన ప్రయత్నం గురించి చర్చించుకుంటున్నారు. ఇంకొందరైతే రియల్ లైఫ్ అక్వామ్యాన్గా ఈ పెద్దాయన్ని అభివర్ణిస్తున్నారు. ప్రయత్నించకుండా ఫలితం ఆశించడం మనిషి నైజం. అది మారనంత వరకు జీవితంలో ముందుకు వెళ్లలేరన్న విషయం ఈ పెద్దాయన కథ ద్వారా స్పష్టమవుతోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. So this happened in Tonga today! Massive Underwater volcanic eruption sending shockwave across South Pacific as captured by Himawari Satellite! Tsunami just hit Tonga and some region of Fiji Island! Prayers for people there!#Tsunami pic.twitter.com/7Q4mRhNcVQ — Vishal Verma (@VishalVerma_9) January 15, 2022 ఇదిలా ఉంటే సునామీ ధాటికి లక్షకు పైగా జనాభా ఉన్న టోంగా ద్వీపదేశం కుదేలు అయ్యింది. ముగ్గురు చనిపోయారని అధికారులు ప్రకటించగా.. తీర ప్రాంతంలోని నివాసాలు, రిసార్టులు ఘోరంగా దెబ్బతిన్నాయి. బయటి ప్రపంచంతో కమ్యూనికేషన్ పునరుద్ధరణ కోసం నెల టైం పడుతుందని అంచనా వేస్తున్నారు. -
కష్ట కాలంలో టోంగా దేశానికి అండగా స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్..!
కొద్ది రోజుల క్రితం టోంగాకు సమీపంలో ఉన్న సముద్రంలో ఒక భారీ అగ్నిపర్వతం బద్దలవడంతో ఆకాశమంతా ధూళి మేఘాలతో నల్లబారడం, ఆ వెంటనే విరుచుకుపడిన జల ప్రళయం(సునామీ)తో ఈ చిన్న టోంగా దేశం చిగురుటాకులా వణికిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రకృతి విలయం సృష్టించిన నష్టం అంచనాలకు చిక్కడం లేదు. ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్స్ నెట్వర్క్ తెగిపోవడంతో ఆ దేశంతో ఇతర దేశాలు సంప్రదించడానికి కొంచె కష్టం అవుతుంది. ఈ విపత్తుల వల్ల సముద్రగర్భ కేబుల్ తెగిపోవడంతో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ దేశానికి ఇంటర్నెట్ సేవలు తిరిగి అందించడానికి కనీసం ఒక నెల పాటు సమయం పడుతుందని రాయిటర్స్ ఒక నివేదికలో తెలిపింది. ట్విటర్ వేదికగా పోస్టు చేసిన ఈ నివేదికకు స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ ట్విట్టర్లో స్పందించారు. ఆ దేశ ప్రజలు కోరితే స్టార్ లింకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి సిద్దంగా ఉన్నట్లు మస్క్ పేర్కొన్నారు. ఉత్తరం న్యూజిలాండ్ పార్లమెంటు సభ్యుడు షేన్ రెటి కూడా టోంగా దేశానికి స్టార్ లింక్ కమ్యూనికేషన్ సేవలను అందించాలని ఎలన్ మస్క్‌కు ట్విటర్ వేదికగా ఒక లేఖ రాశారు. Could people from Tonga let us know if it is important for SpaceX to send over Starlink terminals? — Elon Musk (@elonmusk) January 21, 2022 ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ అనేది ఎటువంటి కేబుల్ అవసరం లేకుండానే ఉపగ్రహాల ఆధారంగా ఇంటర్నెట్ అందిస్తుంది. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ వేగం కూడా ఇతర వాటితో పోలిస్తే చాలా వేగంగా ఉంటుంది. ఈ ఏడాది చివరినాటికి మన దేశంలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించాలని మస్క్ చూస్తున్నారు. టోంగాకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. టోంగాకు పశ్చిమంగా పసిఫిక్ సముద్రంలో తలెత్తిన సునామీ టోంగాను ముంచెత్తింది. పసిఫిక్ అంతటా సునామీ అలలు ఎగసిపడ్డాయి. సునామీ కూడా ఉపశమించినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు అగ్ని పర్వతం నుండి విస్ఫోటనాలు కొనసాగుతుండడంతో అక్కడ వాతావరణ పరిస్థితులు, ఆ ప్రభావంతో చుట్టుపక్కల వాతావరణంలో నెలకొనే ప్రభావాల పట్ల పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న టోంగాకు సాయం చేయడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. (చదవండి: సరికొత్త విప్లవం: అమెజాన్ బట్టల దుకాణం) -
టోంగా సముద్రగర్భంలో.. అగ్నిపర్వతం పేలుడు
వెల్లింగ్టన్: దక్షిణ ఫసిఫిక్ సముద్రంలోని ద్వీపకల్పమైన టోంగాలో సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం శనివారం బద్దలవడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. సముద్రం లోపల ఉన్న హుంగా టోంగా హాపై అనే అగ్నిపర్వతం వరసగా రెండు రోజులు పేలడంతో టోంగా వ్యాప్తంగా బూడిద మేఘాలు కమ్ముకున్నాయి. ఈ బూడిద 19 కి.మీ.ఎత్తువరకు వ్యాపించినట్లు టోంగా జియోలాజికల్ సర్వే తెలిపింది. అమెరికా నుంచి జపాన్ వరకు తీరప్రాంతంలోని పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎంత నష్టం జరిగిందనేది తెలియలేదు. లక్షకు పైగా జనాభా ఉన్న టోంగా తీరప్రాంతంలో భారీగా అలలు ముంచెత్తుతున్న వీడియోలను ప్రజలు సోషల్‌మీడియాలో షేర్చేశారు. ముప్పు తొలగిపోవడంతో అమెరికాలో సునామీ హెచ్చరికల్ని వెనక్కి తీసుకున్నారు. -
ముందుకొస్తున్న పసిఫిక్.. పలు దేశాలు గజగజ
పసిఫిక్ మహాసముద్రం దక్షిణ భాగంలో టోంగా దగ్గర అగ్నిపర్వతం భారీ శబ్ధంతో శనివారం బద్ధలైన సంగతి తెలిసిందే. ఆ ధాటికి భారీ ఎత్తున అలలు ఎగసి పడుతుండడంతో తీర ప్రాంతాలు అప్రమత్తం అవుతున్నాయి. చాలా చోట్ల సముద్ర జలాలు ముందుకు దూసుకురావడంతో.. అల్లకల్లోలం నెలకొంది. Tsunami Warning For Some Pacific Coastal Countries: ఈ పరిణామంతో టోంగాతో పాటు అమెరికన్ సమోవా, న్యూజిలాండ్, ఫిజీ, వనువాటు, చిలీ, ఆస్ట్రేలియా.. సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. నాలుగు అడుగుల ఎత్తుతో అలలు ఎగసిపడగా.. టోంగా రాజధాని నుకువాలోఫా ప్రజలు వణికిపోయారు. భారీ శబ్ధంతో భూమీ కంపించడంతో పాటు సముద్రపు నీరు నగరంలోకి చొచ్చుకుని వచ్చిందని ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ ప్రకటించింది. టోంగా రాజు ప్యాలెస్ నుంచి ఇప్పటికే సురకక్షిత ప్రాంతానికి తరలిపోగా.. తన పౌరులను అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపు ఇచ్చాడు. నష్టం వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున అమెరికా, జపాన్, సైతం ఇప్పుడు సునామీ హెచ్చరికలతో అప్రమత్తం అయ్యాయి. జపాన్ తీర ప్రాంతం వెంబడి 11 అడుగుల మేర అలలు ఎగసిపడే అవకాశం ఉందని భావిస్తోంది వాతావరణ సంస్థ. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తోంది. మరోవైపు అమామీ ఒషీమా ద్వీపంలోకి 1.2 మీటర్ ఎత్తుతో అలలు ఎగసిపడినట్లు తెలుస్తోంది. అమెరికా, కెనడా పశ్చిమ తీరం వెంట సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కాలిఫోర్నియా, అలస్కా వెంట చిన్నపాటి వరదల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హవాయ్ అప్రమత్తం అయ్యింది. ఓరేగావ్ తీరం వెంట సముద్రపు అలలు ముందుకు వస్తున్నాయి. So this happened in Tonga today! Massive Underwater volcanic eruption sending shockwave across South Pacific as captured by Himawari Satellite! Tsunami just hit Tonga and some region of Fiji Island! Prayers for people there!#Tsunami pic.twitter.com/7Q4mRhNcVQ — Vishal Verma (@VishalVerma_9) January 15, 2022 Stay safe everyone 🇹🇴 pic.twitter.com/OhrrxJmXAW — Dr Faka’iloatonga Taumoefolau (@sakakimoana) January 15, 2022 వీడియో: టోంగా దగ్గర పేలిన అగ్నిపర్వతం -
పసిఫిక్‌లో అల్లకల్లోలం.. భారీ శబ్ధాలతో సునామీ హెచ్చరికలు
పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ ప్రభావంతో తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బూడిద ఆవరించింది. ఆకాశంలో 20 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలు అలుముకున్నాయి. భారీ ప్రకంపనల కారణంగా.. సముద్ర జలాలు ముందుకు చొచ్చుకునిరాగా.. కొన్ని దేశాలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. టోంగా జియోలాజికల్ సర్వీసెస్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. పసిఫిక్‌లో అనేక ద్వీపదేశాలు.. మహాసముద్ర అంతర్భాగంలో అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. టోంగాకు సమీపాన అగ్నిపర్వతం హుంగా టోంగా-హుంగా హాపై హఠాత్తుగా బద్దలైంది. ది హుంగా టోంగా హాపై అగ్నిపర్వతం.. టోంగాన్ రాజధాని నుకువాలోఫాకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. విస్ఫోటనం తాలూకు శబ్దాలు 8 నిమిషాల పాటు కొనసాగాయి. విస్ఫోటనం తీవ్రత ఎంతగా ఉందంటే, అక్కడికి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీ దీవుల్లోనూ శబ్దాలు వినిపించాయట!. Stay safe everyone 🇹🇴 pic.twitter.com/OhrrxJmXAW — Dr Faka’iloatonga Taumoefolau (@sakakimoana) January 15, 2022 కాగా సముద్రంలో అగ్నిపర్వతం పేలుడును పలు శాటిలైట్లు చిత్రీకరించాయి. హిమావరీ శాటిలైట్ చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అగ్నిపర్వతం పేలుడు ధాటికి న్యూజిలాండ్, టోంగా, ఫిజీ వంటి దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల వాసులు తమ నివాసాలను వదిలి వెళ్లాలని, ఎత్తయిన ప్రదేశాలకు చేరుకోవాలని పలు దేశాల్లో అప్రమత్తం చేస్తున్నాయి. శుక్రవారం సునామీ హెచ్చరికలు వెనక్కి తీసుకున్న కొన్ని గంటలకే.. ఈ పరిణామంతో మళ్లీ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. మరోవైపు కొన్ని పాత, ఫేక్ వీడియోలు సైతం సునామీ పేరిట వైరల్ అవుతున్నాయి. The volcanic eruption in Tonga captured by #Himawari satellite.. Massive!😳 pic.twitter.com/1qy4FJgpvM — Raj Bhagat P #Mapper4Life (@rajbhagatt) January 15, 2022 A second tsunami event near Tonga has triggering warnings for Australia, Fiji, New Zealand, Vanuatu, Samoa, Lord Howe and Norkfolk Island. https://t.co/j72Me4KLjv pic.twitter.com/JrnMkKH6wX — The Australian (@australian) January 15, 2022 -
గుడ్‌న్యూస్: మార్స్‌పై చిగురిస్తున్న ఆశలు!
వెల్లింగ్టన్ : అంగారక గ్రహం (మార్స్)పై జీవం మనుగడ సాగించగలదా.. అక్కడి బౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్న ఆసక్తికర విషయాలు త్వరలోనే మనకు తెలిసే అవకాశాలున్నాయి. ఇటీవల కనుగొన్న ప్రపంచంలోనే కొత్త ద్వీపం, మార్స్ పై మనకు తెలియని కీలక విషయాలు తెలుసుకునేందుకు దోహదపడుతుందని నాసా ప్రయోగాలలో తేలింది. టోంగా రాజధాని నుకుఅలోఫాకు వాయవ్యదిశలో 65 కిలోమీటర్ల దూరంలో హంగా టోంగా హంగా హాపాయ్ రోస్ అనే ద్వీపాన్ని ఇటీవల గుర్తించారు. మార్స్ మీద కోట్ల ఏళ్ల కిందట ఏర్పడిన ద్వీపాలు, ద్వీపకల్పాలకు సంబంధించిన సమాచారం ఈ కొత్త ద్వీపంపై జరిపే పరిశోధనలతో తెలియనుందని నాసా విశ్వసిస్తోంది. సాధారణంగా భూమిపై ఉండే వాతావరణం ఇక్కడ లేదని, ఈ ద్వీపంలో భౌగోళిక పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయని నాసా గోడార్డ్ స్పెస్ ఫ్లైట్ సెంటర్ చీఫ్ సైంటిస్ట్ జిమ్ గార్విన్ వెల్లడించారు. అగ్నిపర్వతాలు బద్ధలు కావడంతో ఏర్పడిన ద్వీపంలో అంగారకుడితో పోల్చదగ్గ వాతావరణం ఉన్నట్లు భావిస్తున్నారు. అగ్నిపర్వతాలు బద్ధలవ్వడంతో టఫ్ అనే సిమెంట్ కంటే గట్టి పదార్థాలు తయారయ్యాయని.. అక్కడక్కడ గుంతలు గుంతలుగా భూభాగం ఉందన్నారు. అంగారకుడిపై కూడా అగ్నిపర్వతాలు బద్ధలవడంతో ఉద్భవించిన ఎన్నో ద్వీపాలున్నాయని, టోంగా సమీపంలోని ద్వీపంపై పరిశోధనలతో మార్స్ పై జీవం మనుగడ, ఉనికిపై స్పష్టత వస్తుందని నాసా శాస్త్రవేత్త వివరించారు. హంగా టోంగా హంగా హాపాయ్ రోస్ ద్వీపంపై నాసా శాస్త్రవేత్తల బృందం చేస్తున్న పరిశోధనలపై చర్చించేందుకు ఈ వారం న్యూ ఓర్లీన్స్ లో అమెరికన్ జియోగ్రాఫికల్ యూనియన్ సమావేశం జరగనుంది. చంద్రుడిపైకి మరోసారి మనుషులను పంపాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాసా శాస్త్రవేత్తలకు సూచించిన విషయం తెలిసిందే. దీంతో భవిష్యత్తులో మార్స్‌పైకి మరిన్ని ప్రయోగాలు చేపట్టేందుకు అమెరికా సన్నద్ధమవుతుందని తెలుస్తోంది. -
6 కాళ్ల శునకం
నాలుగు కాళ్ల కుక్కను అందరూ చూస్తారు. కానీ, ఆరు కాళ్లు, రెండు తోకలున్న కుక్కను చూసి ఉండరు. ఆ బుల్లి ఆడ కుక్క ఇదే. పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా ద్వీపంలో బుధవారం పుట్టింది. రెండు శరీరాలు ఉదర భాగంలో అతుక్కున్నట్లు పుట్టిన ఈ పప్పీకి కిందివైపు నాలుగు కాళ్లు, చెరో పక్కన రెండు కాళ్లు.. మొత్తం ఆరు కాళ్లున్నాయి. గొర్రెలు, పశువులు కొన్నిసార్లు ఇలా విచిత్రరీతిలో పుడతాయని, కుక్కల్లో ఇలాంటిది నిజంగానే అరుదైన విషయమని వెటర్నరీ వైద్యులు చెప్పారు. పుట్టిన కొద్దిగంటలకే ఈ బుల్లి శునకం మరణించింది.