మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో త్వరలో జిమ్నీ SUVని అధికారికంగా విడుదల చేయనుంది, ఇప్పటికే ఈ కొత్త మోడల్ కోసం 23,500 కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయి. కాగా ఎంపిక చేసిన నెక్సా అవుట్‌లెట్లలో ఈ కొత్త కారు డిస్‌ప్లే కూడా ప్రారంభమైంది. త్వరలో మరిన్ని అవుట్‌లెట్లలో దర్శనమిచ్చే అవకాశం ఉంది.
2023 ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసిన జిమ్నీ మే నెలలో విక్రయానికి రానున్నట్లు సమాచారం, కానీ అంతకంటే ముందు ఏప్రిల్ 7 నుంచి భారతదేశంలో మరికొన్ని నగరాల్లోని డీలర్‌షిప్‌లలో కనిపించనుంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ NCR, అహ్మదాబాద్, చండీగఢ్, మొహాలి, లూథియానా, రాయ్‌పూర్, భువనేశ్వర్, బెంగళూరు వంటి నగరాల్లో ప్రదర్శన మొదలైపోయింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు అక్కడ జిమ్నీ కారుని పరిశీలించవచ్చు.
మారుతి జిమ్నీ ఉత్పత్తి గురుగ్రామ్ ప్లాంట్‌లో జరుగుతుంది. ఇక్కడ నుంచే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు విక్రయించనుంది. కంపెనీ సంవత్సరానికి లక్ష యూనిట్లను ఉత్పత్తి చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ప్రతి నెల 7,000 యూనిట్లను భారతీయ మార్కెట్లో, మిగిలినవాటిని విదేశీయ మార్కెట్లో విక్రయించనున్నట్లు సమాచారం.
(ఇదీ చదవండి: ప్రపంచంలో అతిపెద్ద లిక్కర్ సామ్రాజ్యం: ఇకపై మహిళ సారథ్యంలో..)
మారుతి సుజుకి జిమ్నీ డిజైన్ పరంగా చాలా ఆధునికంగా ఉండటమే కాకుండా, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇది జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్స్‌లో విడుదలకానుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది.
కొత్త మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ K15B పెట్రోల్ ఇంజన్‌తో 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇది కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఎస్‌యువి ధరలు ఇంకా అధికారికంగా విడుదల కాలేదు, కానీ దీని ప్రారంభ ధర రూ. 12 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment